బట్టలు విప్పి చూపించు.. అలా వేదించారు.. ఆమని సంచలన ఆరోపణలు
Actress Amani: మలయాళ ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎదుర్కొంటున్న సమస్యలు, లైంగిక వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన రిపోర్టు పలు ఇండస్టీల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. రిపోర్టులో పలు సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో చాలామంది సినీ ప్రముఖులు ఈ నివేదికపై స్పందిస్తున్నారు. తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను వెల్లబుచ్చుతున్నారు. ఈ క్రమంలో.. తాజాగా.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఒకనాటి టాప్ హీరోయిన్ ఆమని తన అభిప్రాయాలను, తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకుంటూ ఎమోషనల్ అయ్యింది.
క్యాస్టింగ్ కౌచ్ అనే పదం మనం ఇప్పుడు వింటున్నాం. కానీ, సావిత్రిగారి కాలం నుంచి ఉండేదని అన్నారు. సినిమా రంగంలో ఎంతో మంది హీరోలుగా, హీరోయిన్లుగా రాణించాలని ఆశ పడతారు. అవకాశాల కోసం మూవీ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. ఈ తరుణంలో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్నారనీ, మూవీ మేకర్స్ కొత్తగా ఇండస్ట్రీలో వచ్చే అమ్మాయిలను చాలా ఇబ్బంది పడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆనాటి నుంచి ఎంతో మంది హీరోయిన్లు ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారనీ, ఆరోజుల్లో మీడియాగాని, సోషల్ మీడియాగానీ అందుబాటులో లేకపోవడం వల్ల ఈ విషయాల్లేవి బయట ప్రపంచానికి తెలియవనీ, కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి వేరేలా ఉందనీ, చీమ చిటుక్కుమన్నా క్షణాల్లో ప్రపంచానికి తెలిసిపోతుందని, ఏ చిన్న విషయమైనా మీడియాలో చూపిస్తున్నారని వెల్లడించారు.
క్యాస్టింగ్ కౌచ్ అనే భూతాన్ని తాను కూడా తొలినాళ్లలో ఎదుర్కొన్నాననీ, అయితే పెద్ద సంస్థల్లో ఇలాంటివి చిల్లర విషయాలు జరగవనీ, కొత్త కొత్త సంస్థల్లోనే ఇలాంటి దారుణాలు చేసుకుంటాయని అన్నారు. ఓ సారి తమిళ్ సినిమాలో హీరోయిన్ గా అవకాశముందంటే వెళ్ళన్నని, తనతోపాటు తన తల్లి, తమ్ముడు కూడా ఉన్నారనీ, ఆ సమయంలో వారు 'నీకు తోడ మీద ఏమైనా మచ్చలున్నాయా'అని ప్రశ్నంచారనీ, ఆ విషయం వినగానే తాను షాకయ్యాననీ, అక్కడ మచ్చ ఉండడమేమిటి తాను ప్రశ్నించగా.. 'ఇంతకు ముందు ఒక హీరోయిన్‌ని సెలక్ట్ చేశాం.. కానీ, ఆమెకు తొడపై మచ్చలున్నాయి. నీకు కూడా ఉన్నాయని అడిగాం. అందుకే ఒకసారి బట్టలు విప్పేసి చూపించండని అన్నారు. ఆ మాటలతో షాక్ అయినా తాను ఆ సినిమా చేయను, ఆ క్యారెక్టర్ తనకు వద్దని ఓపెన్ గా చెప్పేసి వచ్చేసిందట.

నిజంగానే సినిమా తీసేవాళ్లు, తీయాలనే కోరిక ఉన్నావారు అలాంటి ప్రశ్నాలు అడగరనీ, వాళ్ల వ్యవహార శైలిని బట్టే మనమే అర్థం చేసుకోవాలని సూచించారు.ఆ తరువాత ఓ సినిమా కోసం తనని హీరోయిన్‌గా సెలక్ట్ చేశారనీ, ఆ తరువాత తాము బీచ్‌లో ఉన్నామనీ, మిమ్మల్ని వాళ్ల ఫైనాన్సియర్ చూడాలనుకుంటున్నారంటని కాల్ చేశారు. ఫైనాన్సియర్ చూడడం ఏమిటని ఆ సినిమాకు తాను నో చెప్పనని, ఇలాంటి చేదు అనుభవాలను తన జీవితంలో చాలానే ఎదుర్కొన్నాననీ, పలు సినిమాలను కూడా తాను వదులుకున్నానని అన్నారు.
తాను సినిమాల్లో నిలబడటానికి చాలా కష్టపడ్డాననీ, ఒక్కవేళ సినిమాల్లో అవకాశాలు రాకపోతే.. తిరిగి చదువుకోవాలని భావించాననీ కానీ, హీరోయిన్ గా ఎన్నో మంచి నటించే అవకాశం వచ్చింది. ఎంతో సాఫీగా తన కెరీర్ సాగిందని ఎమోషనల్ అయ్యారు నటి ఆమని.


Click it and Unblock the Notifications











