54 ఏళ్ల వయసులోనూ అందానికి మెరుగులు .. ఆ పార్ట్ చూపెడుతూ రెచ్చగొడుతున్న రమ్యకృష్ణ
90వ దశకంలో దక్షిణాది చిత్ర పరిశ్రమను ఒక ఊపారు రమ్యకృష్ణ. అందాల ఆరబోతే కాదు అద్భుతమైన నటిగానూ ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. అహంకారం, పొగరు, అమాయకత్వం, పవర్‌ఫుల్ రోల్స్‌కు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు. హీరోయిన్‌గా ఎంత బిజీగా ఉన్నారో సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ అంతే బిజీగా ఉన్న రమ్యకృష్ణ ఐదు పదుల వయసులోనూ అదే అందాన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఈ వివరాల్లోకి వెళితే :
1985లో భలేమిత్రులు మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు రమ్యకృష్ణ. తొలినాళ్లలో సెకండ్ హీరోయిన్‌గానూ నటించారు. అయితే ఆమెకు సరైన హిట్స్ దొరక్కపోవడంతో ఐరెన్ లెగ్ ట్యాగ్ వేశారు కొందరు. అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో తనపై వస్తున్న విమర్శలకు తన నటనతోనే సమాధానం చెప్పారు. కళాతపస్వి, దివంగత కే . విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సూత్రధారులు సినిమా రమ్యకృష్ణకు బ్రేక్ ఇచ్చింది. ఇందులో భానుచందర్‌కు జోడీగా అమాయకత్వం నిండిన పాత్రలో అద్భుతంగా నటించారు రమ్యకృష్ణ.

ఆ తర్వాత దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు చేతుల్లో పడటంతో రమ్యకృష్ణ కెరీర్‌లో ఇక వెనుదిరిగి చూసుకోలేదు . అల్లుడుగారు. అల్లరి ప్రియుడు, ముద్దుల ప్రియుడు, అల్లరి మొగుడు, బంగారు బుల్లోడు, మేజర్ చంద్రకాంత్, క్రిమినల్, హలో బ్రదర్, ముగ్గురు మొనగాళ్లు, అమ్మోరు, ధర్మచక్రం, అన్నమయ్య, ఆహ్వానం, కంటే కూతురినే కనాలిరా, ఇద్దరు మిత్రులు వంటి హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా వెలుగొందారు. మూడున్నర దశాబ్ధాల కెరీర్‌లో తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాల్లో దాదాపు 260కి పైగా సినిమాలు చేశారు రమ్యకృష్ణ.
అందాల ఆరబోతే కాదు.. ఈ జనరేషన్‌లో పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ చేస్తే రమ్యకృష్ణే చేయాలి అన్నంతగా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన నరసింహలో నీలాంబరిగా ఆమె నటన సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఆ సినిమాలో రజనీ , సౌందర్యలను మించి డామినేట్ చేశారు రమ్యకృష్ణ . ఇక రీసెంట్‌గా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలిలో శివగామి దేవిగా ఆమె ఒదిగిపోయారు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీని ప్రేమించి పెళ్లాడారు రమ్యకృష్ణ. ఈ దంపతులకు ఓ బాబు సంతానం. పెళ్లి తర్వాత కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చిన రమ్యకృష్ణ.. సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీ అయ్యారు.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రమ్యకృష్ణ .. తన వ్యక్తిగత వివరాలు, సినిమాల సంగతులను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు. 54 ఏళ్ల వయసులోనూ తరగని అందంతో హాట్ హాట్ ఫోటోషూట్‌లలో పాల్గొంటూ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తున్నారు. తాజాగా తన ముక్కుకు ముక్కుపుడక పెట్టించుకుని దీనికి సంబంధించిన వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. లేటు వయసులోనూ రమ్యకృష్ణ ఏ మాత్రం తగ్గడం లేదని కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











