ఆ హీరోయిన్లకు మితిమీరిన అహంకారం.. రమ్యకృష్ణపై రంభ సెన్సేషన్ కామెంట్స్

ఒకప్పటి హీరోయిన్ రంభ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ అమ్మడి అందం చూడడం కోసమే కుర్రాళ్ళు ఎగబడి మరీ థియేటర్ల ముందు క్యూ కట్టేవారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న రంభ కొంతమంది హీరోయిన్లపై సంచలన కామెంట్స్ చేసింది. వాళ్లంతా అహంభావులే అంటూ ముద్రవేసింది. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరిని ఉద్దేశించి ఇలాంటి కామెంట్స్ చేసిందో ఓ లుక్కేద్దాం పదండి.

దివంగత దిగ్గజ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది రంభ. ఫస్ట్ మూవీతోనే అందరినీ తన వైపుకు తిప్పుకోవడంతో తెలుగు సినిమా ఆఫర్స్ ఈ అమ్మడి ఇంటి ముందు క్యూ కట్టాయి. వరుస సినిమాలతో ఒకానొక సమయంలో బిజీ హీరోయిన్ గా మారిన రంభ అప్పట్లో ఉన్న చాలామంది స్టార్ హీరోయిన్లకు గట్టి పోటీనే ఇచ్చింది.

Senior Actress Rambha sensational comment on Ramya Krishna and heroines attitude

చిన్నచిన్న హీరోల సరసన నటించిన మొదలు పెట్టి స్టార్ హీరోలు, ఆ తర్వాత సీనియర్ హీరోల వరకు అందరితోనూ రొమాన్స్ చేసింది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ, కన్నడ భాషల్లో కూడా సినిమాలు చేసి అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. అయితే ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో స్పెషల్ సాంగ్స్ లో కూడా మెరిసింది. అల్లు అర్జున్ దేశముదురు సినిమాలో అట్టాంటోడే ఇట్టాంటోడే, జూనియర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమాలో నాచోరే అనే ఐటెం సాంగ్స్ చేసి అదరగొట్టింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ ఇద్దరు పిల్లలకు తల్లిగా హ్యాపీ లైఫ్ గడుపుతోంది. అయితే గతంలో రంభ ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్లపై చేసిన కామెంట్స్ తాజాగా మరోసారి వైరల్ అవుతున్నాయి. రమ్యకృష్ణ తనకంటే సీనియర్ అని, ఆమె యాక్టింగ్ అదరగొడుతుంది కాబట్టి రమ్యకృష్ణ అంటే భయమని చెప్పుకొచ్చింది రంభ. హీరోయిన్లలో ఎవరితో కలిసి నటించడం అనే ప్రశ్నకు రంభ స్పందిస్తూ రమ్యకృష్ణ ఎలాంటి డైలాగులైనా అవలీలగా చెప్పేస్తుందని, ఎలాంటి సీన్ అయినా తడబడకుండా చేస్తుంది కాబట్టి ఆమెతో కలిసి నటించడం అంటే భయంగా అన్పిస్తుందని పేర్కొంది.

ఇక ఇండస్ట్రీలో ఎవరైనా తనకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారంటే అది సౌందర్య మాత్రమే అని తెలిపింది. అలాగే తాను సౌందర్య అప్పట్లో ఎంతో క్లోజ్ గా ఉండేవాళ్ళమని గుర్తు చేసుకుంది. ఆ తర్వాత హీరోయిన్ మహేశ్వరి కూడా తనకు మంచి ఫ్రెండ్ అని వెల్లడించింది. అలాగే ఇప్పుడున్న హీరోయిన్లలో త్రిష అంటే ఇష్టమని, మిగిలిన హీరోయిన్స్ యాటిట్యూడ్ చూపిస్తూ చూసి చూడనట్టుగా వెళ్లిపోతారని, ఆమె మాత్రం బాగా మాట్లాడుతుందని చెప్పింది.

తాజాగా త్రిష విజయ్ మేటర్ వైరల్ అవుతుండడంతో మరోసారి రంభ త్రిషపై చేసిన కామెంట్స్ తెరపైకి వచ్చాయి. ఇదిలా ఉండగా కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమార్ పద్మనాథన్‌ను 2010 లో రంభ పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. స్మాల్ స్క్రీన్‌తో పాటు వెండితెరపైనా పలు కార్యక్రమాల్లో ఆమె న్యాయనిర్ణేతగా పాల్గొనడం గమనార్హం.

More from Filmibeat

Read more about: ramba ramya krishna soundarya
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X