Tamannaah: రొమాంటిక్ బోల్డ్ సీన్స్ పై ఫస్ట్ టైమ్ క్లారిటీ ఇచ్చిన తమన్నా.. అందుకే చేస్తున్నాను అంటూ..
సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న అందాల భామ తమన్నా. ఫ్యాన్స్ తో ముద్దుగా మిల్కీ బ్యూటీ అని పిలిపించుకునే తమన్నా ప్రస్తుతం సీనియర్ హీరోయిన్ కేటగిరీలోకి చేరిపోయింది. 2005 నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న అమ్మడు ఎన్నో బాక్సాఫీస్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ మధ్య ఊహించని విధంగా గ్లామర్ డోస్ పెంచింది. అంతే కాకుండా బోల్డ్ సీన్స్ లో కూడా నటిస్తోంది. ఇక ఆ విషయంలో అమ్మడు లేటెస్ట్ గా ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

రొమాంటిక్ సినిమాలలో..: తమన్నా తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా తమిళ్ ఇండస్ట్రీలో కూడా చాలామంది అగ్ర హీరోలతో సినిమాలు చేసుకుంటూ వచ్చింది. కథ నచ్చితే కొంతమంది చిన్న హీరోలతో కూడా కలిసి ఆమె రొమాంటిక్ సినిమాలలో నటించింది. ఇక ఇప్పుడు ఊహించిన విధంగా తెలుగులో భోళా శంకర్ మూవీలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా నటిస్తోంది. అలాగే జైలర్ మూవీలో నటించారు. ఈ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది.

బోల్డ్ సన్నివేశాలలో తమన్నా: అయితే సినిమాల సంఖ్య క్రమంగా తగ్గడంతో ఈ బ్యూటీ ప్రస్తుతం వెబ్ సిరీస్ ల మీద ఫోకస్ చేస్తోంది. ఇప్పటికే రెండు తమిళ్ వెబ్ సిరీస్ లలో తమన్నా నటించారు. తాజాగా హిందీలో జీ కర్దా అనే వెబ్ సిరీస్ చేశారు. ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇందులో తమన్నా బోల్డ్ సన్నివేశాలలో నటించడం విశేషం. ఎన్నడూ లేని విధంగా ఇంటిమేట్ సీన్స్ కూడా ఈ బ్యూటీ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

బోల్డ్ సన్నివేశాలు చేయొద్దు అంటూ..: ఈ వెబ్ సిరీస్ కథలో భాగంగానే ఈ ఇంటిమేట్ సన్నివేశాలు చేసిన కూడా ఫ్యాన్స్ మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి బోల్డ్ సన్నివేశాలు చేయొద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. లస్ట్ స్టోరీస్ 2లో కూడా విజయ్ వర్మతో ఆమె బోల్డ్, ఇంటిమేట్ సన్నివేశాలు చేయడం విశేషం. తాజాగా ఈ సన్నివేశాలపై తమన్నా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.

క్లారిటీ ఇచ్చిన తమన్నా: కథలో భాగంగా ఇంటిమేట్ సన్నివేశాలు ఉన్నప్పుడు కచ్చితంగా చేయాల్సిందే. అలాగే ప్రేక్షకులు కూడా చూడాల్సిందే అని చెప్పుకొచ్చింది. కథలో భాగంగా ఉండటం వలనే ఇలాంటి సన్నివేశాలు చేయాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చింది. ప్రేక్షకుల అభిరుచి మేరకు, కథల డిమాండ్ మేరకు కచ్చితంగా కొన్నిసార్లు బోల్డ్ సన్నివేశాలు చేయాల్సి వస్తుందని తమన్నా చెప్పడం విశేషం. మొత్తానికి బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన తర్వాత తమన్నా ఇన్ని రోజులు పెట్టుకున్న నో కిస్సింగ్ పాలసీని కూడా తమన్నా పక్కన పెట్టడం విశేషం. మరో వైపు తమన్నా మరో ఇంటరెస్టింగ్ కామెంట్స్ కూడా చేశారు. లస్ట్ స్టోరీస్ లో విజయ్ వర్మతో రొమాంటిక్ సన్నివేశాలు చేసినపుడు అతని మీద ప్రేమ పుట్టిందని, అతని దగ్గర చాలా కంఫర్ట్ గా అనిపించింది అని చెప్పడం ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











