మహానటి తరువాత మరో సీనియర్ నటీమణి బయోపిక్.. హీరోయిన్ ఎవరంటే?
సినిమా ప్రపంచంలో కొంతమంది తారలు అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకున్నారనే చెప్పాలి. ముఖ్యంగా అలనాటి తారలను మరచిపోవడం అంత సులభం కాదు. సినిమా బ్రతుకున్నంత కాలం వారి ఉనికిని మరువదు. అంత మంచి గుర్తింపు అందుకున్న వారి నిజ జీవితల గురించి తెలుసుకోవాలని ఎంతగానో ఆసక్తి ఉంటుంది. రానున్న రోజుల్లో సినీ తారలకు సంబంధించిన అనేక రకాల బయోపిక్స్ రాబోతున్నట్లు తెలుస్తోంది.

మహానటి బయోపిక్.. బాక్సాఫీస్ హిట్
మహానటి సావిత్రి బయోపిక్ 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయం తెలిసిందే. ఆమె సాధించిన విజయాలతో పాటు చివరి జీవితాన్ని కూడా ఎంతో ఎమోషనల్ గా ప్రజెంట్ చేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో లాభాలను అందుకుంది. టాలీవుడ్ లో వచ్చిన మొదటి హీరోయిన్ బయోపిక్ అదే.

జమున బయోపిక్ కూడా..
అయితే ఆ తరువాత మరికొందరి ప్రముఖుల బయోపిక్స్ తెరపైకి రావడం మొదలయ్యాయి. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో రావాల్సిన బయోపిక్స్ ఇంకా చాలా ఉన్నాయి. అయితే త్వరలో మరో సీనియర్ నటీమణి జమున బయోపిక్ కూడా తెరపైకి రానున్నట్లు టాక్ వస్తోంది. ప్రస్తుతం ఒక దర్శకుడు జమునతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

డ్యాన్స్ తో మంచి క్రేజ్..
సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీ.రంగారావు వంటి అగ్ర నటులతో స్క్రీన్ షేర్ చేసుకున్న జమున తెలుగు తమిళ్ తమిళ్ మలయాళం కన్నడ అని బాషాభేదం లేకుండా అన్ని ఇండస్ట్రీలలో నటించి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంది. నటనతో పాటు జమున డ్యాన్స్ తో కూడా ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకుంది.

జమున పాత్రలో తమన్నా
జమున, సావిత్రి అప్పట్లో మంచి స్నేహితులు కూడా. ఇక ప్రస్తుతం జమున బయోపిక్ కు సంబంధించిన చర్చలు మొదలయినట్లు సమాచారం. ఇక హీరోయిన్ ఆమె పాత్రకు న్యాయం చేయగల నటిమణులు ఎవరని అనుకుంటున్న సమయంలో మిల్కీ బ్యూటీ తమన్నా పేరు చర్చల్లోకి వచ్చినట్లు సమాచారం.

ఆ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు
దేవినేని సినిమాతో ఇటీవల దర్శకుడిగా పరిచయమైన శివనాగు జమున బయోపిక్ ను తెరకెక్కించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే తమన్నా ఈ బయోపిక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా లేదా అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. అయితే దర్శకుడు మాత్రం ఫస్ట్ ఛాయిస్ గా తమన్నా భాటియాను అనుకున్నట్లు తెలుస్తోంది. ఏ హీరోయిన్ అయినా కూడా బయోపిక్ ఆఫర్స్ వస్తే వదులుకోరు. మరి తమన్నా ఒప్పుకుంటుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











