ఓ హీరోయిన్‌కు తల్లి .. కూతురిని మించి మతిపోగొడుతోన్న సత్యకృష్ణ
తెలుగు సినిమాల్లో అమ్మ, అక్క, వదిన తదితర క్యారెక్టర్ రోల్స్ పోషించే నటీమణులు హీరోయిన్లను మించి అందంతో వెలుగొందుతున్నారు. 40 ఏళ్లు దాటినా చెక్కు చెదరని గ్లామర్‌తో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చే వారు ఎందరో. సీనియర్ హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చాక వాళ్ల అందం ముందు కథానాయికలు నిలబడలేకపోతున్నారు. ఈ కోవలోకే వస్తారు సత్యకృష్ణన్.
సత్యకృష్ణన్ పేరు చెప్పగానే వెంటనే రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి స్వీయ దర్శకత్వంలో నటించిన మెంటల్ కృష్ణలో ఆయనకు వైఫ్‌గా చేసిన అమ్మాయే మన కళ్ల ముందు నిలుస్తుంది. తన అందంతో పాటు వెరైటీగా ఉండే ఆమె వాయిస్ కూడా సత్యకృష్ణన్‌కు ప్లస్ అయ్యింది. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన సత్యకృష్ణన్ ఉన్నత విద్యావంతురాలు. చదువు పూర్తి చేసిన తర్వాత తాజ్ హోటల్స్ కెరీర్ ప్రారంభించిన ఆమె ఎయిర్ హోస్టెస్ కావాలని కలగన్నారు. కానీ విధి మాత్రం ఆమెను సినిమా రంగం వైపు నడిపించింది.

2000వ సంవత్సరంలో క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన డాలర్ డ్రీమ్స్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన సత్యకృష్ణన్.. కొద్దిరోజులకే పెళ్లి చేసుకున్నారు. ఆ వెంటనే పంజాగుట్టలో పీఎన్‌బీ పరిబస్ బ్యాంక్‌లో ఉద్యోగంలో చేరారు. అయితే శేఖర్ కమ్ముల మాత్రం ఆమెను వదిలిపెట్టడలేదు.. ఈ క్రమంలో రాజా - కమిలిని ముఖర్జీ జంటగా నటించిన ఆనంద్‌లో ఓ కీలకపాత్ర కోసం ఆమెను మరోసారి సంప్రదించారు. దీంతో ఉద్యోగానికి రాజీనామా చేసిన సత్యకృష్ణన్.. నటిగా స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. ఆనంద్ చిత్రానికి గాను ప్రతిష్టాత్మక నంది అవార్డ్‌ను అందుకున్నారు.
తర్వాత బొమ్మరిల్లు, ప్రేమంటే ఇంతే, మొదటి సినిమా, ఉల్లాసంగా ఉత్సాహంగా, వినాయకుడు, మెంటల్ కృష్ణ వంటి సినిమాలు సత్యకు మంచి పేరు తీసుకొచ్చాయి. హీరోయిన్ ఫ్రెండ్‌గా, తల్లిగా, అక్కగా, వదినగా దాదాపు దశాబ్ధానికి పైగా వెండితెరపై వెలుగొందారు సత్యకృష్ణన్. తన కెరీర్‌లో 100కి పైగా సినిమాల్లో నటించిన ఆమెకు ఓ అందమైన కూతురు ఉందని, ఆమె కూడా హీరోయిన్ అన్న సంగతి చాలా మందికి తెలియదు. ఏంటీ సత్యకృష్ణన్‌కు అంత పెద్ద కూతురు ఉందా అంటూ నెటిజన్లే షాక్ అవుతున్నారు.
ఆ హీరోయిన్ పేరు అనన్య కృష్ణన్. గ్యాంగ్‌స్టర్ గంగరాజు, ఊ అంటావా మామ ఉహు అంటావా మావాతో పాటు ఇటీవల జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్ హీరోగా నటించిన కేసీఆర్ మూవీలో హీరోయిన్‌గా చేసింది. తల్లి అందమే కూతురుకు కూడా వచ్చిందంటూ నెటిజన్లు కాంప్లిమెంట్ ఇస్తుంటారు. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సత్యకృష్ణన్.. తరచు తన కెరీర్, వ్యక్తిగత వివరాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రెడ్ కలర్ శారీలో చేసిన ఫోటో షూట్ తాలుకా ఫోటోలను షేర్ చేశారు. అవి చూసిన నెటిజన్లు 40 ప్లస్‌లోనూ మీ అందం చెక్కు చెదరలేదని మెచ్చుకుంటున్నారు. మరి ఇంకేందుకు ఆలస్యం ఆ ఫోటోలనూ మీరూ చూసేయండి.


Click it and Unblock the Notifications











