పొట్టి గౌనులో సీరత్ కపూర్ హాట్ ట్రీట్.. అందాలు ఆరబోస్తూ ఏమన్నా ఫోజిచ్చిందా?
ముంబైలోనే పుట్టి పెరిగిన సీరత్ కపూర్ తెలుగువారందరికీ సుపరిచితమే. ఈ మధ్య కాలంలో పెద్దగా అవకాశాలు దక్కించుకోని ఈ భామ అవకాశాల కోసం హాట్ ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది. తాజాగా చేసిన హాట్ ఫోటోషూట్ ఒకటి వైరల్ గా మారింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్
ముంబైలో జన్మించిన సీరత్ కపూర్ కి చిన్నప్పటి నుంచి సినిమా అంటే చాలా ఆసక్తి. చిన్నప్పటి నుంచి డాన్స్ కూడా నేర్చుకున్న ఈ భామ పెద్దయ్యాక మోడలింగ్ కూడా చేసింది. ఆ తర్వాత యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో చేరి నటన కూడా నేర్చుకుంది. ఆ తర్వాత జిడ్ అనే హిందీ సినిమాలో నాన్సీ అనే పాత్రలో ఆమె సినిమా రంగానికి పరిచయం అయింది.

రన్ రాజా రన్ తో క్రేజ్
అవడానికి హిందీ సినిమా మొదటి సినిమా అయినా హీరోయిన్ గా మాత్రం అందుకు రన్ రాజా రన్ అనే సినిమా మొదటి సినిమా అని చెప్పవచ్చు. సుజీత్ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. డీసెంట్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా తర్వాత ఆమెకు వరుస అవకాశాలు వస్తాయని భావించారు. కానీ అవకాశాలు మాత్రం పరిగెత్తుకు రాలేదు.

మొదటి సినిమా తరువాత
ఈ సినిమా చేసిన తర్వాత సందీప్ కిషన్ సరసన టైగర్, అలాగే సుమంత్ అశ్విన్ పక్కన కొలంబస్ అనే సినిమాల్లో నటించే అవకాశాలు దక్కాయి. అయితే రెండు సినిమాలు సరిగా ఆడకపోవడంతో ఆమెకు ఒక ఏడాది పాటు అసలు అవకాశాలు దక్కలేదు.. ఆ తర్వాత రాజు గారి గది అనే సినిమాలో ఆమె కీలక పాత్రలో నటించింది. ఇక అదే ఏడాది అల్లు శిరీష్ ఒక్క క్షణం అనే సినిమాలో కూడా నటించి మంచి పేరు తెచ్చుకుంది.

అవకాశాలు మాత్రం లేవు
అయితే చేసిన సినిమాలు ఏవి పెద్దగా ఆడకపోవడంతో ఆమెకు వెంటనే అవకాశాలు దక్కలేదు. ఆ తరువాత రవితేజ సరసన టచ్ చేసి చూడు అనే సినిమాలో అవకాశం దక్కింది. ఈ సినిమా కూడా ఆడలేదు. దీంతో ఆమె రెండేళ్ల పాటు ఖాళీగా ఉండాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత సిద్దు జొన్నలగడ్డ సరసన హీరోయిన్ గా ఆమె కృష్ణ అండ్ హిస్ లీల అలాగే మా వింత గాధ వినుమా అనే రెండు సినిమాలు చేసింది. ఈ సినిమాల తర్వాత ఆమెకు మళ్లీ అవకాశాలు లేవు.

హాట్ ఫోటో షూట్
దీంతో ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్స్ షేర్ చేస్తూ నిర్మాతల దృష్టిలో పడటమే కాక ఫాలోవర్స్ ను కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ భామ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా హాట్ ఫోటో షూట్ షేర్ చేసింది. పొట్టి గౌనులో ఉన్న ఈ భామ ఒక రేంజ్ లో ఫోజులు ఇచ్చింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసెయ్యండి మరి.


Click it and Unblock the Notifications











