సౌందర్యపై ఆమని షాకింగ్ కామెంట్స్: అతడికి భయపడే ఎక్స్‌పోజింగ్ అంటూ!

టాలీవుడ్‌లో ఎంతో మంది హీరోయిన్లు సత్తా చాటి స్టార్లుగా హవాను చూపించారు. కానీ, అందులో క్లీన్ ఇమేజ్‌తో సుదీర్ఘ కాలం పాటు ప్రభావాన్ని చూపించిన వాళ్లు తక్కువ మందే ఉన్నారు. వారిలో సౌందర్య ఒకరు. పేరుకు కన్నడ భామే అయినా తెలుగు అమ్మాయిలా కనిపిస్తూ ఇండస్ట్రీలో సత్తా చాటింది.

ఎన్నో సినిమాల్లో నటించినా గ్లామర్ రోల్స్‌కు దూరంగా ఉందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సౌందర్య అసలు ఎందుకు ఎక్స్‌పోజింగ్ చేయలేదు అన్న దానిపై సీనియర్ హీరోయిన్ ఆమని తాజాగా స్పందించారు. ఆ వివరాలను మీరే చూసేయండి మరి!

Senior Heroine Aamani Comments On Soundarya De Glamour Roles

తెలుగులో సత్తా చాటిన ఆమని: 'ఆడది' అనే సినిమాతో తెలుగులోకి హీరోయిన్‌గా వచ్చిన ఆమని.. 'జంబ లకిడి పంబ' అనే సినిమాతో భారీ స్థాయిలో పేరు సంపాదించారు. అప్పటి నుంచి వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోయారామె. ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లలోనే నటిస్తూ సత్తా చాటారు. సుదీర్ఘమైన కెరీర్‌లో జగపతిబాబు, శ్రీకాంత్, నరేష్ వంటి హీరోలతో ఎక్కువ చిత్రాల్లో కనిపించారు.

అత్యుత్తమ నటనతో అవార్డ్స్: ఆమని సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో అత్యుత్తమ పాత్రలతో మెప్పించారు. మరీ ముఖ్యంగా 'శుభలగ్నం', 'మిస్టర్ పెళ్లాం', 'శుభ సంకల్పం' వంటి చిత్రాల్లో ఉత్తమ నటిగా అవార్డులను సైతం అందుకున్నారు. ఇక, ఆ మధ్య వచ్చిన 'ఆ నలుగురు' చిత్రానికి గానూ సపోర్టింగ్ ఆర్టిస్టుగా ఎంపికయ్యారు. అంతేకాదు, ఎన్నో మంచి పాత్రలు పోషించి ప్రేక్షకులను ఫిదా చేశారు.

Senior Heroine Aamani Comments On Soundarya De Glamour Roles

సెకెండ్ ఇన్నింగ్స్‌లో బిజీగా: 2004లో వచ్చిన 'ఆ నలుగురు' తర్వాత చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమని.. 2012లో 'దేవస్థానం' అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈమె.. మంచి మంచి పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నారు. అలాగే, టీవీ షోలలో సైతం కనిపిస్తున్నారు. మొత్తంగా ఈ మధ్య కాలంలో ఆమని ఫుల్ బిజీగా గడుపుతున్నారు.

Senior Heroine Aamani Comments On Soundarya De Glamour Roles

సౌందర్యతో ఆమని స్నేహం: అప్పట్లో తెలుగులో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన వారిలో సౌందర్య ఒకరన్న విషయం తెలిసిందే. ఆమె టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతోన్న సమయంలోనే ఆమని కూడా టాలీవుడ్‌లో బిజీ అయ్యారు. అంతేకాదు, వీళ్లిద్దరూ కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. దీంతో ఈ ఇద్దరి మధ్య స్నేహం ఉండేది. ఈ కారణంగానే ఈ హీరోయిన్లు ఎప్పుడూ కలిసే కనిపిస్తూ సందడి చేస్తుండేవారు.

Senior Heroine Aamani Comments On Soundarya De Glamour Roles

ఒక ప్రాంతం కావడం వల్లే: హీరోయిన్లు సౌందర్య, ఆమని ఇద్దరూ కర్నాటకకు చెందిన వాళ్లే. అంతేకాదు, ఇద్దరూ బెంగళూరు నుంచే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అలా ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఒకే ప్రాంతానికి చెందిన వాళ్లు కావడం వల్లే ఈ ఇద్దరూ ఇగోలను పక్కన పెట్టేసి సఖ్యతగా ఉండేవాళ్లు. ఎప్పుడు కలిసినా కన్నడంలో మాట్లాడుకుంటూ, పాటలు పాడుకుంటూ సరదాగా గడిపేవారట.

Senior Heroine Aamani Comments On Soundarya De Glamour Roles

అందుకే ఎక్స్‌పోజింగ్ నో: ఆమని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సౌందర్య ఎక్స్‌పోజింగ్ గురించి మాట్లాడారు. 'తనకు ఎక్స్‌పోజింగ్ అంటే ఇష్టం ఉండదు. దీనికి కారణం పెళ్లైన తర్వాత భర్త.. సినిమాల్లో ఎందుకలా చూపించావు అని అడుగుతాడేమోనన్న భయమే. ఈ విషయాన్ని తనే నాకు చెప్పింది. ఈ విషయంలో సౌందర్యకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి' అని చెప్పుకొచ్చారామె.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X