twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆర్య మంచి భర్తే కాదు.. సాయేషా సైగల్ ఇంటస్ట్రింగ్ కామెంట్

    |

    దక్షిణాది చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడు సూర్య నటిస్తున్న తమిళ సినిమా 'కప్పాన్'. తెలుగులో ఈ సినిమా 'బందోబస్త్'గా ప్రేక్షకుల ముందుకొస్తుంది. సూర్యతోపాటు ప్రముఖ నటుడు మోహన్ లాల్, తమిళ హీరో ఆర్య, హీరోయిన్ సాయేషా సైగల్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. సెన్సిబుల్ మ్యూజిక్ డైరెక్టర్ హ్యారీస్ జైరాజ్ సంగీతం అందించిన ఈ చిత్ర పాట‌ల‌ను ఆదివారం చెన్నైలో విడుద‌ల చేశారు. సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ ముఖ్య అతిథిగా హాజ‌రై ఆడియో సీడీల‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా హీరో ఆర్య, ఆయన సతీమణి, హీరోయిన్ సాయేషా సైగల్ ఆసక్తికరంగా మాట్లాడారు. వారు ఏమన్నారంటే..

    Sayyeshaa Saigal about Kaappaan and hero Suriya

    స‌యేషా సైగల్ మాట్లాడుతూ - హీరో సూర్య‌గారు అమేజింగ్ యాక్ట‌ర్‌. బ్యూటీఫుల్ పెర్ఫామ‌ర్. ప్రొఫ‌ష‌న‌లిజం ఉన్న యాక్ట‌ర్‌. ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేయడం ఆనందంగా ఉంది. అలాగే మోహ‌న్‌లాల్‌గారి వంటి స‌హృద‌యుడు, గొప్ప న‌టుడితో క‌ల‌సి ప‌నిచేసే అవ‌కాశం ఈ సినిమాలో ద‌క్కింది. ఆర్య మంచి సపోర్ట్ చేసే భ‌ర్తే కాదు.. మంచి స‌పోర్టింగ్ యాక్ట‌ర్ కూడా. హ్యారీస్ జైరాజ్ గారు అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. సినిమాలో ప‌నిచేసిన ఇత‌ర న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్‌కు థ్యాంక్స్‌ అన్నారు.

    హీరో ఆర్య మాట్లాడుతూ - సూర్య, కె.వి.ఆనంద్‌గారి క‌ల‌యిక‌లో వ‌స్తోన్న మూడో చిత్ర‌మిది. అలాగే సూర్య‌, హ్యారీస్ జైరాజ్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న 9వ సినిమా. ముఖ్యంగా సూర్య‌, హ్యారీస్ జైరాజ్‌గారి కాంబోలో వ‌చ్చిన ప్ర‌తి సినిమా మ్యూజికల్ హిట్‌. ఈ సినిమాలో సాంగ్స్ గురించి నేను ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇక సినిమా గురించి చెప్పాలంటే నేను, కె.వి.ఆనంద్‌గారి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయాల‌ని ఎప్ప‌టి నుంచో ఎదురుచూస్తున్నాను. అలాంటి త‌రుణంలో కేవీ ఆనంద్‌గారు నాకు పిలిచి అవ‌కాశం ఇచ్చారు.

    Sayyeshaa Saigal about Kaappaan and hero Suriya

    చాలా ఫ్రీడమ్ ఇచ్చి ఓ న‌టుడి నుంచి ఎలాంటి న‌ట‌న‌ను రాబ‌ట్టాలో బాగా తెలిసిన ద‌ర్శ‌కుడు కేవీ ఆనంద్. స‌యేషాతో పెళ్లి తర్వాత క‌లిసి చేస్తోన్న చిత్ర‌మిది. బ్యూటీఫుల్ ఎక్స్‌పీరియెన్స్‌. సూర్య‌గారి క్ర‌మ‌శిక్ష‌ణ, క‌ష్ట‌ప‌డే త‌త్వ‌మే ఆయ‌న్ని ఈ స్థాయిలో నిల‌బెట్టింది. అలాగే మోహ‌న్‌లాల్‌గారితో క‌లిసి పనిచేయ‌డం ఆనందంగా ఉంది. ఇక నిర్మాత సుభాస్క‌ర‌న్‌ గారి లాంటి గొప్ప అభిరుచి ఉన్న ప్రొడ్యూస‌ర్ కార‌ణంగానే సినిమా ఇంత బాగా వ‌చ్చింది. బందోబస్త్ సినిమా త‌ప్ప‌కుండా మంచి విజ‌యాన్ని సాధిస్తుంది అని అన్నారు.

    English summary
    Actor Suriya, Sayyeshaa Saigal, Arya, Mohan lal's latest movie is Kaappaan. This movie audio release function held in Chennai. Rajinikanth and Shankar are the Guests. In this function, Rajinikanth made sensational comments on Suriya.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X