అల్లు అర్జున్ ప్రాపర్టీ కామెంట్స్‌పై హీరోయిన్ ఘాటు రిప్లై

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), నటి సీరత్ కపూర్ (Seerat Kapoor)పేర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల బన్నీ బర్త్‌డే సందర్భంగా సీరత్ షేర్ చేసిన ప్రైవేట్ జెట్ ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో.. వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందా? అంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో ఓ నెటిజన్ చేసిన "అల్లు అర్జున్ ప్రాపర్టీ" కామెంట్ వివాదానికి దారితీయగా.. దానిపై సీరత్ ఇచ్చిన స్ట్రాంగ్ రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ప్రస్తుతం ఈ వ్యవహారం ఇండస్ట్రీలోనే కాదు.. నెటిజన్ల మధ్య కూడా పెద్ద చర్చకు కారణమవుతోంది. ఇంతకీ హీరోయిన్ సీరత్ కపూర్ ఏమన్నారంటే?

అసలేం జరిగిందంటే? ఇటీవల ఏప్రిల్ 8న అల్లు అర్జున్ తన 44వ పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీరత్ కపూర్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో బన్నీతో కలిసి ప్రైవేట్ జెట్‌లో దిగిన కొన్ని అన్‌సీన్ ఫొటోలను షేర్ చేస్తూ ప్రత్యేకంగా బర్త్‌డే విశేషాలను ప్రదర్శించారు. "హ్యాపీ బర్త్ డే బన్నీ.. మీరు మీ కళను, సంబంధాలను ఎంతో హుందాగా, సహజంగా బ్యాలెన్స్ చేస్తారు. తెరపైన, తెరవడానికి మరిన్ని విజయాలు అందుకోవాలి" అంటూ ఆమె రాసిన.. చివర్లో హార్ట్ సింబల్ కూడా జోడించబడింది. ఈ పోస్ట్ వైరల్ అయిన కొందరు నెటిజన్లు వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందా? అంటూ ఊహాగానాలు మొదలుపెట్టారు.

Seerat Kapoor Strong Reply to Allu Arjun Property Comment Goes Viral Online

అయితే వివాదానికి అసలు కారణం తర్వాత వచ్చింది. సీరత్ షేర్ చేసిన పోస్ట్‌పై ఓ నెటిజన్ "అల్లు అర్జున్ ప్రాపర్టీ" అంటూ కామెంట్ చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ కామెంట్‌ను చూసి సైలెంట్‌గా ఉండకుండా సీరత్ కపూర్ వెంటనే స్పందించారు. 'ఒక హార్ట్ ఎమోజీ పెట్టినంత మాత్రాన ఓ మహిళ ఎవరి సొత్తు కాదు సర్. ఆమెకు తనకంటూ వ్యక్తిత్వం, కలలు, స్వరం ఉంటాయి. గౌరవంతో అభిమానించండి.. కానీ ఎవరి ప్రాపర్టీలా చూడొద్దు' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

సీరత్ ఇచ్చిన ఈ సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది. ముఖ్యంగా మహిళలను వస్తువుల్లా చూడటం, సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై అనవసరమైన ఊహాగానాలు చేయడం సరైంది కాదంటూ నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. "ఒక మహిళకు తనకంటూ స్వతంత్ర వ్యక్తిత్వం" అని సీరత్ చెప్పిన సందేశాన్ని చాలా మంది ప్రశంసిస్తున్నారు. మరోవైపు కొందరు సెలబ్రిటీల సోషల్ మీడియా పోస్టుల వల్లే ఇలాంటి చర్చలు వస్తాయని అభిప్రాయపడుతున్నారు.

ఇక సీరత్ కపూర్ సినీ ప్రయాణం విషయానికి వస్తే.. 2014లో వచ్చిన రన్ రాజా రన్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత టైగర్, కొలంబస్, రాజు గారి గది 2, కృష్ణ, భామాకలాపం 2, మనమే వంటి చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె 'ఝటస్య మరణం ధ్రువం', 'ది బ్లాక్' వంటి పలు సినిమాల్లో నటిస్తోంది.

మరోవైపు అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2: ది రూల్ విజయంతో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించడంతో ఆయన తదుపరి ప్రాజెక్టులపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా దర్శకుడు అట్లీ తో చేయబోయే 'రాకా' ప్రాజెక్ట్‌పై ఇప్పటికే ఇండస్ట్రీలో ఆసక్తి ఉంది. అలాగే లోకేష్ కనగరాజ్, సందీప్ రెడ్డి వంగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ లతో కూడా బన్నీ చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తంగా సీరత్ కపూర్ ఇచ్చిన సమాధానం చాలా మందికి ఆలోచింపజేసేలా ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X