ఆయన అంటే ఇష్టం.. అదొక్కటే నా కోరిక.. సాయేషా
తెలుగులో అక్కినేని నటవారసుడు అఖిల్‌తో కలిసి అఖిల్ చిత్రంలో నటించిన సాయేషా సైగల్ టాలీవుడ్ వదిలేసి.. తమిళంలో జోరు కొనసాగిస్తున్నది. వనయుద్ధం, గజనీకాంత్, జుంగా, కడైకుట్టి సింగం చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
కోలీవుడ్‌లో దూసుకెళ్తున్న సాయేషా ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుదేవా దర్శకత్వంలో నటించాలని ఉంది. ఆయన డ్యాన్స్ అంటే ఇష్టం. ఆయన స్ఫూర్తి పది రకాల డ్యాన్స్‌లు నేర్చుకొన్నాను. డ్యాన్స్ నేపథ్యంగా ఆయన దర్శకత్వంలో నటించాలనే నా కోరిక అని చెప్పారు.

ప్రభుదేవా దర్శకత్వంలో కార్తీ, విశాల్ మల్టీస్టారర్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. కానీ ఆ చిత్రం ఎందుకో ఆగిపోయింది. దాంతో నా కోరిక తీరలేదు అని చెప్పారు. దక్షిణాది భాషలపై పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్నాను. ఒకరు చెప్పే డైలాగ్స్‌ను అప్పజెప్పడం నాకు నచ్చదు అని సాయేషా చెప్పారు.
కెరీర్ ఆరంభంలోనే కార్తీ, ఆర్య, విజయ్ సేతుపతితో నటించే అవకాశం రావడం నిజంగా అదృష్టమే అని సాయేషా పేర్కొన్నారు. భాష ముఖ్యం కాదు. కథాబలం ఉన్న చిత్రాల్లో నటించాల్లనేదే నా ఉద్వేశం అని అన్నారు.


Click it and Unblock the Notifications











