సీరత్ కపూర్ కరోనా హెచ్చరిక... నవరాత్రి ఉత్సవాలు సురక్షితంగా జరుపుకొండి..
దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ఊపందుకొన్నాయి. భక్తులు భక్తి శ్రద్దలతో ఈ ఉత్సవాలను ఘనంగా జరుపుకొంటున్నారు. ఈ వేడుకల్లో తొమ్మిది రూపాల్లో దర్శనమిచ్చే అమ్మవారిని ఘనంగా కొలుస్తున్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సూచికగా ఈ పండగను జరుపుకోవడం విశేషంగా భావిస్తాం. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా భయాందోళనలతో కారణంగా ఈ పండుగను సురక్షిత ప్రమాణాలను పాటిస్తూ దుర్గామాతకు పూజలు నిర్వహిస్తున్నారు. ఇక ఔత్సాహికులు, సెలబ్రిటీలు దసరా ఉత్సవాలు, దాండియా, గార్బా నృత్యాల్లో పాల్గొంటున్నారు.
నవరాత్రి దుర్గామాత ఉత్సవాలు జోరందుకోవడంతో టాలీవుడ్ హీరోయిన్ సీరత్ కపూర్ భక్తులకు ఓ సందేశాన్ని ఇచ్చారు. కరోనావైరస్‌ను కట్టడి చేయడానికి ఇంటి పట్టునే సురక్షితంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా తన అభిమానులకు, సినీ ప్రేక్షకులకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.

మీ అందరికి నా తరఫున నవరాత్రి శుభాకాంక్షలు. ఇరుగుపొరుగు వారితో కలిసి ఈ పండుగను సురక్షితంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. సంపూర్ణ ఆరోగ్యం, ప్రేమాభిమానులతో ఉండాలని దుర్గామాతను కోరుకొంటున్నాను. మీకు మరింత మనోధైర్యం కలిగించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను అని సీరత్ కపూర్ తన సందేశంలో పేర్కొన్నారు.

ఇక కెరీర్ విషయానికి వస్తే.. సీరత్ కపూర్ నటించిన కృష్ణ అండ్ లీలాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో రవితేజతో కలిసి మరో చిత్రంలో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ చిత్రానికి సంబంధించిన ప్రకటనను త్వరలోనే వెల్లడించనున్నారు. యువ హీరోయిన్ తన కెరీర్‌ను రన్ రాజా రన్ చిత్రంతో ప్రారంభించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











