Valentine Day: వాలంటైన్ డే నాడు రోజ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తే.. యువ హీరోయిన్ బంపర్ ఆఫర్!
తెలుగు సినిమా పరిశ్రమలో టాలెంటెడ్ హీరోయిన్లలో సీరత్ కపూర్ ఒకరు. హిట్స్ పడినా.. ఆమెకు అరకొరగా అవకాశాలు వస్తుంటాయి. అయినా తనకు అందిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనే పనిలో ఉంటారు. ఉత్తరాదికి సంబంధించిన అమ్మాయి అయినప్పటికీ గానీ.. తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అయితే తాజాగా తన సినిమా ప్రమోషన్స్‌లో వాలంటైన్ డే రోజు విశేషాలను పంచుకొన్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
సీరత్ కపూర్ సినిమా కెరీర్ విషయానికి వస్తే.. హిందీలో జిద్ అనే సినిమాతో కెరీర్ ప్రారంభించింది. అయితే తెలుగులో రన్ రాజా రన్ సినిమాలో నటించి భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకొన్నారు. ఆ తర్వాత రాజుగారి గది 2, ఒక క్షణం, టచ్ చేసి చూడు, కృష్ణ అండబ్ హిజ్ లీలా అన సినిమాల్లో నటించారు. అలాగే మా వింత గాధ వినుమ, భామ కలాపం, ఉషా పరిణయం లాంటి చిత్రాలను తన నటనతో మెప్పించే ప్రయత్నం చేశారు.

సీరత్ కపూర్ నటించిన కృష్ణ అండ్ హిజ్ లీలా అనే సినిమాను రి రీలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. సిద్దూ జొన్నలగడ్డ, శ్రద్దా శ్రీనాథ్ జంటగా నటించిన ఈ మూవీని రానా దగ్గుబాటి గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌ను భారీగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తన వ్యక్తిగత జీవితం గురించిన విషయాలను వెల్లడించారు.
సీరత్ కపూర్ మాట్లాడుతూ.. గతంలో నాకు రిలేషన్‌షిప్స్ ఉండేవి. అవి బ్రేకప్స్ అయ్యాయి. ప్రస్తుతం నేను ఒంటరిగానే ఉన్నాను. నాకు ఎలాంటి అఫైర్లు, బ్రేకప్స్ లేవు. ఎవరైనా మంచి వ్యక్తి తారసపడితే నేను అతడితో కలిసి ప్రయాణం చేయడానికి రెడీగా ఉన్నాను అని తన మనసులోని మాటను సీరత్ చెప్పింది.

ఇక వాలంటైన్ డే గురించి సీరత్ మాట్లాడుతూ.. నాకు ఆ రోజంటే చాలా ఇష్టం. నాకు ప్రత్యేకంగా కొన్ని విషయాలు గుర్తుకు వస్తాయి. ఈ ఏడాది ఎవరైనా నాకు రోజ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తే..నేను అతడి ప్రేమను, ప్రపోజల్‌ను అంగీకరిస్తాను అని ఆమె బంపర్ ఆఫర్ ఇచ్చింది. అయితే ఆమె అభిమానులు ఈ వార్త విని సంతోషంలో మునిగిపోయారు.
ఇక సీరత్ కపూర్ రొమాంటిక్ లైఫ్ విషయానికి వస్తే.. రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడితో సన్నిమిత సంబంధాలు ఉండేవి. అయితే ఈ మధ్యలో వారిద్దరికి మధ్య విభేదాలు రావడంతో ఒంటరిగానే ఉంటున్నారని చెబుతున్నారు. రకుల్ బ్రదర్ కూడా డ్రగ్స్ కేసులో ఇటీవల అరెస్ట్ కావడం తెలిసిందే. అయితే వారిద్దరి మధ్య బ్రేకప్ జరిగిందా? లేదా అనేది సీరత్ చెబితేనే క్లారిటీ వస్తుంది.


Click it and Unblock the Notifications











