Asin: హీరోయిన్ ఆసిన్ విడాకులు.. ఒకప్పటి టామ్ స్టార్ లైఫ్‌లో ఏం జరుగుతున్నదంటే?

ఒకప్పటి స్టార్ హీరోయిన్ అసిన్ అందరికీ సుపరిచితమే. ఆమెను అంత తొందరగా ఎవరూ మర్చిపోలేరు. ఒకప్పటి స్టార్ హీరోలు అందరితోనూ నటించింది. తెలుగులో దాదాపు ఆమె నటించిన సినిమాలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా అమ్మ, నాన్న, ఓ తమిళ అమ్మాయి, గజినీ వంటి సినిమాలు అయితే ఆమె కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్స్. కాగా, తన కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలోనే ఆమె నటకు వీడ్కోలు పలికింది. ఇక పెళ్లి చేసుకున్న ఆమె గతకొంత కాలంగా ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుండగా సడన్ గా విడాకులు తీసుకున్నట్లు టాక్ వచ్చింది. ఇక ఈ రూమర్స్ అమ్మడు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

విడాకులు తీసుకుంటోంది అంటూ: ఆసిన్ ఓ ప్రముఖ వ్యాపారవేత్త రాహుల్ శర్మను ప్రేమించి పెళ్లాడింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఆమె, హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తోంది. అయితే, చాలా కాలం తర్వాత ఆమె వార్తల్లోకి ఎక్కారు. అసిన్ తన భర్త నుంచి విడాకులు తీసుకుంటోంది అంటూ ప్రచారం మొదలైంది. దానికి కారణం కూడా లేకపోలేదు. సోషల్ మీడియాలో పెద్ద గా అసిన్ యాక్టివ్ గా ఉండదు.

senior heroine asin

భర్త ఫోటోలను డిలీట్ చేసింది: ఆమె తన ఫోటోలను సైతం చాలా అరుదుగా షేర్ చేస్తూ ఉంటుంది. అలాంటిది సడెన్ గా తన ఇన్ స్టాగ్రామ్ నుంచి ఫోటోలను డిలీట్ చేసింది. తన పెళ్లి ఫోటోలు, భర్త ఫోటోలను డిలీట్ చేసింది. అంతే, సడెన్ గా ఆమె భర్త ఫోటోలు తొలగించడంతో, ఆమె విడాకులు తీసుకుంటోందంటూ ప్రచారం మొదలైంది. అయితే, ఆమె ఫ్యాన్స్ మాత్రం ఈ వార్తలను తోసిపుచ్చుతున్నారు.

senior heroine asin

ఇష్టం లేదని అర్థం కాదు: అసిన్ గతంలోనూ ఇలా చేసిన సందర్భాలు ఉన్నాయని వారు వాదిస్తున్నారు. ఒకసారి అసిన్, తన తల్లిదండ్రుల వార్షికోత్సవం కి సంబంధించిన ఫోటోలను డిలీట్ చేసిందని అలా అని ఆమె తల్లిదండ్రులు అంటే ఇష్టం లేదని అర్థం కాదు కదా అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఆమె తన భర్త అన్ని ఫోటోలు తొలగించినప్పటికీ, వారి పెళ్లి రిసెప్షన్ ఫోటో మాత్రం అలానే ఉంచారు. అసిన్, రాహుల్ దంపతులకు 2017లో ఒక కుమారుడు జన్మించాడు.

senior heroine asin

క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ ఆసిన్: అయితే హఠాత్తుగా ఈ తరహా వార్తలు మరింత వైరల్ కావడంతో ఆసిన్ స్పందించక తప్పలేదు. మీడియాకు చాలా దూరంగా ఉండే ఆమె మొత్తానికి వైరల్ అవుతున్న వార్తలకు ముగింపు కార్డు పెట్టింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అన్నీ కూడా అబద్ధమే అంటూ అందులో ఎలాంటి నిజం లేదు అని ప్రస్తుతం తన భర్తతో కలిసి హాలిడేస్ లో ఎంజాయ్ చేస్తున్నాను అని ఆమె తెలియజేసింది. అంతేకాకుండా ఈ వార్త తెలియగానే షాక్ అయ్యాను అని అలాగే దీని గురించి మాట్లాడుకుంటూ ఐదు నిమిషాల్లో వృధా చేసాము.. అని ఆమె ఫేక్ వార్తలకు కౌంటర్ కూడా ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X