ఓ స్టార్ హీరో నాతో అలా దారుణంగా.. యువ నటికి చేదు అనుభవం
తెలుగు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉన్నదా? అనే ప్రశ్నకు వివిధ సమాధానం వస్తునే ఉంటాయి. కొందరూ లేదు.. టాలెంట్ ఉంటే. అవకాశాలు వస్తాయని కొందరూ అంటుంటే.. మరికొందరూ మాత్రం.. అవకాశం కోసం లొంగిపోవాల్సిందేనని మరికొందరి ఆవేదన. ఇలా విభిన్న ఆరోపణలు నిత్యం వెలుగులోకి వస్తునే ఉంటాయి. తాజాగా సీనియర్ నటి పూజిత ఇచ్చిన ఇంటర్వ్యూ దీనిపై మళ్లీ చర్చ మొదలయ్యేలా చేసింది. ఇంతకీ ఏమన్నారంటే?
సీనియర్ నటి పూజిత తెలుగు, తమిళ భాషల్లో కలిపి 138కు పైగా సినిమాల్లో నటించిన నటి. అందులో ఇద్దరి పెళ్లాల ముద్దుల మొగుడు ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. విజయాలతో పాటు మంచి గుర్తింపు సంపాదించిన ఈ నటి తాజాగా తన కెరీర్ ప్రారంభ దశలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను వెల్లడించారు.

ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజిత ఒక స్టార్ హీరో గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. "నేను ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన టైమ్‌లో ఒక బడా హీరో కారులో ఎక్కాను. అయితే ఆ హీరో ఇప్పటికే చనిపోయారు, అందుకే పేరు చెప్పడం ఇష్టం లేదు. ఆయన నా తొడపై చేయి వేసి గోకడం మొదలుపెట్టారు. ఎన్నిసార్లు తీసేసినా మళ్లీ చేశారు. నేను ఆ విషయాన్ని నాన్నకు చెప్పగా ఎలాంటి ప్రశ్నలూ లేకుండా 'స్నానం చేసి నిద్రపో' అన్నాడు" అని చెప్పడంతో ఇంట్లో వాళ్లందరూ షాక్ అయ్యారు.
మరుసటి రోజు ఆమె ఇంటి ముందు కొత్త కారు ఉంది. ఇకపై ఎవరినీ ఆ కారులో ఎక్కించకూడదని తండ్రి చెప్పడం తన జీవితాన్ని మార్చిన సంఘటనగా పేర్కొన్నారు. 'ఇప్పటికీ నా కారులో నేను, నా కుమారుడు, వెనకాల మా పెట్ డాగ్ తప్ప ఎవరూ ఎక్కరు' అని చెప్పిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడిన పూజిత, అన్ని ఫీల్డ్స్‌లో ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ గ్లామర్ రంగం కావడంతో బయటికి ఎక్కువగా వెలుగులోకి వస్తుందని చెప్పారు.
'ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే అమ్మాయిలకు ఏమి జరుగుతుందో తెలియదు. తెలియకుండానే వచ్చేస్తారు. సమస్యలు వచ్చినప్పుడు పల్లెటూరి నుంచి వచ్చిన వాళ్లకు నిలబడే అవకాశం ఉండదు" అని పేర్కొన్నారు. అలాగే "ఎవరైనా అమ్మాయిని వీధిలో ఎవరు వేధిస్తే వెంటనే పోలీస్‌స్టేషన్ వరకూ లాగి తీసుకెళ్లాను" అని చెప్పారు. తాను బంజారాహిల్స్ పోలీసులకు "ఫేమస్" అని చెప్పిన పూజిత, అసలు బాధితులకు అండగా నిలబడే తన ధైర్యం గురించి వివరించారు.
అంతటితో ఆగకుండా.. తణుకు నుండి వచ్చిన ఒక యువతి సంఘటన గురించి చెప్పింది. హీరోయిన్ అవుదామని ఒక అమ్మాయి డబ్బు, బంగారం పెట్టుకొని వచ్చిందని, దొంగలు లాక్కోవడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో పోలీసులు తనని సంప్రదించారని చెప్పారు.ఆమెను చూసి, 'డబ్బు ఉంటే హీరోయిన్ అవ్వొచ్చని అనుకుంటే పొరపాటు. ఇక్కడ డబ్బుతో కాదు, ఇష్టారాజ్యంగా పిలిచే వాళ్ల దగ్గరకు వెళ్లాలి అన్నాను. కొందరు అవకాశాల పేరిట దుర్వినియోగం చేస్తారు" అని చెప్పినట్లు వెల్లడించారు. 'అవకాశం ఇవ్వడానికి ముందు పలు షరతులు పెట్టే పరిస్థితులు వస్తాయి' అని పూజిత స్పష్టం చేశారు.
చివరి మాటగా 'కొంతమంది అమ్మాయిలనే అవకాశాల కోసం తాము ముందుకువచ్చి లొంగిపోతున్నారు. ఇంకొందరికి అవకాశం రాకపోయినా వదిలి వెళ్తున్నారు' అంటూ ఆమె ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి మరోసారి హెచ్చరికగా మాట్లాడుతూ మహిళలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సీనియర్ నటి పూజిత చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి.


Click it and Unblock the Notifications











