ఉదయ్ కిరణ్ హీరోయిన్ ఓవర్ షో: సినిమాల్లో పద్దతిగా.. ఇప్పుడేమో ఘాటుగా!
టాలీవుడ్‌లో ఇప్పటి వరకూ ఎంతో మంది హీరోయిన్లు సందడి చేశారు. కానీ, వారిలో అతి తక్కువ మంది మాత్రమే కొన్ని సినిమాలే చేసినా సెన్సేషన్ అయ్యారు. అలాంటి వారిలో అనిత ఒకరు. ఉదయ్ కిరణ్ హీరోగా చేసిన 'నువ్వు నేను' మూవీతో ఎంటరైన ఈ భామ.. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోయింది.
ఫలితంగా చాలా కాలం పాటు టాలీవుడ్‌లో హవాను చూపించింది. ఇక, ఈ మధ్య సినిమాల్లో కనిపించకున్నా సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అనిత కొన్ని బ్యూటిఫుల్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూడండి!

అలా వచ్చి.. ఫుల్ ఫేమస్: సినిమాల కంటే ముందే అనిత మోడల్‌గా యమ ఫేమస్ అయింది. ఈ క్రమంలోనే 'నువ్వు నేను' సినిమాతోనే హీరోయిన్‌గా పరిచయం అయింది. ఇది సూపర్ హిట్ అవడంతో వరుస ఆఫర్లు దక్కించుకుంది. దీని తర్వాత 'శ్రీరామ్', 'తొట్టిగ్యాంగ్', 'నిన్నే ఇష్టపడ్డాను', 'ఆడంతే అదోటైపు', 'ఆహా నాపెళ్లంట' సహా ఎన్నో చిత్రాల్లో నటించి సంచలనంగా మారింది.

చాలా చిత్రాలు చేసింది: మొదటి చిత్రంతోనే టాలీవుడ్‌లో యమ క్రేజ్ తెచ్చుకున్న అనిత.. ఆ తర్వాత ఎన్నో చిత్రాలను చేసింది. కానీ, ఇవేమీ ఆమెకు విజయాలను మాత్రం పెద్దగా అందించలేదు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమకు గ్యాప్ ఇచ్చేసింది. ఆ తర్వాత తమిళం, హిందీ, కన్నడం, పంజాబీ భాషల్లో సైతం నటించింది. కానీ, వాటిలో కూడా అనిత హీరోయిన్‌గా విజయవంతం కాలేదనే చెప్పుకోవాలి.

టీవీలోకి.. నాగిన్‌తో క్రేజ్: సినిమా కెరీర్ సాఫీగా సాగకపోవడంతో అనిత బిగ్ స్క్రీన్‌కు దూరం అయింది. అయితేనేం బుల్లితెరపైకి 'హరే కంచ్‌కి చుడియాన్' అనే సీరియల్ ద్వారా అడుగు పెట్టింది. ఇందులో సక్సెస్‌ను సొంతం చేసుకోవడంతో ఆ తర్వాత ఎన్నో సీరియళ్లలో నటించి మెప్పించింది. వాటిలో తెలుగులోనూ ప్రసారమైన 'నాగినీ' సిరీస్‌తో ఆమె దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను సొంతం చేసేసుకుంది.
ప్రేమ పెళ్లి.. ఇప్పుడిలా: సినిమాలకు గ్యాప్ ఇచ్చిన తర్వాత వరుసగా సీరియళ్లు చేస్తూ ఫామ్‌లో ఉన్నప్పుడే అనిత.. రోహిత్ రెడ్డి అనే బిజినెస్‌మ్యాన్‌తో లవ్‌లో పడింది. కొన్నేళ్ల పాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ జంట.. 2013లో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అంటే 2021లో ఓ బాబుకు కూడా జన్మనిచ్చింది. అయినప్పటికీ అనిత మాత్రం కెరీర్‌ను కంటిన్యూ చేస్తూ.. వరుసగా సీరియళ్లు చేస్తూనే ఉంది.

ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తూనే: సుదీర్ఘ కాలంగా వరుస పెట్టి సినిమాలు, సీరియళ్లు చేస్తూ సత్తా చాటుతోన్న సీనియర్ హీరోయిన్ అనిత.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ భామ తరచూ తన వ్యక్తిగత, సినీ కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయంలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. తద్వారా ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తూ ముందుకు వెళ్తోంది.

అందాల ఆరబోతతోనూ: సినిమా నటిగా అనిత పెద్దగా గ్లామర్ షో చేయడానికి ఇష్టపడలేదు. కానీ, బుల్లితెరపైకి వచ్చిన తర్వాత మాత్రం ఓ రేంజ్‌లో రెచ్చిపోతూనే ఉంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో హాట్ హాట్ ఫొటో షూట్లతో సంచలనంగా మారుతోంది. అంతేకాదు, బోల్డు వీడియోలను షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా భర్తతో రొమాన్స్ చేసిన ఫొటోలు, వీడియోలు వదులుతూ అనిత హల్చల్ చేసేస్తోంది.

గ్లామర్ పిక్స్ షేర్ చేసి: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో హద్దు మీరుతోన్న హీరోయిన్ అనిత.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె డీప్ నెక్ టాప్‌లో క్లీవేజ్ షో చేస్తూ ఫోజులు ఇచ్చింది. వీటిలో ఆమె అందాలు ఓ రేంజ్‌లో కవ్విస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. తద్వారా ఇవన్నీ బాగా వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











