Bhanupriya: హీరోయిన్ భానుప్రియకు మెమోరీ లాస్.. విడాకులపై రియాక్షన్, షూటింగ్ సెట్ లో అలా!

అలనాటి స్టార్ హీరోయిన్ భానుప్రియ అంటే తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరు. పెద్దపెద్ద కళ్లతో.. అందమైన నవ్వుతో, మనోహరమైన నృత్యానికి ఆమె చాలా పాపులర్. మెగాస్టార్ చిరంజీవికి సరిసమానంగా డ్యాన్స్ చేసే అతి కొద్దిమంది హీరోయిన్స్ లలో ఆమె ఒకరు. ముఖ్యంగా దగ్గుబాటి వెంకటేష్ నటించిన స్వర్ణ కమలం సినిమాలో ఆమె చేసే నాట్యం ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోతుంది.

రెండు దశాబ్దాలపాటు అగ్ర నటిగా సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది. నాటి స్టార్ హీరోలందరితోనూ జత కట్టిన ఈ అందాల హీరోయిన్ సినీ అభిమానుల హృదయాల్లో చోటు సంపాదించుకుంది. తన నాట్యం, నటన, హావాభావాలతో అలరించిన భానుప్రియ మెమోరీ లాస్ తో బాధపడుతుంది.

నాట్యంతో మనసు దోచుకుని..

నాట్యంతో మనసు దోచుకుని..

అలనాటి స్టార్ హీరోయిన్ భానుప్రియ డైరెక్టర్ వంశీ దర్శకత్వం వహించిన సితార సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో.. దివంగత దిగ్గజ దర్శకులు కే విశ్వనాథ్ స్వర్ణకమలం సినిమాలో నటించే అవకాశం లభించింది. ఈ సినిమాలో తన నాట్యంతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకుంది. ఆ తర్వాత అనేక కమర్షియల్ సినిమాల్లో ఆడిపాడింది భానుప్రియ. ముఖ్యంగా 1980-93 సంవత్సరాల్లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది.

అమెరికా ఫొటో గ్రాఫర్ తో పెళ్లి..

అమెరికా ఫొటో గ్రాఫర్ తో పెళ్లి..

భానుప్రియ తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో దాదాపుగా 110 చిత్రాల్లో నటించింది. అనంతరం ఆమె సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. చాలా కాలం తర్వాత ఛత్రపతి సినిమాలో ప్రభాస్ కు తల్లి పాత్ర పోషించిన భానుప్రియ చివరిగా 2021లో విడుదలైన నాట్యం సినిమాలో కనిపించారు.

ఇక ఆమె 1998లో అమెరికాలో స్థిరపడిన ఫొటోగ్రాఫర్ ఆదర్శ్ కౌశల్ ను పెళ్లి చేసుకున్నారు. ఆయన 2018లో గుండెపోటుతో మరణించగా.. అంతకుముందు తన భర్తతో విభేదాలు తలెత్తాయని, విడాకులు తీసుకున్నారని వార్తలు వచ్చాయి.

ఇంట్రెస్ట్ కొద్దిగా తగ్గింది..

ఇంట్రెస్ట్ కొద్దిగా తగ్గింది..

అయితే తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన భానుప్రియ.. తనకు ఉన్న మెమోరీ లాస్, భర్తతో విడాకులపై స్పందించారు. "మీకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం.. అప్పట్లో డ్యాన్స్ స్కూల్ పెడదామని కూడా అనుకున్నారు. ఏమైంది ?" అని యాంకర్ అడిగితే.. "ఈ మధ్య కాలంలో నాకు ఒంట్లో బాగోలేదు. మెమోరీ పవర్ తగ్గిపోయింది. నేర్చుకున్న కొన్ని ఐటమ్స్ మరిచిపోయాను. దాని తర్వాత ఇంట్రెస్ట్ కొద్దిగాతగ్గిందండి" అని భానుప్రియ తెలిపారు.

అన్నీ మర్చిపోతున్నాను..

అన్నీ మర్చిపోతున్నాను..

"డ్యాన్స్ ప్రాక్టీస్ చేయట్లేదు. రెండు సంవత్సరాల నుంచి మెమోరీ లాస్ తో బాధపడుతున్నాను. అంతకుముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశాను. కానీ డ్యాన్స్ పర్ఫామెన్స్ మాత్రం ఇవ్వలేదండి. అంతకుముందు డ్యాన్స్ చేసేదాన్ని. ఇప్పుడు అలా చేయలేకపోతున్నందుకు బాధగా ఉంటుంది. మాములుగా గుర్తు పెట్టుకునే విషయాలు మర్చిపోతున్నాను. మొన్న ఒక సినిమా కూడా చేశాను. లొకేషన్ లో డైలాగ్ లన్నీ మర్చిపోయాను. సిల నేరంగిలిల్ సిల మనిధర్గల్ మూవీ షూట్ లో బ్లాంక్ అయిపోయింది మైండ్. తర్వాత సర్దుకున్నాక షూట్ చేశాం" అని భానుప్రియ చెప్పుకొచ్చారు.

మెడిసిన్ వాడుతున్నా..

మెడిసిన్ వాడుతున్నా..

"ఎలాంటి ఒత్తిడికి కానీ, డిప్రెషన్ కు కానీ లోను కావడం లేదు. ఆరోగ్యం బాలేకపోవడం వల్లే మరిచిపోతున్నాను. దీనికి సంబంధించిన మెడిసిన్స్ వాడుతున్నాను. మావారు చనిపోయినప్పటించనుంచే ఇలా అయింది. మేం విడిపోలేదు. ఆయన హైదరాబాద్ లో ఉండేవారు. నేను చెన్నైలో ఉండేదాన్ని. నాకు ఎప్పుడైనా అవకాశం వస్తే ఇక్కడికి వచ్చి యాక్ట్ చేసేదాన్ని. ట్రావెలింగ్ ఎక్కువ ఉండేది తప్పా నా భర్తతో విడిపోలేదు. అవన్నీ పుకార్లు మాత్రమే. నిజం కాదు. నా భర్తతో నేను విడాకులు తీసుకోలేదు. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉండేది" అని భానుప్రియ పేర్కొన్నారు.

కూతురుకు 20 ఏళ్లు..

కూతురుకు 20 ఏళ్లు..

అలాగే భానుప్రియ ఏకైక కుమార్తె గురించి కూడా మాట్లాడారు. "అభినయ ఇప్పుడు కాలేజీకి వెళ్తుంది. లండన్ లోని లాఫ్ బరో యూనివర్శిటీలో చదువుకుంటోంది. నేచురల్ సైన్స్ అనే సబ్జెక్ట్ చదువుతోంది. కాలేజీ సెలవులు ఇవ్వగానే ఇక్కడికి వచ్చేస్తుంది. పాపకు ఇప్పుడు వయసు 20 ఏళ్లు" అని చెప్పుకొచ్చిన భానుప్రియ తనకు సినిమాలపై ఎలాంటి ఆసక్తి లేదని.. మూవీస్ చూస్తా కానీ, నటించాలని లేదని తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X