Don't Miss!
- News Telangana: బుధవారం నుంచే సమ్మర్ హాలీడేస్..
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బుల్లితెరపై శివగామి రేంజ్లో షాక్ ఇస్తున్న సీనియర్ హీరోయిన్ రాశి.. సాలీడ్ రెమ్యునరేషన్..
తెలుగు హీరోయిన్ రాశి అనగానే అందరికి ఆమె చిరునవ్వే గుర్తుకు వస్తుంది. గ్లామర్ హీరోయిన్స్ హడావుడి ఎక్కువవుతున్న తరుణంలో తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రాశి అప్పటి బ్యూటీలకు గట్టి పోటీని ఇచ్చింది. ఇక చాలా కాలం అనంతరం రాశి బుల్లితెరపై కూడా ప్రత్యేకమైన పాత్రలతో మెప్పిస్తోంది. ప్రస్తుతం జానకి కలగనలేదు సిరియల్ లో ఆమె చేస్తున్న పాత్ర శివగామి రేంజ్ లో క్లిక్కవుతోంది.
ఆ స్టార్ హీరోలతో
చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రాశి ఆ తరువాత మెయిన్ హీరోయిన్ గా మీడియం బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేది. శ్రీకాంత్, జగపతిబాబు వంటి స్టార్స్ తో ఆమె ఎక్కువగా సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నారు. ఇక 90ల కాలంలో ఆమె దాదాపు అగ్ర దర్శకులందరితో వర్క్ చేశారు.
నిజం సినిమాలో బోల్డ్ క్యారెక్టర్
ఫ్యామిలీ ప్రేక్షకులకు బాగా రగ్గరైన రాశి కెరీర్ లో దాదాపు అన్ని మెయిన్ లాంగ్వేజెస్ లో నటించింది. హిందీ మలయాళం కన్నడ సినిమాలలో చేసింది కొన్ని సినిమాలే అయినా కూడా మంచి నటిగా క్రేజ్ అందుకుంది. ఇక కొన్ని సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ కూడా చేసింది. అయితే రాశి అప్పట్లో నిజం సినిమాలో చేసిన బోల్డ్ నెగిటివ్ క్యారెక్టర్ అందరికి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.
రంగస్థలం ఆఫర్ రిజెక్ట్
అప్పటివరకు హోమ్లీ పాత్రలు చేసుకుంటూ వచ్చిన రాశి ఆ ఒక్క సినిమాలో నెగిటివ్ షేడ్స్ తో కాస్త హాట్ గా కనిపించేసరికి ఓ వర్గం ప్రేక్షకుల నుంచి కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ఇక రంగస్థలం సినిమాలో మళ్ళీ రంగమ్మత్త పాత్ర చేసే అవకాశం వచ్చినప్పటికీ రాశి చేయనని ఓపెన్ గానే చెప్పేసింది.
శివగామి రేంజ్ లో
ఇక ప్రస్తుతం రాశి ఒక సీరియల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన 'దియా ఔర్ బాటి హామ్' సిరియల్ ఆధారంగా ప్రసారం అవుతున్న 'జానకి కలగనలేదు' సీరియల్ కు మంచి రేటింగ్స్ అందుతున్నాయి. ముఖ్యంగా జ్ఞానాంబ పాత్రలో నటిస్తున్న రాశి శివగామి రేంజ్ లో షాక్ ఇస్తోంది.
రెమ్యునరేషన్ ఎంతంటే
జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు తన రేటింగ్స్ ను అమాంతంగా పెంచేసుకుంటోంది. జ్ఞానాంబ పాత్రలో నటిస్తున్న రాశి పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇక సీరియల్ ద్వారా కూడా రాశికి రెమ్యునరేషన్ కూడా గట్టిగానే వస్తోందట. వీక్లి పేమెంట్ రూపంలో లక్షకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు టాక్ వస్తోంది. భవిష్యత్తులో రేటింగ్స్ మరింత పెరిగితే రెమ్యునరేషన్ డోస్ కూడా ఇంకాస్త పెరగవచ్చని టాక్.