నడిరోడ్డుపై వర్షంలో సీనియర్ నటి స్నేహ సెక్సీ స్టిల్.. వయసు 40 అంటే నమ్మరెమో..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు హోమ్లీ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న నటి స్నేహ. అమ్మడు ఎలాంటి సినిమాలో నటించినా కూడా తన క్యారెక్టర్ హైలెట్ అయ్యేలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటుంది. వీలైనంత సేఫ్ జోన్ లోనే క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్లింది. ఇక పెళ్లి అనంతరం ఆమె గ్లామర్ క్యారెక్టర్స్ తగ్గించి సిస్టర్ మదర్ తరహా పాత్రలు చేస్తూ హైలెట్ అవుతోంది. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేస్తున్న ఫొటోలు హైలెట్ గా నిలుస్తోంది.

చిన్న సినిమాలతోనే..
2000 సంవత్సరం నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న స్నేహ దాదాపు సౌత్ ఇండస్ట్రీలో అన్ని బాషల్లోను నటించింది. తెలుగులో మొదట గోపిచంద్ తొలి వలపు సినిమా ద్వారా పరిచయం అయ్యింది. ఇక కెరీర్ మొదట్లో అమ్మడికి చిన్న సినిమాలతోనే మంచి క్రేజ్ దక్కింది. ఇక ప్రియమైన నీకు హనుమాన్ జంక్షన్ సినిమాలు కూడా స్నేహ క్రేజ్ ను అమాంతంగా పెంచేశాయి.

ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా
ఎక్కువగా తమిళ్ తెలుగులో నటించిన స్నేహ దాదాపు మీడియం రేంజ్ హీరోలందరితోను స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇక ఆమె రేంజ్ కు తగ్గట్టుగా అప్పట్లో రెమ్యునరేషన్ బాగానే అందుకుంది. ఇక మధ్యలో లేడి ఓరియెంటెడ్ సినిమాలు కూడా బాగానే చేసింది. ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా కెరీర్ మొత్తం చా ప్రశాంతంగా సినిమాలు చేసుకుంటూ వెళ్లింది. వీలైనంత వరకు స్నేహ మంచి హోమ్లీ క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకుంటూ వచ్చింది.

సపోర్టింగ్ రోల్స్
ఇక 2012లో ప్రసన్న ను పెళ్లి చేసుకున్న అనంతరం స్నేహ రెగ్యులర్ హీరోయిన్ గా సినిమాలు తగ్గించేసింది. ఇక ఆమె ఇద్దరు పిల్లలకు కూడా జన్మనిచ్చింది. ఇక హీరోయిన్ గా సినిమాలు చాలా వరకు తగ్గించిన అమ్మడు సపోర్టింగ్ రోల్స్ లో ఎక్కువగా నటిస్తోంది. వినయ విధేయ రామ సినిమాలో కూడా వదిన పాత్రలో నటించారు.
సెక్సీ స్టిల్..
ఇక అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ లో స్నేహ చేస్తున్న ఫొటోలు బాగానే వైరల్ అవుతున్నాయి. అప్పుడప్పుడు ట్రెడిషినల్ లుక్ తో పాటు గ్లామర్ లుక్ లో కూడా షాక్ ఇస్తోంది. ఇక ఇటీవల అమ్మడు ఏకంగా నడి రోడ్డులో సెక్సీగా స్టిల్ ఇచ్చింది. వర్షం పడిన రోడ్డు పై మెరుస్తున్న లైట్స్ మధ్యలో అమ్మడు చాలా వయ్యారంగా దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వయసు 40 అంటే నమ్మారెమో..
స్నేహం ప్రస్తుత వయసు 40 అంటే ఎవరు నమ్మారెమో. ఆమె పోస్ట్ చేస్తున్న ఫొటోలు చూస్తుంటే ఇంకా పాతికేళ్ల అమ్మాయి తరహాలో ఉన్నట్లు అర్ధమవుతోంది. వయసుతో మోసం చేస్తున్న స్నేహకు ఇద్దరు పిల్లలు ఉన్నారంటే నమ్మలేము అని అంటారు. ఇక ప్రస్తుతం స్నేహ టాలీవుడ్ కోలీవుడ్ అని తేడా లేకుండా సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తోంది. అలాగే వెబ్ సీరీస్ లలో కూడా నటిస్తోంది. ఇక సీరియల్స్ లో కూడా నటించాలని ఆసక్తిని చూపిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉండడం వలన ఇప్పట్లో బుల్లితెర వైపు వెల్లకపోవచ్చని సమాచారం.


Click it and Unblock the Notifications











