ఆ హీరోయిన్ స్టెప్పులు కేక.. ఓరి దేవుడో అనాల్సిందే.. డ్యాన్స్‌తో ఊపేస్తోన్న హీరో భార్య

కోలీవుడ్ స్టార్ కపుల్స్ ఆర్య-సాయేషా గురించి అందరికీ తెలిసిందే. రీల్ లైఫ్‌లో తెరపై ప్రేమ పక్షుల్లా కనిపించి నిజ జీవితంలోనూ ఒక్కటయ్యారు. గతేడాది అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. గజినీకాంత్, కాప్పాన్ చిత్రాల్లో కలిసి నటించిన వీరు.. వయో బేధాన్ని లెక్క చేయలేదు. ఆర్య వయసు 38 కాగా.. సయేషా వయసు 22 కావడం అప్పట్లో పెద్ద చర్చ అయినా ఈ జంట మాత్రం వాటిని అంతగా పట్టించుకోలేదు. లాక్ డౌన్‌లో ఎంతో సందడి చేస్తోన్న జంటకు సంబంధించిన వార్తలు తెగ వైరల్ అయ్యాయి.

లాక్ డౌన్‌లో సందడి..

లాక్ డౌన్‌లో సందడి..

ఈ జంట లాక్ డౌన్ సమయాన్ని చక్కగా వినియోగించుకుంటోంది. కొత్తగా పెళ్లి కావడం, చక్కగా ఈ లాక్ డౌన్‌తో అన్యోన్యంగా గడిపేందుకు ఖాళీ టైమ్ దొరికింది. భర్తకు ఇష్టమైన వంటకాలను వండిపెడుతూ సాయేషా తన ప్రేమను చాటుకుంటోంది. అయితే ఈ జంటపై ఓ రూమర్ మాత్రం తెగ హల్చల్ చేసింది.

తల్లి కాబోతోందని..

తల్లి కాబోతోందని..

సాయేషా తల్లి కాబోతోందని నానా హంగామా చేశారు కొందరు నెటిజన్స్. అయితే సాయేషా మాత్రం ఆ వార్తలను సీరియస్‌గా తీసుకుని ఫైర్ అయింది. అందులో ఎలాంటి నిజం లేదని, లాక్‌డౌన్‌ వేళ వేరే పనులే ఉండవా అంటూ అసలు ప్రేగ్నెంట్ అయ్యానని ఎవరికి వారు అలా అనుకుంటే ఎలా అని కాస్త అసహనం వ్యక్తం చేసింది.

 డ్యాన్స్ ప్రాక్టీస్..

డ్యాన్స్ ప్రాక్టీస్..

ఖాళీగా దొరికిన ఈ సమయాన్ని సాయేషా తన ప్రతిభను మెరుగుపర్చుకోవడానికి ఉపయోగించుకుంటోంది. సాయేషా మంచి డ్యాన్సర్ అన్న సంగతి తెలిసిందే. అయినా సరే ఇంకా మెలుకువలు తెలుసుకోవాలని డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూనే ఉంది. ఆ మధ్య క్లాసికల్ డ్యాన్స్‌తో ఆకట్టుకుంది.

Recommended Video

Rumours On Star Hero Arya Wife Sayyeshaa Saigal
ఊపేస్తోన్న సాయేషా..

ఊపేస్తోన్న సాయేషా..

ప్రస్తుతం సాయేషా ఓ వెస్ట్రన్ పాటకు డ్యాన్స్ వేసింది. సాయేషా తన అందాలను ఊపేస్తూ కుర్రకారుకు మతి పోగోడుతోంది. మెలికలు తిరుగుతూ సాయేషా వేసిన స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. రాబోయే సినిమాల్లో సాయేషా తన డ్యాన్స్‌లతో అదరగొట్టబోతోందని తెలుస్తోంది. ప్రస్తుతం కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ చిత్రంతో శాండల్ వుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X