కృష్ణంరాజు మీద ఉమ్మేశా.. నా జీవితాన్ని చిరిగిన విస్తరిగా చేశాడు.. సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్

ప్రస్తుతం సినిమాల్లో రేప్ సీన్స్ కామన్ గా మారిపోయాయి. కానీ, అప్పట్లో రేప్ సీన్స్ అంటే హీరోయిన్లు భయంతో వణికిపోయేవారు. అంతలా ఆ సీన్ ను పండించడం కోసం దర్శకుడు వారిని చిత్ర హింసలకు గురిచేసినట్లు చూపించేవాడు. చీర లాగడం, జాకెట్ చిరగడం.. తల మొత్తం చెరిగిపోయి.. చివరకు చచ్చిపోవడం. ఇదే అప్పట్లో రేప్ సీన్ సినారియో. అందుకు స్టార్ హీరోయిన్స్, హీరోలు కూడా అతీతం ఏం కాదు. ఒక సినిమాలో కృష్ణంరాజు, గీతాంజలి మధ్య జరిగిన రేప్ సీన్ గురించి ఆమె ఒక పాత ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అది ఇప్పుడు మరోసారి వైరల్ గా మారింది.

సీనియర్ నటి గీతాంజలి గురించి ఈతరం వారికి కూడా తెలిసే ఉంటుంది. ఎన్నో సినిమాల్లో హీరోలకు బామ్మగా నటించి మెప్పించింది. 1960వ దశకములో ఆమె హీరోయిన్ గా మంచి సినిమాల్లో నటించింది.ఎన్టీఆర్ , ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి హీరోల సరసన నటించిన గీతాంజలి సహనటుడు రామకృష్ణను వివాహమాడి చిత్రరంగం నుండి నిష్క్రమించింది. వివాహం కాకముందు రామకృష్ణ, గీతాంజలి కలిసి కొన్ని సినిమాలలో నటించారు.

Senior Actress Geetanjali shares funny scene with Hero Krishnam Raju

పెళ్లి తరువాత కొంత గ్యాప్ తీసుకున్న గీతాంజలి అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తూ వచ్చింది. ఇక అంతేకాకుండా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ అప్పట్లో జరిగిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉండేది. గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గీతాంజలి.. ఒక సినిమాలోని రేప్ సీన్ కోసం ఎంత కష్టపడిందో.. ? హీరో కృష్ణంరాజూ తనను ఎంత ఇబ్బంది పెట్టాడో చెప్పుకొచ్చింది.

ఏఎన్నార్, కాంచన జంటగా మంచి రోజులొచ్చాయి అనే సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో ఏఎన్నార్ చెల్లెలిగా గీతాంజలి నటించగా.. కృష్ణంరాజు విలన్ గా కనిపించాడు. ఈ చిత్రంలో గీతాంజలిని రేప్ చేసే కౄరుడుగా కృష్ణంరాజు కనిపించాడు. ఆ సమయంలో సెట్ లో జరిగిన విషయాన్నీ గీతాంజలి చెప్పుకొచ్చింది.

"మంచిరోజులొచ్చాయి సినిమాలో కృష్ణంరాజు గారు కుక్కను ఏసుకొచ్చి.. ఈ మనిషిని ఎట్లా అయినా ఫినిష్ చేసి జీవితాన్ని నాశనం చేయాలనీ చూస్తాడు. ఘోరం ఏంటి.. కుక్కను వదిలేస్తాడు.. జాకెట్ పీకేసి, చీరను లాగేసి.. ఘోరాతి ఘోరంగా చేస్తాడు. ఆ సమయంలో ఇబ్బంది పడడం కాదు నరకం అనుభవించాను. ఇక ఇద్దరి మధ్య మాట మాట పెరిగి, కృష్ణంరాజుపై గీతాంజలి ఉమ్మేయాల్సి ఉంటుంది. వామ్మో ఉమ్మడమా ? అని షాక్‌ అయ్యాను.

Senior Actress Geetanjali shares funny scene with Hero Krishnam Raju

లేదు కచ్చితంగా చేయాల్సిందే అని దర్శకుడు మధుసూధన రావు చెప్పడంతో ఐస్‌ క్రీమ్‌ని నోట్లో వేసుకొని ఆ నురగను ఆయన ముఖంపై ఉమ్మాను. దీంతో కోపానికి గురైన కృష్ణంరాజు నాపైనే ఉమ్మేస్తావా? ఇప్పుడు చూడు నీ పని ఏమైతుందో అని ఇంకా ఎక్కువగా చేయడం మొదలుపెడతాడు. ఇప్పుడు చూడు నీ జీవితం ఎలా కుక్కలు చించిన విస్తారులా మారుతుందో అని చెప్పి ఆగమాగం చేస్తాడు. ఎంత నరకం అనుభవించిన ఆ సీన్ బాగా వచ్చింది" అని ఆమె చెప్పుకొచ్చింది.

ఇక ఇదే తన జీవితంలో జరిగిన సంచలాత్మకమైన సీన్ అని ఆమె తెలిపింది. ఇక వృద్ధాప్య సమస్యలతో 2019, అక్టోబరు 31 న ఆమె మృతి చెందింది. కృష్ణంరాజు కూడా రెండేళ్ల క్రితం మరణించిన విషయం తెల్సిందే. అప్పట్లో నటీనటులు ఎంత పెద్దవారు.. చిన్నవారు అని చూడకుండా సీన్ బాగా రావడం కోసం ఎంత కష్టపడేవారో ఇలాంటివి విన్నప్పుడే తెలుస్తుందని ప్రేక్షకులు కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X