బ్యాడ్ న్యూస్ అంటూ సీనియర్ హీరోయిన్ మీనా షాకింగ్ పోస్ట్.. ఫ్యామిలీ మొత్తం ఇబ్బంది పడేలా..

సీనియర్ హీరోయిన్స్ లో ప్రస్తుతం ప్రేక్షకులకు ఇంకా దగ్గరవుతున్న నటీమణులలో మీనా ఒకరు. చిన్నతనంలోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న మీనా ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీలో దాదాపు అందరు హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. తమిళ ఇండస్ట్రీకి చెందినప్పటికి కూడా ఆమె ఏ భాషలో నటించిన కూడా స్థానికంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చారు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఇంకా దగ్గరవుతున్న మీనా ఒక షాకింగ్ విషయాన్ని చెప్పారు.

ట్రెడిషనల్ రోల్స్ మాత్రమే కాకుండా

ట్రెడిషనల్ రోల్స్ మాత్రమే కాకుండా

మీనా నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అలాగే ఆమె కేవలం ట్రెడిషనల్ రోల్స్ మాత్రమే కాకుండా గ్లామరస్ రోల్స్ కూడా చాలానే చేసింది. సినిమాకు అవసరమైనంత మేరలో గ్లామర్ ప్రజెంటేషన్ ఇచ్చిన ఈ సీనియర్ నటి దాదాపు అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంది. చంటి, ముఠా మెస్త్రి, స్నేహం కోసం వంటి బిగ్ హిట్స్ లో హీరోయిన్ గా నటించింది.

విభిన్నమైన పాత్రలలో

విభిన్నమైన పాత్రలలో

కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన మీనా ఆ తర్వాత ఆయన సినిమాల్లోనే హీరోయిన్ గా కూడా నటించింది. కేవలం ఒక భాషకు మాత్రమే పరిమితం కాకుండా సౌత్ ఇండస్ట్రీ లో ఉన్న అన్ని భాషల్లోనూ మీనా విభిన్నమైన పాత్రలలో కనిపించింది. తనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పరచుకుందనే అనే చెప్పాలి.

వయసుకు తగ్గట్టుగా..

వయసుకు తగ్గట్టుగా..

ఇక మెల్లగా పెళ్లి అనంతరం రెగ్యులర్ హీరోయిన్ గా సినిమాలు తగ్గించిన మీనా ఆ తర్వాత కూడా సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక విధంగా కొనసాగుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఆమె వయసుకు తగ్గట్టుగా పాత్రలు చేస్తున్నారు. అలాగని కేవలం తల్లి పాత్రలు కాకుండా దృశ్యం వంటి సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా విభిన్నమైన పాత్రల్లో కనిపించే ప్రయత్నం చేస్తున్నారు.

మీనా కూతురు కూడా..

మీనా కూతురు కూడా..

మలయాళం తెలుగులో మీనా దృశ్యం సినిమాలలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో ఆమె అత్యధిక పారితోషికం కూడా అందుకుంది.. మీనా కూతురు నైనికా కూడా చిత్ర పరిశ్రమలో నటిగా కొనసాగుతోంది. ఆమె 2016లో విజయ్ తెరి సినిమాతో తెరంగ్రేటం చేసింది. ప్రస్తుతం మీనా కూతురు నైనికా వయసు పదకొండేళ్లు.

కొత్త సంవత్సరం బ్యాడ్ న్యూస్

కొత్త సంవత్సరం బ్యాడ్ న్యూస్

ఇక రెగ్యులర్ గా సోషల్ మీడియాలో బ్యూటిఫుల్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉండే మీనా ఇటీవల మాత్రం ఒక బాడ్ న్యూస్ చెప్పాల్సి వచ్చింది. కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ సమయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉన్న మీనా ఇప్పుడు మాత్రం కరోనా బారిన పడక తప్పలేదని వివరణ ఇచ్చారు. ఇన్ని రోజులు మమ్మల్ని చూడలేని కరోనా కొత్త సంవత్సరం మాత్రం మా ఇంట్లో అందరినీ పలకరించింది అంటూ విభిన్నంగా పోస్ట్ చేశారు.

Recommended Video

Drushyam 2 Movie Review | Venkatesh | Meena || Filmibeat Telugu
జాగ్రత్తగా ఉంటే..

జాగ్రత్తగా ఉంటే..

ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని మన జాగ్రత్తలో మనం ఉంటే కరోనా నుంచి తప్పించుకోవడమే కాకుండా ఇతరులకు కూడా కాపాడిన వాళ్ళం అవుతాము అని సోషల్ మీడియాలో ఒక ప్రత్యేకమైన ఫోటో పోస్ట్ చేస్తూ వివరణ ఇచ్చారు. ప్రస్తుతం మీనా మలయాళం టాప్ సింగర్ టీవీ షో తో బిజీగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X