ఇన్నాళ్లకు ఇలా షాకింగ్ లుక్‌లో.. గుర్తుపట్టలేని విధంగా ఈవీవీ హీరోయిన్!
హీరోలతో పోలిస్తే హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువ. మహా అయితే ఓ మూడు నాలుగేళ్లు. వరుసపెట్టి హిట్లు ఇస్తే మరో రెండేళ్లు. అంతకుమించి ఈ కాలంలో ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయకూడదని అంటారు సినీ జనాలు. అయితే ఇండస్ట్రీలోకి మెరుపులా వచ్చి అంతే వేగంగా ఫేడవుట్ అయిన కొందరు హీరోయిన్లు ఉన్నారు. ఈ కోవలోకే వస్తారు కామ్నా జెఠ్మలానీ. తెలుగులో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ కొద్దికాలానికే సినిమాలకు దూరమైంది.
10 డిసెంబర్ 1985న ముంబైలో ఓ సింధీ కుటుంబంలో జన్మించారు కామ్నా జెఠ్మలానీ. ప్రముఖ వ్యాపారవేత్త శ్యామ్ జెఠ్మలానీ మనవరాలే కామ్నా. తండ్రి నిమేష్ , తల్లి దివ్య . దిగ్గజ న్యాయ కోవిదుడు రామ్ జెఠ్మలానీ.. కామ్నా తాతగారికి సోదరుడు. ముంబైలోనే చదువుకున్న కామ్నా జెఠ్మలానీ 2004లో మిస్ ముంబై కాంటెస్ట్‌లో పాల్గొని రన్నరప్‌గా నిలిచారు. ఈ క్రమంలో కామ్నా పలు మ్యూజిక్ ఆల్బమ్స్‌లోనూ పాల్గొన్నారు. ఈ దశలో సినీరంగం వైపు అడుగులు వేసిన కామ్నా జెఠ్మలానీ .. ప్రేమికులు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు.

గోపీచంద్ హీరోగా వచ్చిన రణం సినిమాతో కామ్నా తొలి బ్రేక్ అందుకున్నారు. ఈ చిత్రంలో తన అంద చందాలు, క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకున్న కామ్నా ఆ తర్వాత సామాన్యుడితో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. అనంతరం టాస్, అందమైన అబద్ధం, బెండు అప్పారావు ఆర్ఎంపీ, కత్తి కాంతారావు, యాక్షన్ త్రీడి, శ్రీ జగద్గురు ఆది శంకర, భాయ్, చంద్రిక చిత్రాల్లో నటించారు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ సినిమాల్లోనూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న కామ్నా తర్వాత ఎందుకో స్లో అయ్యారు.
అలా సినిమాలకు క్రమంగా దూరమైన కామ్నా జెఠ్మలానీ 2014లో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త సూరజ్ నాగపాల్‌ను పెళ్లాడారు. 2022లో చివరిసారిగా గరుడ అనే కన్నడ సినిమాలో కనిపించిన కామ్నా ఆ తర్వాతి ఏడాది వ్యవస్థ అనే వెబ్ సిరీస్‌తో తెలుగువారిని పలకరించారు. అనంతరం ఇండస్ట్రీలో నుంచి మిస్ అయ్యారు. మొన్నామధ్య కమెడియన్ అలీ హోస్ట్‌గా వ్యవహరించిన ఓ టాక్ షోకు హాజరై అలరించారు. ప్రస్తుతం సీనియర్ హీరోయిన్లంతా సెకండ్ ఇన్నింగ్స్‌లు స్టార్ట్ చేస్తున్న నేపథ్యంలో కామ్నా కూడా రీ ఎంట్రీపై కన్నేసిందా అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి.
సినిమాలు ఉన్నా లేకున్నా .. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటున్నారు కామ్నా జెఠ్మలానీ . తన వ్యక్తిగత వివరాలతో పాటు 40 ఏళ్ల వయసులోనూ హాట్ హాట్ ఫోటో షూట్‌లతో రెచ్చగొడుతున్నారు. తాజాగా ఫ్రీ హెయిర్‌తో , క్లోజ్ లుక్‌లో ఆమె చేసిన ఫోటో షూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజన్లు మనుపటి ఛార్మింగ్ కనిపించడం లేదని కామెంట్స్ పెడుతున్నారు. కొందరేమో మీలో ఏమాత్రం పస తగ్గలేదని కాంప్లిమెంట్ ఇస్తున్నారు.


Click it and Unblock the Notifications











