Tabu: 52 ఏళ్ల వయసులో టబు హాట్ షో.. ఏకంగా షర్ట్ విప్పేసి మరీ!
తెలుగులో ఎంతో మంది హీరోయిన్లు భారీ సంఖ్యలో సినిమాలు చేసినా గుర్తింపును సొంతం చేసుకోలేదు. కానీ, కొందరు మాత్రం తక్కువ చిత్రాల్లోనే కనిపించినా యమ పాపులర్ అయ్యారు. అందులో సీనియర్ హీరోయిన్ టబు ఒకరు. సాదాసీదాగానే టాలీవుడ్‌లోకి ఎంటరైన ఈ భామ.. విశేషమైన ఇమేజ్‌ను దక్కించుకున్నారు. దీంతో వరుసగా ఆఫర్లను సొంతం చేసుకున్నారు. ఇప్పటికీ బాలీవుడ్‌లో తనదైన చిత్రాలను చేస్తోన్నారు. అలాగే, టబు సోషల్ మీడియాలోనూ రెచ్చిపోతోన్నారు. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలారు. వాటిని మీరే చూసేయండి!

అలా మొదలు.. ఎక్కువ అక్కడే
హైదరాబాద్‌కు చెందిన టబు బాలీవుడ్‌లోనే బాలనటిగా పరిచయమైంది. ఆ తర్వాత హీరోయిన్‌గా కూడా అక్కడే మొదటి చిత్రాన్ని చేశారు. ఈ క్రమంలోనే 'కూలీ నెం 1' మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించారు. ఆ తర్వాత టాప్ హీరోలు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో నటించారు. అయినప్పటికీ ఎక్కువ సినిమాలను మాత్రం హిందీలోనే చేశారు.

అల... రీఎంట్రీ ఇచ్చిన బ్యూటీ
తెలుగులో చాలా తక్కువ సినిమాల్లోనే నటించిన టబు.. లాంగ్ గ్యాప్ తర్వాత మరోసారి కొన్ని చిత్రాలను చేశారు. కానీ, బాలకృష్ణ నటించిన 'పాండురంగడు' సినిమా తర్వాత ఆమె మరోసారి టాలీవుడ్‌కు దూరం అయ్యారు. అయితే, త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన 'అల.. వైకుంఠపురములో'తో ఆమె రీఎంట్రీ ఇచ్చారు. ఇందులో డీసెంట్ రోల్‌తో ఫిదా చేసేశారు.

అప్పటి నుంచి భారీగా ఆఫర్లు
మొదటి నుంచీ హిందీ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన హీరోయిన్ టబు.. ఎన్నో హిట్లను అందుకున్నారు. ఆ మధ్య 'అంధాధున్' రూపంలో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. తర్వాత అడల్ట్ కంటెంట్ ఉన్న 'ఏ సూటబుల్ బాయ్'లో నటించారు. దీంతో ఆమె పేరు మారుమ్రోగింది. అప్పటి నుంచి టబుకు బాలీవుడ్‌లో అవకాశాలు మరోసారి పెరిగాయి.

వరుస చిత్రాలు... ఫుల్ బిజీగా
ఐదు పదుల వయసు దాటిపోయినా టబు మాత్రం ఎంతో స్పీడుగానే సినిమాలు చేస్తోన్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది 'దృశ్యం 2'తో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. అలాగే, 'భూల్ భులయా'లోనూ నటించారు. ఇక, ఈ ఏడాది అప్పుడే 'కుత్తే' అనే చిత్రంతో వచ్చారు. ఇప్పుడు 'భోళా'తో రాబోతున్నారు. వీటితో పాటు 'ఖుఫియా'తో పాటు పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా
సీనియర్ హీరోయిన్ టబు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆమె తరచూ ఏదో ఒక ఫొటోలు పెడుతూనే ఉంటారు. అంతేకాదు, తన వ్యక్తిగత, కెరీర్‌కు సంబంధించిన విషయాలను రకరకాల పోస్టుల ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకుంటోన్నారు. తద్వారా తన క్రేజ్‌ను ఇప్పటికీ పెంచుకుంటూ దూసుకెళ్తోన్నారు.

హాట్ ట్రీట్‌లోనూ తగ్గట్లేదుగా
సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న సీనియర్ హీరోయిన్ టబు.. అప్పుడప్పుడూ హాట్ ట్రీట్ కూడా ఇస్తూ రెచ్చిపోతోన్నారు. ఇందులో భాగంగానే 50 ఏళ్ల వయసు దాటినా తన అందచందాలను చూపిస్తూ కుర్రకారును ఉర్రూతలూగిస్తోన్నారు. ఈ క్రమంలోనే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతూ రచ్చ చేస్తూనే.. టబు తెగ హైలైట్ అయిపోతోన్నారు.

షర్ట్ విప్పేసి మరీ గ్లామర్ షో
సోషల్ మీడియాలో విపరీతంగా హడావిడి చేస్తోన్న బోల్డు హీరోయిన్ టబు.. తాజాగా కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు వీటిలో ఆమె వైట్ కలర్ షర్ట్ ధరించి ఉన్నప్పటికీ.. బటన్స్ విప్పేసి క్లీవేజ్ షో చేస్తోన్నారు. దీంతో ఆమె అందాలు నెటిజన్లను రెచ్చగొడుతోన్నాయి. ఫలితంగా టబు షేర్ చేసిన ఫొటోలకు భారీ స్థాయిలో స్పందన వచ్చి.. వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











