ఆ హీరోను కాదు.. సౌందర్య ప్రేమించింది అతడిని.. బట్టబయలు చేసిన సీనియర్ హీరోయిన్!

అందం, అభినయం కలబోసిన రూపం సౌందర్యది. ఆమె ముఖం చూడగానే చేతులు ఎత్తి దండం పెట్టాలి అనిపిస్తుంది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. అచ్చతెలుగు అమ్మాయిగా .. సౌందర్య తెలుగువారికి సుపరిచితం. ఇక ఎప్పటికీ మరువలేని జ్ఞాపకంగా ఆమె తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా కొలువుండిపోయింది. సౌందర్య జీవితం అందరికి తెరిచిన పుస్తకం. కానీ, ఆ పుస్తకంలో ప్రేక్షకులకు తెలియని పేజీలు ఎన్నో.

సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా అందరి హీరోలతో నటించి మెప్పించిన ఘనత సౌందర్యది. ఆమెలాంటి నటి ఇంకెప్పటికీ పుట్టదు. ఎంతమంది వచ్చినా ఆమెను రీప్లేస్ చేయలేరు అనే చెప్పాలి. ఆ అందం, నవ్వు, కళ్లు.. ఇంకెవరికి రావు. గ్లామర్ గా కనిపించినా.. చీరకట్టుతో కనిపించినా ఆ అందాన్ని వర్ణించడం ఎవరితరం కాదు.

Senior actress Nirmala revealed that Soundarya had told her that she loved her uncle during the shooting of Jayam Manadera

ఇక ఇండస్ట్రీ లో హీరోయిన్స్ అంటే.. హీరోలతో ప్రేమలో పడడం, పెళ్లి చేసుకోవడం సాధారణమే. కొన్నిసార్లు ఎక్కువ సినిమాలు కలిసి చేసినా కూడా వారిద్దరి మధ్య ప్రేమ ఉందని పుకార్లు పుట్టించేవారు. దానికి సౌందర్య కూడా అతీతం కాదు. హీరో జగపతిబాబు ను సౌందర్య గాఢంగా ప్రేమించిందని, కానీ, ఇంట్లో ఒప్పుకోకపోవడంతో పెళ్లి చేసుకోలేకపోయిందని ఒక వార్త ఇప్పటికీ వినిపిస్తుంది. ఈ వార్తపై జగపతిబాబు ఎప్పుడో క్లారిటీ ఇచ్చాడు. సౌందర్య, నేను చాలామంచి స్నేహితులం. ఆమె మా ఇంటికి వచ్చి వెళ్తుండేది. నేను వాళ్ళింటికి వెళ్తుండేవాడిని. అలా ఉండడంతో మేము ప్రేమించుకుంటున్నాం అని పుకార్లు వచ్చాయి. అవి విని మేము నవ్వుకునేవాళ్లం అని చెప్పుకొచ్చాడు.

అయితే ఆ తరువాత సౌందర్య.. తన చిన్ననాటి స్నేహితుడు అయిన రఘును వివాహం చేసుకుంది. అయితే సౌందర్య జీవితంలో ప్రేమ కథనే లేదా అంటే.. ఉందంట. ఆ విషయాన్నీ సీనియర్ నటి నిర్మల ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. ఎన్నో సినిమాల్లో హీరోలకు తల్లిగా నటించి మెప్పించింది నిర్మల. జయం మనదేరా సినిమాలో వెంకటేష్ కు తల్లిగా , సౌదర్యకు అత్తగా ఆమె నటించింది . అప్పట్లో వారిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉండేదట.

Senior actress Nirmala revealed that Soundarya had told her that she loved her uncle during the shooting of Jayam Manadera

తాజాగా ఒక ఇంటర్వ్యూ ఆమె సౌందర్య ప్రేమ గురించి బయటపెట్టింది. జయం మనదేరా షూటింగ్ చాలావరకు విదేశాల్లోనే జరిగింది. అప్పుడు సౌందర్య, నేను చాలా క్లోజ్ అయ్యాం. ఒకరోజు ఆమె పాటలు వింటూ డ్యాన్స్ చేస్తూ హ్యాపీగా కనిపించింది. నేను చూసి.. ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నావ్ అంటే ఏం లేదు అని సిగ్గుపడింది. ఏయ్ దొంగ.. ఏదో ఉంది చెప్పు అని అడగ్గా.. తన మేనమామను తాను గాఢంగా ప్రేమిస్తున్నాను అని చెప్పింది. తన అమ్మ తమ్ముడు అంటే తనకు చాలా ఇష్టమని తెలిపింది.

సౌందర్యకు జీవితంలో ఎన్నో కలలు ఉన్నాయి. ముఖ్యంగా తనకు పిల్లలను పెంచడం చాలా ఇష్టం,. లైఫ్ లో ఆశలు తీరకుండానే ఆమె వెళ్ళిపోయింది" అంటూ కంటనీరు పెట్టుకుంది. రఘును పెళ్లాడిన ఏడాదికే ఆమె ఒక విమాన ప్రమాదంలో కన్నుమూసిన సంగతి తెల్సిందే. ఏదిఏమైనా సౌందర్య లేని లోటు ఆమె కుటుంబానికే కాదు ఇండస్ట్రీకి కూడా తెలుస్తోందిని అభిమానూలు చెప్పుకోస్టున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X