For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాలయ్యతో కుర్ర హీరోయిన్.. కూతురిగా నటిస్తున్నావా? హీరోయిన్‌గా వద్దంటూ ట్రోలింగ్

  |

  నట సింహం నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే బాక్సాఫీస్‌ రికార్డులకు వణుకు పుట్టాల్సిందే. ఎప్పుడో ప్రారంభం కావాల్సిన ఈ క్రేజీ మూవీ అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ అభిమానులను నిరాశకు గురిచేసింది. అయితే BB3 పేర్కొంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో నటించే హీరోయిన్‌ను నెటిజన్లు ట్రోల్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.. ఆ వివరాల్లోకి వెళితే..

  2019లోనే ప్రాజెక్టు సెట్

  2019లోనే ప్రాజెక్టు సెట్

  బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్‌లో మూడో చిత్రం వాస్తవానికి 2019లోనే ఖరారైంది. అయితే స్క్రిప్టులో కొన్ని మార్పులు చేయమని బాలయ్య సూచించినట్టు వార్తలు వచ్చాయి. దాంతో ఈ చిత్రం సరైన సమయంలో సెట్స్‌పైకి వెళ్లలేకపోయిందనే కారణాలను సినీ వర్గాలు చెబుతుంటాయి.

  మార్చి 2020లో సెట్స్‌పైకి

  మార్చి 2020లో సెట్స్‌పైకి

  అయితే అనేక ఊహగానాల మధ్య BB3 చిత్రం 2020లో మార్చి నెలలో హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కొన్ని వారాలు షూటింగు పూర్తి చేసుకొన్న తర్వాత కరోనావైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో నిరవధికంగా షూటింగ్ వాయిదా పడింది. లాక్‌డౌన్ తర్వాత టాలీవుడ్‌లో సినిమా షూటింగులు జోరందుకోవడంతో బాలయ్య చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేశారు.

  హీరోయిన్‌గా సాయేషా సైగల్

  హీరోయిన్‌గా సాయేషా సైగల్

  బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రానికి పేరున్న సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా, రాంప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో బాలకృష్ణకు హీరోయిన్‌గా సయేషా సైగల్‌ను ఎంపిక చేస్తూ అధికారికంగా ప్రకటన చేశారు. దాంతో బాలయ్యతో నటించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను అంటూ దండాలు పెడుతూ పోస్టుకు రెస్పాన్స్ ఇచ్చింది.

  దారుణంగా సాయేషాను ట్రోలింగ్

  దారుణంగా సాయేషాను ట్రోలింగ్

  బోయపాటి శ్రీను సినిమాలో బాలకృష్ణ సరసన సాయేషా నటిస్తున్నట్టు ద్వారకా క్రియేషన్స్ ట్వీట్ చేసింది. అయితే నెటిజన్లు సాయేషాను టార్గెట్‌ చేస్తూ.. నీవు కూతురిగా నటిస్తున్నావా? అంటూ ఒకరు.. చెల్లెగా లేదంటే మేన కోడలిగా నటించు.. హీరోయిన్‌గా నటించకు అంటూ ట్విట్టర్‌లో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు సూపర్ కాంబో అవుతుందని కూడా కొందరు నెటిజన్లు క్రేజీగా పోస్టులు పెడుతున్నారు.

  #Hyderabad Floods Tollywood Heros Huge Donations హైదరాబాద్‌ కోసం ముందుకొచ్చిన టాలీవుడ్.విరాళాలు
  అఖిల్‌తో కలిసి టాలీవుడ్ ఎంట్రీ

  అఖిల్‌తో కలిసి టాలీవుడ్ ఎంట్రీ

  సాయేషా సైగల్ విసయానికి వస్తే.. తెలుగులో అఖిల్ అక్కినేని సినీ ఎంట్రీగా రూపొందిన అఖిల్ చిత్రంలో నటించారు. ఆ తర్వాత తమిళ చిత్రంలో అవకాశాలు రావడంతో అక్కడే బిజీ అయ్యారు. ఇటీవల తమిళ హీరో ఆర్యను వివాహం చేసుకొని చెన్నైలో స్థిరపడిపోయారు. ఆర్య, సాయేషా వివాహం హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగిన విషయం తెలిసిందే.

  English summary
  South Heroine Sayyeshaa Saigal to pair up with Nandamuri Balakrishna for Boyapati Srinu's BB3. Dwaraka Creations tweeted that, Welcoming beautiful & talented actress sayyeshaa on board for #BB3. Looking forward to seeing you soon on sets.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X