ఈ వయసులో కూడా చూపు తిప్పుకొనివ్వకుండా చేస్తున్న మీన.. ఫొటోస్ వైరల్

సౌత్ సినిమా ఇండస్ట్రీలో అందంతోనే కాకుండా నటనతో కూడా మంచి క్రేజ్ అందుకున్న వారిలో మీన ఒకరు. తమిళ అమ్మాయి అయినప్పటికీ తెలుగు ప్రజల్లో ఆమె చెరగని ముద్ర వేసుకున్నారు. ఏ భాషలో నటించినా కూడా ఆ భాషకు సంబంధించిన అమ్మాయి అనేలా క్రేజ్ అందుకుంటోంది.20 ఏళ్లకు పైగా సినిమా ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్టుగా ఉంటున్న మీనా ప్రస్తుతం తమిళనాడులోనే ఉంటోంది. ఇక ఇటీవల ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

ఏడాదికి ఏడెనిమిది సినిమాలు

ఏడాదికి ఏడెనిమిది సినిమాలు

వయసులోనే వెండితెరకు బాల నటిగా ఎంట్రీ ఇచ్చిన మీన అప్పట్లోనే బిజీ బిజీగా కనిపించింది. ఇక 16 ఏళ్ల తరువాత తమిళ్ లోనే కాకుండా తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో కూడా హీరోయిన్ గా నటించి మంచి క్రేజ్ అందుకుంది. 1990 నుంచి 2003 వరకు కూడా మీన కెరీర్ కు అస్సలు బ్రేక్ పడలేదు. హీరోయిన్ గా ఆమె ఏడాదికి ఏడెనిమిది సినిమాలు చేసుకుంటూ వెళ్ళేది.

హీరోలందరితోను..

హీరోలందరితోను..

సౌత్ ఇండియన్ కు సంబంధించిన భాషలన్ని కూడా అనర్గళంగా మాట్లాడగల మీనా హిందీలో కూడా పర్ఫెక్ట్. మీనా చాలా వరకు ఇండస్ట్రీలో ఏనాడు పెద్దగా కాంట్రవర్సీలకు వెళ్లలేదు. ఆమె దాదాపు అగ్ర హీరోలందరితోను యాక్ట్ చేసింది. ఇప్పుడు కూడా దృశ్యం వంటి సినిమాల ద్వారా ఫీమేల్ లీడ్ పాత్రల్లో నటిస్తోంది. ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా అప్పుడప్పుడు ఆడియెన్స్ కి టచ్ లో ఉంటోంది.

ఏళ్ళు గడిచినా క్రేజ్ తగ్గలేదు

ఏళ్ళు గడిచినా క్రేజ్ తగ్గలేదు

కేవలం సినిమా సీరియల్స్ లలో నటిగానే కాకుండా మీనా టెలివిజన్ రియాలిటీ షోలతో హాస్ట్ గా కూడా దర్శనమిస్తోంది. ఆ మధ్య జబర్దస్త్ షోలో కూడా ఆమె స్పెషల్ జడ్జ్ గా రోజా పక్కన దర్శనమిచ్చింది. ఏదేమైనా మీనాకు అప్పుడున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని అర్ధమవుతోంది. ఆమె సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టినా కూడా నిమిషాల్లో వైరల్ అవుతోంది.

డామినేట్ చేయడం గ్యారెంటీ

డామినేట్ చేయడం గ్యారెంటీ

మీన వయసు ప్రస్తుతం 44 అంటే నమ్మడానికి కష్టంగానే ఉంటుంది. నేటితరం హీరోయిన్స్ ఆమె పక్కన నిలబడితే డామినేట్ చేయడం గ్యారెంటీ. ఇక సపోర్టింగ్ పాత్రలతోనే కాకుండా లీడ్ రోల్స్ కూడా చేస్తోంది మీన. ఇటీవల మళయాళంలో దృశ్యం 2తో హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు తెలుగు దృశ్యం 2లో కూడా నటించడానికి రెడీ అయ్యారు.

మీన కూతురు కూడా

మీన కూతురు కూడా

ఒక యాడ్ షూట్ లో భాగంగా రీసెంట్ గా కెమెరెమెన్ చోటా కె నాయుడుతో ఆమె కలిసి ఫొటోలు దిగారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇక 2009లో విద్యాసాగర్ అనే వ్యక్తిని ఇష్టపడి పెళ్లి చేసుకున్న మీనకు నైనిక అనే 10ఏళ్ల కూతురు కూడా ఉంది. నైనిక కూడా అప్పుడప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X