Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆర్య మంచి భర్తే కాదు.. సాయేషా సైగల్ ఇంటస్ట్రింగ్ కామెంట్
దక్షిణాది చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడు సూర్య నటిస్తున్న తమిళ సినిమా 'కప్పాన్'. తెలుగులో ఈ సినిమా 'బందోబస్త్'గా ప్రేక్షకుల ముందుకొస్తుంది. సూర్యతోపాటు ప్రముఖ నటుడు మోహన్ లాల్, తమిళ హీరో ఆర్య, హీరోయిన్ సాయేషా సైగల్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. సెన్సిబుల్ మ్యూజిక్ డైరెక్టర్ హ్యారీస్ జైరాజ్ సంగీతం అందించిన ఈ చిత్ర పాటలను ఆదివారం చెన్నైలో విడుదల చేశారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరై ఆడియో సీడీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో ఆర్య, ఆయన సతీమణి, హీరోయిన్ సాయేషా సైగల్ ఆసక్తికరంగా మాట్లాడారు. వారు ఏమన్నారంటే..
సయేషా సైగల్ మాట్లాడుతూ - హీరో సూర్యగారు అమేజింగ్ యాక్టర్. బ్యూటీఫుల్ పెర్ఫామర్. ప్రొఫషనలిజం ఉన్న యాక్టర్. ఆయనతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. అలాగే మోహన్‌లాల్‌గారి వంటి సహృదయుడు, గొప్ప నటుడితో కలసి పనిచేసే అవకాశం ఈ సినిమాలో దక్కింది. ఆర్య మంచి సపోర్ట్ చేసే భర్తే కాదు.. మంచి సపోర్టింగ్ యాక్టర్ కూడా. హ్యారీస్ జైరాజ్ గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. సినిమాలో పనిచేసిన ఇతర నటీనటులు, టెక్నీషియన్స్‌కు థ్యాంక్స్ అన్నారు.
హీరో ఆర్య మాట్లాడుతూ - సూర్య, కె.వి.ఆనంద్‌గారి కలయికలో వస్తోన్న మూడో చిత్రమిది. అలాగే సూర్య, హ్యారీస్ జైరాజ్ కాంబినేషన్లో వస్తోన్న 9వ సినిమా. ముఖ్యంగా సూర్య, హ్యారీస్ జైరాజ్‌గారి కాంబోలో వచ్చిన ప్రతి సినిమా మ్యూజికల్ హిట్. ఈ సినిమాలో సాంగ్స్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక సినిమా గురించి చెప్పాలంటే నేను, కె.వి.ఆనంద్‌గారి దర్శకత్వంలో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాను. అలాంటి తరుణంలో కేవీ ఆనంద్‌గారు నాకు పిలిచి అవకాశం ఇచ్చారు.
చాలా ఫ్రీడమ్ ఇచ్చి ఓ నటుడి నుంచి ఎలాంటి నటనను రాబట్టాలో బాగా తెలిసిన దర్శకుడు కేవీ ఆనంద్. సయేషాతో పెళ్లి తర్వాత కలిసి చేస్తోన్న చిత్రమిది. బ్యూటీఫుల్ ఎక్స్‌పీరియెన్స్. సూర్యగారి క్రమశిక్షణ, కష్టపడే తత్వమే ఆయన్ని ఈ స్థాయిలో నిలబెట్టింది. అలాగే మోహన్‌లాల్‌గారితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. ఇక నిర్మాత సుభాస్కరన్ గారి లాంటి గొప్ప అభిరుచి ఉన్న ప్రొడ్యూసర్ కారణంగానే సినిమా ఇంత బాగా వచ్చింది. బందోబస్త్ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుంది అని అన్నారు.