జాకెట్ విప్పేసి షాకిచ్చిన సీరత్: రెచ్చగొట్టేలా హాట్ ఫోజు.. మరీ ఈ రేంజ్‌లో చూపిస్తుందేంటబ్బా?
కరోనా కాలంలో చాలా మంది హీరోయిన్లు సోషల్ మీడియా వాడకం బాగా పెంచేశారు. తన అభిమానులతో నిరంతరం టచ్లో ఉండటమే కాక తనకు సంబంధించిన అనేక విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంలో బిజీగా మారిపోయారు. అయితే సోషల్ మీడియాలో ఇంటరాక్షన్ పెరిగిన తర్వాత తమ హాట్ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. చేతిలో సినిమాలో ఉన్న భామలు వెనక్కి తగ్గడం లేదు, చేతిలో సినిమాలు లేవు అనుకున్న భామలు కూడా వెనక్కి తగ్గడం లేదు. ప్రస్తుతానికి సినిమా అవకాశాల కోసం తపించి పోతున్న సీరత్ కపూర్ వదిలిన తాజా ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతోంది. ఆ ఫోటో మీరు కూడా చూసెద్దురు పదండి.

నటన మీద ఆసక్తితో
సీరత్ కపూర్ ముంబైలోనే పుట్టి పెరిగింది. చిన్నప్పటి నుంచి నటన మీద ఆసక్తి ఉన్నా ఎలా అవకాశాలు దక్కించుకోవాలన విషయం మీద ఆమెకు ఏమాత్రం అవగాహన లేదు. అయితే చిన్ననాటి నుంచి డాన్స్ మీద బాగా ఇష్టం ఏర్పడడంతో డాన్స్ మాత్రం బాగా నేర్చుకుని ఒక అకాడమీలో డాన్స్ ఇన్ స్ట్రక్టర్ గా కూడా మారింది. ఆ తర్వాత నటన మీద తనకున్న ఆసక్తిని వదులుకోలేక తన బంధువుకు చెందిన ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నటనకు సంబంధించిన మెళకువలు నేర్చుకుంది.

మొదట పద్ధతిగానే
పుట్టి పెరిగింది ముంబైలోనే అయినా ఆమెకు మొదటి అవకాశం దక్కింది మాత్రం తెలుగు సినిమాలలోనే. శర్వానంద్ హీరోగా నటించిన రన్ రాజా రన్ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించిన సీరత్ కపూర్ ఆ దెబ్బతో ఇక సినిమా అవకాశాలు వరుసగా వచ్చి పడతాయి అనుకుంది. అందుకేనేమో ఈ భామ మొదట్లో గ్లామర్ విషయంలో అంతగా హద్దులు అయితే దాటి పోలేదు.

నిరాశ చెందకుండా
కానీ ఆ తరువాత ఎన్ని సినిమాలు చేసినా కలిసి రాక పోవడంతో సినిమా సినిమాకు అందాల ఆరబోత హద్దులు దాటిస్తూ కుర్రాళ్ల గుండెల్లో గూడు కట్టించుకునే ప్రయత్నం చేస్తోంది. సీరత్ కపూర్ రన్ రాజా రన్ తరువాత మంచి క్రేజ్ అందుకుంది. కానీ హీరోయిన్ గా మాత్రం ఆమె ఊహించినన్ని అవకాశాలు అయితే అందుకోలేకపోయింది. అయినప్పటికీ ఏ మాత్రం నిరాశ చెందకుండా ప్రయత్నిస్తోంది.

చూపు తిప్పుకునేందుకు
తనదైన శైలిలో గ్లామర్ ట్రీట్ సోషల్ మీడియా జనాలను తనవైపుకు తిప్పుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. తన సహచర హీరోయిన్స్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా పరువాల విందు పరిచేందుకు ఏ మాత్రం వెనుకాడడం లేదు. టైగర్, కొలంబస్, రాజుగారి గది 2, కృష్ణ & హిస్ లీలా వంటి సినిమాలలో కూడా సీరత్ కపూర్ గ్లామర్ పరంగా మంచి క్రేజ్ అయితే అందుకుంది.
ఎద అందాలను బహిర్గతం చేస్తూ
కానీ ఆమె ప్రస్తుతానికి చేతిలో ఒక్క సినిమా కూడా లేకుండా ఇబ్బందులు పడుతోంది అందుకేనేమో నిర్మాతల దృష్టిలో పడేందుకు గానూ ఆమె చేస్తున్న హాట్ ఫోటో షూట్ లు ఇప్పుడు సోషల్ మీడియాలో కాక రేపుతున్నాయి. సీరత్ కపూర్ తన తాజా ఫోటోషూట్‌ను షేర్ చేసింది. ఆ ఫోటో షూట్ లో ఆమె చాలా హాట్‌గా కనిపిస్తుంది. ఆమె పింక్ బ్లేజర్‌ను ధరించగా అందులో నుంచే తన ఎద అందాలను బహిర్గతం చేస్తూ టెంపరేచర్ పెంచేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.


Click it and Unblock the Notifications











