50 ఏళ్ల వయసులో ఆ పని చేస్తున్న సీనియర్ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్

సీనియర్ హీరోయిన్ టబు గురించి తెలుగు వారికి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇక బాలీవుడ్ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తెలుగులో కూలీ నంబర్ 1 సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టింది. అయితే వరుస సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోయిన్ అయిపోయింది. అయితే 50 ఏళ్ల వయసులో టబు ఓ రిస్కీ పని చేస్తుందని తెలుస్తోంది. ఇక ఆ పని గురించి తెలుసుకున్న ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే...

సీనియర్ స్టార్ హీరోయిన్ టబు అసలు పేరు తబుస్సుమ్ హష్మి. ఇక హైదరాబాదులోని ఒక ముస్లిమ్ కుటుంబంలో జన్మించిన ట‌బు... ప్ర‌ముఖ నటులు షబానా అజ్మీ, బాబా అజ్మీలకి టబు స్వయానా మేనకోడలు. ఇక వాళ్లను స్ఫూర్తిగా తీసుకొని ఆమె న‌ట‌నా రంగంలోకి అడుగుపెట్టింది. 1980లో బజార్ అనే బాలీవుడ్ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా టబు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

Senior actress Tabu i

ఇక టాలీవుడ్ లో వెంకటేష్ నటించిన కూలీ నెంబర్ 1 సినిమాతో హీరోయిన్ గా నటించి... తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది టబు. ఈ చిత్రం 1987లో విడుద‌లై.. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్టుగా నిలిచింది. ఈ మూవీతో ట‌బుకు మంచి క్రేజ్ అయితే వచ్చింది. మ‌రోవైపు బాలీవుడ్ లో అజ‌య్ దేవ‌గ‌న్ స‌ర‌స‌న విజయ్‌పథ్ అనే మూవీలో నటించి మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది.

టాలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్ లోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లోనే కాకుండా నటనకు ప్రాధాన్యమున్న కథల్లోనూ నటించి హీరోల‌తో స‌మానంగా ఫాలోయింగ్ పెంచుకుంది. త‌మిళంలోనూ అనేక సినిమాలు చేసి... కెరీర్ ప‌రంగా సూప‌ర్ స‌క్సెస్ అయింది. కానీ... ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో మాత్రం వెన‌క‌ప‌డిపోయిందని చెప్పవచ్చు.

దాదాపు మూడు ద‌శాబ్దాల నుంచి సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ.. 50ఏళ్లు వచ్చినా... పెళ్లి చేసుకోకుండా ఒంట‌రి జీవితాన్నే గ‌డుపుతోంది టబు. ఇక వ‌య‌సు పైబ‌డినా ఆమె అందం త‌గ్గ‌లేదని చెప్పవచ్చు. ప్రస్తుతం స్టార్ హీరోల చిత్రాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా కొన‌సాగుతుంది. అయితే ఐదు ప‌దుల వ‌య‌సు వ‌స్తున్న ట‌బు ఏ హీరోయిన్ చెయ్య‌ని ప‌ని చేస్తోందని తెలుస్తోంది. అది తెలుసుకున్న ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

టబు ప్రస్తుతం ఖుఫియా అనే బాలీవుడ్ మూవీలో న‌టిస్తోంది. విశాల్ భరద్వాజ్ రచించి, నిర్మించి, దర్శకత్వం వహిస్తున్న స్పై థ్రిల్లర్ మూవీ ఖుఫియా. ఇందులో కీలక పాత్రలో ట‌బు నటించింది. అలీ ఫజల్, వామికా గబ్బి, ఆశిష్ విద్యార్థి త‌దిత‌రులు నటించారు. అయితే ఇందులో ట‌బు ఓ స్పైగా, ప్రేమికురాలిగా క‌పించ‌నుందని తెలుస్తోంది. స్పైగా ఛేజింగ్ లు, ఎస్కేప్‌లు, ఫైట్స్ వంటివి ఉంటాయ‌ని తెలుస్తోంది.

ఇలాంటి క్యారెక్టర్ లో టబు కనిపిస్తుండగా.. ఆమె ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. యాభై ఏళ్ల వ‌య‌సులో ట‌బు ఇలాంటి రోల్ చేయ‌డం డేరింగ్ స్టెప్ అంటూ ప్రశంసిస్తున్నారు. మరోవైపు ఆమె ఈ వయసులో ఫైటింగ్ సీన్స్ ఎలా నటిస్తుందోనని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఈ సినిమా నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబర్ 5న విడుదల కానుంది. మ‌రి ఈ స్పై థ్రిల్ల‌ర్ తో ట‌బు ఎలాంటి ఫ‌లితాన్ని అందుకుంటుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X