జీరో సైజ్ లోకి మారి సీరత్ కపూర్ హాట్ ట్రీట్.. ఎద అందాలు ఆరబోస్తూ తొలిసారిగా అలా?
సీరత్ కపూర్ కి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఆమె తెలుగువారందరికీ సుపరిచితమే. ఈ మధ్య కాలంలో పెద్దగా అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న ఆమె ఇప్పుడు అవకాశాల కోసం హాట్ ఫోటో షూట్ చేస్తూ జనాల్లోకి వదులుతోంది. తాజాగా చేసిన జీరో సైజ్ లోకి మారి చీర కట్టుకుని చేసిన ఆమె హాట్ ఫోటోషూట్ ఒకటి వైరల్ గా మారింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

చిన్నప్పటి నుంచి
ముంబైలో పుట్టి పెరిగిన సీరత్ కపూర్ కి చిన్నప్పటి నుంచి సినిమా అంటే చాలా ఆసక్తి అందుకే చిన్నప్పటి నుంచి డాన్స్ కూడా నేర్చుకుని ఎప్పటికైనా సినిమా హీరోయిన్ కావాలని కలలు కంటూ ఉండేది. చదువు పూర్తి అయ్యాక ముందు మోడలింగ్ కూడా చేసిన ఆమె తన కల నెరవేర్చుకోవడం కోసం యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో చేరి నటన కూడా నేర్చుకుంది.

రన్ రాజా రన్
యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో అనుకోకుండా వచ్చిన అవకాశంతో ఆమె జిడ్ అనే హిందీ సినిమాలో నాన్సీ అనే పాత్రలో సినిమా రంగానికి పరిచయం అయింది. అయితే ఆ సినిమాతో పరిచయం అయిన ఆమె హీరోయిన్ గా రన్ రాజా రన్ అనే సినిమా చేసింది. సాహో సుజీత్ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.

కలిసి రాని అవకాశాలు
డీసెంట్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా తర్వాత ఆమెకు వరుస అవకాశాలు వస్తాయి అనుకుంది కానీ అవకాశాలు మాత్రం రాలేదు. ఈ సినిమా చేసిన తర్వాత సందీప్ కిషన్ సరసన టైగర్, అలాగే సుమంత్ అశ్విన్ పక్కన కొలంబస్ అనే సినిమాల్లో నటించింది. అయితే రెండు సినిమాలు అంతగా ఆడకపోవడంతో ఆమెకు ఒక ఏడాది పాటు అసలు అవకాశాలు కూడా దక్కలేదు.

రెండేళ్ల పాటు ఖాళీగా
అయినా చాలా కాలం తరువాత రాజు గారి గది అనే సినిమాలో ఆమె కీలక పాత్రలో నటించింది. ఇక అదే ఏడాది అల్లు శిరీష్ ఒక్క క్షణం అనే సినిమాలో కూడా నటించి మంచి పేరు తెచ్చుకుంది. రవితేజ సరసన టచ్ చేసి చూడు అనే సినిమాలో అవకాశం దక్కింది కానీ ఈ సినిమా కూడా ఆడకపోవడంతో ఆమె రెండేళ్ల పాటు ఖాళీగా ఉంది.

అందాలు ఆరబోస్తూ
అయితే ఆ తర్వాత సిద్దు జొన్నలగడ్డ సరసన హీరోయిన్ గా ఆమె కృష్ణ అండ్ హిస్ లీల అలాగే మా వింత గాధ వినుమా అనే రెండు సినిమాలు చేసింది. ఈ సినిమాల తర్వాత ఆమెకు మళ్లీ అవకాశాలు లేవు. అందుకే ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్స్ షేర్ చేస్తూ నిర్మాతల దృష్టిలో పడటమే కాక ఫాలోవర్స్ ను కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తోంది ఈ భామ.

ఎద, నడుమందాలు
తాజాగా సైజ్ జీరో'లో కర్లీ హెయిర్, క్యూట్ లుక్స్‌తో సీరత్ కపూర్ బక్కచిక్కినట్టు కనిపిస్తోంది. చక్కనమ్మ చిక్కినా అందమే అనే చందాన బ్లాక్ స్లీవ్ లెస్ జాకెట్, బ్లూ శారీలో ఆమె అందాలు ఆరబోసింది. ఈ ఫోటోలలో సీరత్ ఎద, నడుమందాలు చూపిస్తూ.. కుర్రాళ్ళ గుండెల్లో గుబులు రేపుతూ ఉండడంతో రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.


Click it and Unblock the Notifications











