మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిన హాట్ బ్యూటీ సీరత్ కపూర్.. ఈసారైనా హిట్టు కొడుతుందా?
టాలీవుడ్ లో ప్రస్తుతం హీరోయిన్స్ కొరత గట్టిగానే ఉంది. కానీ ఎంత మంది హాట్ బ్యూటీలు ఖాళీగా ఉన్న స్టార్ హీరోల సరసన ఛాన్సులు అంత ఈజీగా దక్కడం లేదు. ఇక రన్ రాజా రన్ సినిమాతో గ్లామర్ బ్యూటీగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన నార్త్ గర్ల్ సీరత్ కపూర్ గత కొంత కాలంగా పెద్ద సినిమాల్లో ఛాన్స్ దక్కించుకోవాలని బాగానే కష్టపడుతోంది.
ఆ మధ్య బికినీ షోతో షాక్ ఇచ్చి రాజు గారి గాది 2, ఒక్క క్షణం, టచ్ చేసి చూడు వంటి సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుంది. కానీ అవి వర్కౌట్ కాలేదు. ఇక మొన్న కృష్ణ అండ్ హిస్ లీలా సినిమాతో పరవాలేదు అనిపించిన సీరత్ మళ్ళీ ఎప్పటిలానే కొత్త అవకాశాలను అందుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోసారి రవితేజతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.

రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు ఖిలాడి అనే టైటిల్ ని అనుకుంటున్నారు. దాదాపు సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఏండింగ్ కి వచ్చేశాయి. ఇక సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ని అనుకుంటుండగా ఒక హీరోయిన్ గా సీరత్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











