Namitha: తల్లి కాబోతున్న మాజీ హీరోయిన్.. 41 ఏళ్ళ వయసులో బేబీ బంప్ తో ఇలా!

ఒకప్పుడు గ్లామరస్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న నమిత ఒకానొక టైమ్ లో అగ్ర హీరోయిన్ గా చక్రం తిప్పింది. తెలుగులో అయితే ఈ బ్యూటీ అందానికి కుర్రాళ్లు ఫిదా అయ్యారు. ఇక ఆ తరువాత తమిళ చిత్ర పరిశ్రమలోకి వెళ్లి అక్కడ కూడా మంచి క్రేజ్ అందుకుంది. అయితే ఈ బ్యూటీ మొత్తానికి తల్లిగా మరొక కొత్త అడుగు వేయడానికి సిద్ధమైంది. బేబీ బంప్ తో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అమ్మడు తన సంతోషాన్ని కూడా షేర్ చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..

సొంతం సినిమాతో..

సొంతం సినిమాతో..

సొంతం సినిమాతో వెండితెరకు పరిచయమైన నమిత ఆ తరువాత వెంకటేష్ జెమిని సినిమాతో మంచి క్రేజ్ అందుకుంది. ఆ సినిమా అనుజున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికి కూడా నమిత గ్లామర్ కు అందరూ ఫిదా అయ్యారు. ముంబై హీరోయిన్స్ చక్రం తిప్పుతున్న సమయంలో అమ్మడు తన క్యూట్ స్మైల్ తోనే ఆడియెన్స్ ను సంపాదించుకుంది.

తమిళంలో బిజీగా..

తమిళంలో బిజీగా..

ఇక కొన్నాళ్ళు తెలుగు తమిళ్ అని తేడా లేకుండా సౌత్ ఇండస్ట్రీలో చాలా బిజీగా మారిపోయిన నమిత ఒకానొక సమయంలో చాలా బొద్దుగా మారిపోయింది. ఆమె పనైపోయింది అని అందరూ అనుకున్నారు. కానీ నమితకు మాత్రం తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోయినప్పటికి తమిళంలో మాత్రం చాలామంచి అవకాశాలు వచ్చాయి. అలాగే ఐటెమ్ సాంగ్స్ తో కూడా ఈ బ్యూటీ ఆదరగొట్టేసింది.

అతనితో పెళ్లి..

అతనితో పెళ్లి..

ఇక 2017లో వీరేంద్ర చౌదరి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అంతకు ముందే అతనితో కొన్నేళ్లపాటు ప్రేమలో ఉన్న నమిత డేటింగ్ చేసిన అనంతరం పెళ్లికి ఒప్పుకుంది. తెలుగు వ్యక్తి అయిన వీరేంద్ర ఇష్ట ప్రకారం నమిత అతన్ని తిరుపతిలో పెళ్లి చేసుకుంది. అప్పట్లో వీరి పెళ్లి వార్త వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచింది.

41 ఏళ్ళ వయసులో..

41 ఏళ్ళ వయసులో..

ఇక మొత్తానికి నమిత తన 41 ఏళ్ళ వయసులో తల్లి కాబోతోంది. తనకు సంబంధించిన బేబీ బంప్ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. గత కొంతకాలంగా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్న నమిత ఈ విషయం బయట ఎవరికి చెప్పకుండా సడన్ ట్విస్ట్ ఇచ్చింది. గత ఏడాది నుంచె నమిత సినిమాలకు దూరంగా ఉండి.

బేబీ బంప్ ఫొటోలు వైరల్

బేబీ బంప్ ఫొటోలు వైరల్

నమిత బేబీ బంప్ ఫొటోలను పోస్ట్ చేస్తూ చాలా ఎమోషనల్ గా వివరణ ఇచ్చింది. తన జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైనట్లు చెబుతూ.. తన బిడ్డ యొక్క సున్నితమైన కిక్‌లను తాను అనుభవిస్తున్నానని చెప్పింది. ఈ సమయంలో తాను చాలా సంతోషంగా ఉన్నానని కూడా ఆమె వివరణ ఇచ్చింది. ఇక నమిత ఫొటోలు అలా పోస్ట్ చేయగానే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

ఇక నమిత చివరగా 2021లో బౌ బౌ అనే ఒక తమిళ సినిమాలో నటించింది. ఇక తెలుగులో నమిత ఐ లవ్ యూ అనే సినిమా అనంతరం మళ్ళీ మరో సినిమా చేయలేదు. మరి తల్లిగా మారిన అనంతరం ఆమె మళ్ళీ సినిమాల్లో కొనసాగుతుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X