ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. డైరెక్టర్ బలవంతంతో వ్యభిచారంలోకి.. చివరికి దయనీయ పరిస్థితిలో..

Nisha Noor: సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. రంగులు వేసుకొని అందర్నీ అలరించడం మాత్రమే తెలుసు. కానీ, ఆ రంగుల వెనుక చీకటి ప్రపంచం ఉందనే విషయం అందరికి తెలియదు. ఒక్కసారిగా ఆకాశమంత ఎత్తులో నిలబెట్టినా.. అంతకంటే.. వేగంగా అథ:పాతంలోకి తొక్కేస్తుంది. ఈ శక్తి సినిమాకే ఉంది. ఓ సినిమా హిట్ అయితే ఓవర్ నైట్ స్టార్ గా మారుతారు. దర్శక నిర్మాతలు ఇంటి దగ్గర క్యూ కడుతారు. తేడా వస్తే.. మన వైపు కన్నేత్తి ఎదురుచూసే వాళ్లు ఉండరు. ఫిలిం ఇండస్ట్రీ ఇక చీకటి ప్రపంచంలో ఎంతోమంది తారలు కనుమరుకైపోయారు. అలాంటి తారల్లో హీరోయిన్ నిషా నూర్ ఒకరు.

ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకొని ఓ వెలుగు వెలిగిన నిషా నూర్..తన చివరి దశలో అనాథగా, అధ్వాన స్థితిలో మరణించింది. నటనను నమ్ముకుని తొలినాళ్లలో సిని రంగంలో మెరిసిన ఆ తర్వాత దిక్కుతోచని పరిస్థితుల్లో ఒళ్ళు అమ్ముకుంది. కెరియర్ పీక్లో ఉన్న సమయంలో తప్పటడుగు వేసిన ఈనాటి అత్యంత దీనస్థితిలో 2007లో ఎయిడ్స్ వ్యాధితో మృతి చెందింది.

Senior Actress Nisha Noor Tragic Life Story Died of AIDS After Forced Prostitution

1962 సెప్టెంబర్ 18న తమిళనాడులోని నాగపట్నం లో పుట్టిన నిషా నూర్.. మంగళ నాయకి అనే తమిళ సినిమాతో తన కెరీర్ స్టార్ చేసింది. వరుస అవకాశాలు రావడంతో స్టార్ గా మారింది. దీంతో స్టార్ హీరోలతో నటించే అవకాశాన్ని పొందింది. 1980లో నిషా నూర్ తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఈ సమయంలో అగ్ర హీరోలైనా రజినీకాంత్, కమల్ హాసన్, మోహన్ లాల్, రాజేంద్రప్రసాద్, భానుచందర్ వంటి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది.

నూర్ కెరీర్ లో కమల్ హాసన్ తో నటించిన టిక్ టిక్ టిక్ , రజనీకాంత్ తో శ్రీ రాఘవేంద్ర, మోహన్ లాల్ తో దేవాసులం వంటి సినిమాలు ఆమెకు మంచి గుర్తింపు తీసుకవచ్చాయి. ఈ క్రమంలో ఈ అమ్మడు తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకుంది. 1980 నుంచి 1995 వరకు ఏదొక పరిశ్రమ నుంచి అవకాశం అందుకుంది. దీంతో నిషా నూర్ జీవితం సాఫీగా సాగిపోయింది. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.. నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోయాయి.

1995 తర్వాత నిషా నూర్ కు ఒక్కటంటే ఒక్క సినిమా అవకాశం కూడా రాలేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ అమ్మడుకు అవకాశాలు రాకపోవడంతో తల్లడిపోయింది. అప్పటికే ఆమె సంపాదించిందంతా కరిగిపోయింది. ఇక బతకడానికి ఏదో ఒక పని చేయాలని భావించింది. ఈ క్రమంలో ఓ తప్పుడు మార్గాన్ని ఎంచుకోండి. అదే నిషా జీవితాన్ని నాశనం చేసింది. ఒక సినిమా నిర్మాత బలవంతంతో తప్పనిసరి పరిస్థితుల్లో సంపాదన కోసం నిషా నూర్ వ్యభిచారంలోకి దిగాల్సి వచ్చింది. వ్యభిచారం వల్ల కొంతకాలం ఆమె జీవితం సాగింది.

Senior Actress Nisha Noor Tragic Life Story Died of AIDS After Forced Prostitution

కానీ, ఇది ఎంతో కాలం సాగలేదు. కొన్నేళ్లకు ఆ దారి కూడా మూసుకుపోయింది. దీంతో మళ్ళీ కష్టాల్లో పడిపోయింది. ఆదాయం లేకపోవడం, సినీ పరిశ్రమ నుంచి ఎలాంటి సహకారం లేకపోవడం, ఆర్థిక కష్టాలతో అత్యంత పేదరికం అనుభవించింది. ఈ క్రమంలో అనారోగ్య కారణాలతో మంచనా పడింది. ఒకప్పుడు అందాల తారగా ఆరాధించబడిన నిషా చివరి రోజుల్లో అనాథగా.. ఎముకల గూడులా మారిపోయింది. గుర్తుపట్టలేని స్థితికి చేరుకుంది.

ఈ సమయంలో ఓ ఎన్జీఓ సంస్థ.. నిషాకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమెకు ఎయిడ్స్ ఉన్నట్లు గుర్తించింది. అప్పటికే తన ఆరోగ్యం విషమించడంతో 2007లో ఒక అనాధగా కన్నుమూసింది. ఒకప్పడు భోగా భాగ్యాలు అనుభవించిన నిషా .. చివరి దశలో నా అనే వాళ్ళు లేకుండా 44 ఏళ్ల వయసులో ప్రాణాలు కోల్పోయింది. నిషా నూర్ జీవితం సినిమా ఇండస్ట్రీలోని చీకటి కోణానికి ప్రతిరూపం.

More from Filmibeat

Read more about: nisha noor
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X