ఆ హీరో నా చేత స్విమ్‌సూట్ వేయించి.. ఆ క్షణంలో అలా చచ్చిపోయా : మీనా హాట్ కామెంట్స్

సినిమాల్లో నటించడమంటే అంత ఆషామాషీ కాదు. ముక్కు మొహం తెలియని వారు ముందు ఆడిపాడాల్సి ఉంటుంది. పరాయి వ్యక్తి శరీరాన్ని తాకుతున్నా మౌనంగా భరించాల్సి ఉంటుంది. వందలాది మంది చూస్తుండగా.. అందాలను ఆరబోయాలి, కథ డిమాండ్ చేసిన మేరకు కాస్ట్యూమ్స్ ధరించాలి. ఎండ, వాన, చలిని లెక్కచేయకుండా కాలంతో పరుగులు తీయాలి.. తెల్లవారుజామున 4 గంటల వరకు షూటింగ్ చేసి అలిసి పడిపోయినా తిరిగి 5 గంటలకే మేకప్ వేసుకుని రెడీ అవ్వాలి.

నటీనటులు, టెక్నీషియన్లు, ఇతర కార్మికులు ఎంతో కష్టపడితే కానీ మనం రెండున్నర గంటల పాటు సినిమా ఆస్వాదించలేం. ఎన్ని బాధలున్నా పంటి బిగువున భరించి, మనకు వినోదాన్ని పంచుతున్న కళాకారులను గౌరవించాల్సిన అవసరం ఎంతో ఉంది. వారిని చులకనగా మాట్లాడటం, హేళన చేయడం సరికాదు.

senior actress meena made sensational comments about wearing swimsuit

మనిషి అన్నాకా ఎవరి కంఫర్ట్‌ను బట్టి వారు దుస్తులు ధరిస్తారు. కానీ సినీనటులకు ఆ ఛాయిస్ ఉండదు.. దర్శకుడు, కథ ఏం చెబితే అది చేయాల్సిందే. కొందరికి కొన్ని బట్టలు వేసుకోవడం ఇష్టం ఉండదు.. అయినప్పటికీ తప్పదు. ముఖ్యంగా హీరోయిన్లు ఈ విషయంలో ఎంతో ఇబ్బంది పడతారు. ఎందరో తారలు ఫలానా సినిమా షూటింగ్ సమయంలో తమకు ఇష్టం లేకపోయినా ఆ కాస్ట్యూమ్స్ వేసుకోవాల్సి వచ్చిందని వాపోయిన సందర్భాలెన్నో.

ఇదిలాఉండగా.. బాలనటిగా నటించి హీరోయిన్లుగా వెలుగొందిన వారు ఎందరో ఉన్నారు. ఈ కోవలోకే వస్తారు మీనా. తొలిచిత్రంలోనే దిగ్గజ నటుడు శివాజీ గణేషన్ సినిమాలో నటించిన మీనా.. తెలుగు, తమిళ భాషల్లో బాలనటిగా పీక్స్ చూశారు. దక్షిణాదిలోని అందరూ అగ్రనటులతో ఆడిపాడి.. 90వ దశకంలో స్టార్ హీరోయిన్‌గా ఇండస్ట్రీని ఏలారు మీనా. ఆ సమయంలో రమ్యకృష్ణ, సౌందర్య, రోజా, రాశి వంటి వారి నుంచి తీవ్ర పోటీ ఎదురైన తన అందం, అభినయంతో తిరుగులేని నటిగా రాణించారు .

senior actress meena made sensational comments about wearing swimsuit

కొత్త అమ్మాయిల రాకతో మీనాకు అవకాశాలు తగ్గాయి. ఈ విషయాన్ని వేగంగా పసిగట్టిన ఆమె పెళ్లి చేసుకుని , ఫ్యామిలీ లైఫ్‌లోకి ఎంటరవ్వాలని నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా 2009లో బెంగళూరుకు చెందిన విద్యాసాగర్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను పెళ్లాడారు. ఈ దంపతులకు నైనిక అనే కుమార్తె ఉంది. ఇళయ దళపతి విజయ్ నటించిన తేరి మూవీలో నైనిక బాలనటిగా నటించింది. కొద్దినెలల క్రితం మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. సెకండ్ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన మీనాకు మంచి క్యారెక్టర్లు వస్తున్నాయి. సినిమాలతో పాటే పలు టీవీ షోలకు హోస్ట్‌గా, పలు రియాల్టీ షోలకు జడ్జిగానూ వ్యవహరిస్తున్నారు.

అందాల ఆరోబోత , బోల్డ్ సీన్స్‌లో నటించడం, బికినీ లేదా స్విమ్ సూట్‌లలో నటించడం తనకు ఇష్టముండదట. అలాంటిది మీనా ఓ హీరో వల్ల స్విమ్ సూట్ వేసుకోవాల్సి వచ్చిందట. ఆయన ఎవరో కాదు.. ప్రభుదేవా. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. స్విమ్ సూట్స్ వేసి గ్లామరస్ రోల్స్‌లో నటించాలని ప్రభుదేవా సూచించారని తెలిపింది. ఆయన హీరోగా వచ్చిన ఓ మూవీలో స్విమ్ సూట్ వేసుకోవాల్సి రావడంతో చాలా ఇబ్బంది అనిపించిందని, డ్రెస్ వేసుకుని మేకప్ రూమ్ నుంచి రావడానికి సిగ్గేసిందని మీనా గుర్తుచేసుకున్నారు. గ్లామరస్ రోల్స్ చేయడం చాలా కష్టమని.. ఆ టైప్ క్యారెక్టర్లు చేసేవాళ్లకు దండాలంటూ ఆమె సరదాగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మీనా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: movies meena swimsuit
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X