స్టార్ డైరెక్టర్ బలవంతంగా తాగించారు.. ఇష్టం లేదన్నా అది పట్టుకోమన్నారు: ఆమని షాకింగ్ కామెంట్స్

తెలుగు సినిమా రంగంలో చాలా మంది నటీమణులు స్టార్లుగా మారి ఎంతో కాలం పాటు హవాను చూపించారు. అలాంటి వారిలో ఆమని ఒకరు. సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో ఎన్నో చిత్రాల్లో నటించిన ఈ భామ.. సౌతిండియా మొత్తంలో ప్రభావాన్ని చూపించింది. ఇక, ఇప్పుడు కూడా సెకెండ్ ఇన్నింగ్స్‌లో వరుసగా ఆఫర్లను అందుకుంటూ ముందుకు సాగుతోంది. ఇలాంటి సమయంలో తాజాగా ఆమని ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టార్ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ గురించి ఆమె ఊహించని వ్యాఖ్యలు చేశారు. అవేంటో మీరే చూసేయండి!

తెలుగులో సత్తా చాటేసి
ఆమని 'ఆడది' అనే సినిమాతో నటిగా ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలోనే 'జంబ లకిడి పంబ' అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి సత్తా చాటారు. అప్పటి నుంచి వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోయారు. ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లలోనే నటిస్తూ సత్తా చాటారు. సుదీర్ఘమైన కెరీర్‌లో జగపతిబాబు, శ్రీకాంత్, నరేష్ వంటి హీరోలతో ఎక్కువగా నటించారు.

Senior Heroine Aamani Shocking Comments On Star Director E V V Satyanarayana

ఉత్తమ నటనతో అవార్డ్స్

సుదీర్ఘమైన కెరీర్‌లో ఆమని ఎన్నో అత్యుత్తమ పాత్రలతో అలరించారు. మరీ ముఖ్యంగా 'శుభలగ్నం', 'మిస్టర్ పెళ్లాం', 'శుభ సంకల్పం' వంటి చిత్రాల్లో ఉత్తమ నటిగా అవార్డులను సైతం అందుకున్నారు. ఇక, ఆ మధ్య వచ్చిన 'ఆ నలుగురు' చిత్రానికి గానూ సపోర్టింగ్ ఆర్టిస్టుగా అవార్డ్ కొట్టేశారు. అంతేకాదు, ఎన్నో మంచి పాత్రలు పోషించి ప్రేక్షకులను మైమరపించారు.

2వ ఇన్నింగ్స్‌లో బిజీగా
'ఆ నలుగురు' తర్వాత చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమని.. 2012లో 'దేవస్థానం' అనే సినిమాతో సెకెండ్ ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టారు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడని ఈమె.. మంచి మంచి పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నారు. అలాగే, టీవీ షోలలో సైతం కనిపిస్తున్నారు. మొత్తంగా ఈ మధ్య కాలంలో ఆమని ఫుల్ బిజీగా మారిపోయారు.

అలాంటివి చేయాలని

ఆమని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 'సినిమాల్లో చాలా రకాల క్యారెక్టర్లు చేశాను. అది ఆ చిత్రానికి మాత్రమే పరిమితం అవుతుంది. దాని తర్వాత మరో క్యారెక్టర్‌లోకి వెళ్లిపోతాం. ఇప్పుడు కూడా నాకు కాస్త బోల్డుగా ఉండే పాత్రలు వస్తున్నాయి. అది నేను చిన్న పాత్రలానే చూస్తాను. అందుకే అలాంటివి చేయడానికి రెడీ అవుతున్నా' అన్నారు.

Senior Heroine Aamani Shocking Comments On Star Director E V V Satyanarayana

ఈవీవీ గారు తాగించారు
ఆమని కంటిన్యూ చేస్తూ.. 'ఇప్పుడే కాదు.. నేను మొదటి సినిమాలోనే కొన్ని సాహసాలు చేశాను. ముఖ్యంగా 'జంబలకిడి పంబ'లో షాంపైన్ బాటిల్ ఓపెన్ చేసి తాగాల్సి వచ్చింది. నాకు ఇష్టం లేదు అని చెప్పినా ఈవీవీ సత్యనారాయణ గారు ఒప్పుకోలేదు. దీంతో నేను బలవంతంగానే దాన్ని నోట్లో వేసుకున్నాను. సీన్ పూర్తైన వెంటనే ఆ షాంపైన్‌ను ఊసేశాను' అని వెల్లడించారు.

అది పట్టించారు అని

ఇదే ఇంటర్వ్యూలో ఆమని ''జంబలకిడి పంబ' సినిమాలో సిగరెట్ కూడా పట్టుకున్నాను. అది చేయడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ, ఆ పాత్ర కోసం తప్పలేదు. మూవీలో అలా కనిపిస్తే ఆ ప్రభావం మన మీద ఉంటుంది అనుకోవడం తప్పు. ఇది చాలా మంది తప్పుగా అనుకుంటున్నారు. అయినప్పటికీ నేను ఎలాంటి పాత్రనైనా చేయడానికి రెడీ అవుతాను' అని వివరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X