‘కొడుకుతో బయటికి వెళ్తే గర్ల్ ఫ్రెండ్ అని.. మా ఆయన ముసలోడేం కాదు’

సీనియర్ నటి లైలా ఒకప్పుడు టాలీవుడ్ లో ఊపూపింది. ఆమె చేసింది కొన్ని సినిమాలే అయినా.. ఆమె అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. అమాయకపు చూపులతో బిగ్ స్క్రీన్ పై మెరిసి ఆడియెన్స్ గుండెల్లో ప్రత్యేక స్థానం దక్కించుకుంది. అలాగే అప్పటి స్టార్ హీరోలైన బాలకృష్ణ, వెంకటేశ్, శ్రీకాంత్, జేడీ చక్రవర్తిలకు జోడీగా నటించి మెప్పించింది. తన పెర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా... ఇండస్ట్రీలో మంచి క్రేజ్ దక్కించుకుంది.

'ఎగిరే పావురమా', 'పెళ్లి చేసుకుందాం', 'ఉగాది', 'ఖైదీ గారు', 'పవిత్ర ప్రేమ', 'లవ్ స్టోరీ 1999', 'శుభలేఖలు', 'నా హృదయంలో నిదురించే చెలి' వంటి చిత్రాలో హీరోయిన్ గా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకుంది. అంతేకాదు హీరో తరుణ్ సూపర్ హిట్ ఫిల్మ్ 'నువ్వే కావాలి'లోనూ స్పెషల్ సాంగ్ తోనూ దుమ్ములేపింది. హీరోయిన్ గా సక్సెస్ అయిన లైలా.. ఆయా చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి కూడా ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళంలోనూ పలు సినిమాల్లో నటించి మెప్పించింది. అక్కడా ఆమెకు మంచి గుర్తింపు దక్కింది.

Senior Actress Laila made Funny Comments about Her Family She in Sabdham movie Promotions

1996 నుంచి 2006 వరకు వరుస సినిమాలో అలరించింది. ఆ తర్వాత తన పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది. ఇక మళ్లీ తిరిగి కంబ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే తమిళంలో హీరో కార్తీ 'సర్దార్', విజయ్ దళపతి 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి ఆకట్టుకుంది. ప్రస్తుతం మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో ఆడియెన్స్ ను అలరించేందుకు సిద్ధమైంది. ఆ చిత్రమే 'శబ్ధం'. హీరో ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలో నటించిన హారర్ర్ ఫిల్మ్ ఇది. ఇందులో లక్ష్మీ మీనన్ హీరోయిన్ కాగా.. సీనియర్ నటి లైలా కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ కాబోతోంది.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న యూనిట్ ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగు ఆడియెన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చేలా నటి లైలా పర్సనల్ ఇంటర్వ్యూ ఇచ్చింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత తెలుగు ఆడియెన్స్ ను 'శబ్ధం' చిత్రంతో పలకరించబోతోంది లైలా. ఈ సందర్భంగా ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ గురించి చెప్పుకొచ్చింది. తనకు ఇద్దరు కొడుకులు ఉన్నారని తెలిపింది. ఒకరమే 18 ఏళ్లు ఉంటారని, చిన్నవాడు 14 ఏళ్లు ఉంటాడని చెప్పుకొచ్చింది. ఫ్యామిలీతో ఎంత సరదాగా ఉంటామని తెలిపింది.

అయితే తన చిన్నకొడుకుతో బయటికి వెళ్లినప్పుడు అందరూ అతని గర్ల్ ఫ్రెండ్ గా భావిస్తున్నారని చెప్పింది. చిన్నబ్బాయ్ 6.3 ఎత్తు ఉంటాడని చెప్పింది. పైగా లైలా రూపురేఖల్లో ఎలాంటి మార్పులు లేకపోవడం, ఇంకా యంగ్ హీరోయిన్ లా కనిపిస్తుండటంతో అందరూ గర్ల్ ఫ్రెండా? అని అడుగుతున్నారని రియల్ ఇన్సిడెంట్ ను షేర్ చేసుకుంది. తను కూడా బాయ్ ఫ్రెండ్ అంటూ అందరిని ప్రాంక్ చేస్తానని ఫన్నీగా బదులిచ్చింది. అందరూ అలా అన్నపుడు కాంప్లిమెంటరీగానే తీసుకుంటానని, తన హస్బెండ్ కూడా ఫన్నీగా తీసుకుంటారని చెప్పింది. ఏమాత్రం నెగెటివ్ గా ఆలోచించబోరని చెప్పుకొచ్చింది. తన భర్త కూడా చాలా సరదాగా ఉంటారని చెప్పింది. ఫ్యామిలీని చక్కగా చూసుకుంటారంది.

అలాగే తన భర్త యంగ్ గానే ఉంటారని, ఆయన డైట్ పాటిస్తూ ఎప్పుడూ ఫిట్ గా ఉండేందుకు ప్రయత్నిస్తారని తెలిపింది. ఫిట్ నెస్ విషయంలో స్ట్రిక్ట్ గా ఉంటారంది. తను కూడా ఫిట్ నెస్ వర్క్ అవుట్ స్ చేస్తాననది చెప్పింది. ఇక లైలా 2006లో ఇరానియన్ బిజినెస్ మెన్ మెహ్దిని పెళ్లి చేసుకుంది. తన భర్తతో పెళ్లికి ముందు తొమ్మిదేళ్లు రిలేషన్ షిప్ లో ఉన్నట్టు చెప్పింది. ఎంగేజ్ మెంట్ అయిన నాలుగేళ్లకు వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్టు చెప్పుకొచ్చింది లైలా. వీరికి ఇద్దరు కుమారులున్నారు. ప్రస్తుతం స్కూలింగ్ ఫినిషింగ్ చేస్తున్నారు. ఇక లైలా రీసెంట్ గా తమిళంలో ఎక్కువగా కనిపిస్తూ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లోనూ తన రీఎంట్రీ పనులను షురూ చేశారు. జగపతి బాబుతో ప్రస్తుతం ఒక సినిమా కూడా జరుగుతుందని తెలియజేసింది.

More from Filmibeat

Read more about: laila mother jagapathi babu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X