విజయశాంతికి అలనాటి స్టార్ కమెడియన్‌తో సంబంధం.. నాటి సీక్రెట్స్ రివీల్ చేసిన నటుడు!

అలనాటి స్టార్ హీరోయిన్ విజయశాంతి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందం, అంతకు మించిన నటనతో దమ్ము రేపిన ఆమె ఇప్పటికీ సినిమాలు చేస్తోంది. ఓవైపు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూనే మరోవైపు సినిమాలు చేస్తున్న ఈమె గురించి సీనియర్ కమెడియన్ చిట్టిబాబు షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉన్న ఈమెకు... తన సోదరుడు, స్టార్ కమెడియన్ తో ఉన్న బంధం గురించి తెలిపారు. ఈ విషయాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం 57 ఏళ్ల వయసు కల్గిన ఈమె నటిగా నిర్మాతగా రాజకీయ నాయకురాలిగా కూడా విపరీతమైన గుర్తింపు తెచ్చుకుంది. 30 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఈమె వివిద భాషా చిత్రాలతో పాటు వివిధ పాత్రల్లో సుమారు 180 సినిమాలకు పైగా చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ నటించి తన సత్తా చాటుకుంది. ముఖ్యంగా దే లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ ను సొంతం చేసుకున్న ఈమె... ఇప్పటికీ సినిమాలు చేస్తుంది.

Senior Actor Chittibabu Revealed VIjayashanthi Relation With Rajababu Check Details

అయితే ఈమె ఒకప్పుడు సీనియర్ స్టార్ కమెడియన్ రాజబాబుతో చాలా బాగుండేది. వారిద్దరి మధ్య మంచి బంధం ఉండగా.. అంతా తప్పుగా అనుకున్నారట. వీరిద్దరికీ ప్రేమాయణం సాగుతుందని కొందరు, ఈమెను రాజబాబు పెళ్లి చేసుకుంటాడని కొందరు పెద్ద ఎత్తున పేపర్లలో వార్తలు రాసుకొచ్చారట. అయితే ఇవన్నీ చూసిన రాజబాబు నేరుగా మీడియాను పిలిచి.. ఇలాంటి వార్తల వల్ల నాకు ఎలాంటి సమస్యా లేదు... కానీ విజయశాంతి ఆడపిల్ల ఆమె క్యారెక్టర్ మీదకు మచ్చ తీసుకు రావొద్దని వివరించారట.

మా ఇద్దరి మధ్య మంచి బంధం ఉన్న మాట వాస్తవమే అయినా తండ్రీకూతుళ్లు లాంటి బంధం అని... ఎవరు ఏం అనుకున్నా, ఎన్ని రాసుకున్నా తను నా కూతురు లాంటిది అని చెప్పుకొచ్చారట. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కమెడియన్ రాజబాబు సోదరుడు, సీనియర్ కమెడియన్ చిట్టిబాబు ఈ విషయాన్ని తెలిపారు. తన సోదరుడు రాజబాబు.. అమ్మాయిలకు నష్టం కల్గింటే పనులు ఏవీ చేయరని, విజయశాంతి విషయంలో చాలా ఫీల్ అయ్యారని చెప్పుకొచ్చారు.

Senior Actor Chittibabu Revealed VIjayashanthi Relation With Rajababu Check Details

అంతేకాకుండా... మా మీద వార్తలు రాసుకుంటే, మీ కడుపు నిండుతుందని అనిపిస్తే ఇలాంటి పనులు చేయండని చెప్పినట్లు వివరించాడట రాబజాబు. అంత మంచి మనసు ఉన్న వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా చాలా మంది ఆయనకు ఆస్తులు లేవు, అద్దె ఇంట్లో ఉండి చనిపోయాడంటూ వార్తలు రాసుకొచ్చారని తెలిపాడు. అవన్నీ అబద్ధాలే అని.. తమకు ఆస్తులు చాలానే ఉన్నాయని, మూడు, నాలుగు ఇళ్లు ఉన్న సమయంలోనే తన సోదరుడు చనిపోయాడని క్లారిటీ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X