జిగేల్ అనేలా జెనీలియా అందాల ఆరబోత.. ఇద్దరు బిడ్డల తల్లైనా అస్సలు తగ్గట్లేదుగా!
టాలీవుడ్‌లోకి ఎంతో మంది హీరోయిన్లుగా వచ్చినా అందులో కొందరు మాత్రమే తమదైన రీతిలో ప్రభావాన్ని చూపించి స్టార్లుగా మారారు. అలాంటి వారిలో క్యూట్ లేడీ జెనీలియా ఒకరు. అందానికి అందం, నటనకు నటనతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ చిన్నది.. చాలా ఏళ్ల పాటు వరుసగా సినిమాలు చేసింది.
అయితే, వివాహం తర్వాత బాలీవుడ్‌కు మాత్రమే పరిమితం అయింది. అయినా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు ఖుషీ చేస్తోంది. ఈ క్రమంలోనే జెనీలియా తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూసేయండి మరి!

ఒకేసారి మూడు భాషల్లో: టీనేజ్‌లో ఉన్నప్పుడే జెనీలియా 'తుజే మేరీ కసమ్' అనే బాలీవుడ్ చిత్రంతో యాక్టింగ్ కెరీర్‌ను మొదలు పెట్టింది. అదే ఏడాది 'బాయ్స్' మూవీతో సౌతిండియాలోకి కూడా అడుగు పెట్టింది. ఆ వెంటనే సుమంత్ హీరోగా నటించిన 'సత్యం' మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇలా ఒకే ఏడాది మూడు సినిమాల ద్వారా మూడు భాషల్లోకి వచ్చి జెనీలియా సెన్సేషన్ అయింది.

స్టార్ హీరోయిన్‌గా హవా: టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన తర్వాత కూడా జెనీలియా వేరే భాషల్లో మూవీలు చేసింది. కానీ, తెలుగు చిత్రాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. ఇలా తెలుగులోని స్టార్ హీరోలు అందరితోనూ సినిమాలు చేసింది. తద్వారా స్టార్ హీరోయిన్‌గా మారింది. ముఖ్యంగా 'బొమ్మరిల్లు' చిత్రంలో ఆమె చేసిన యాక్టింగ్ తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పొచ్చు.

పెళ్లి తర్వాత అక్కడే: హీరోయిన్‌గా ఆశించిన రీతిలో సక్సెస్ అయిన జెనీలియా.. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను 2012లో వివాహం చేసుకుంది. అప్పటి నుంచి హీరోయిన్‌గా సినిమాలు ఆపేసింది. ఆ తర్వాత జెనీలియా ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. అయినప్పటికీ అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చింది. తద్వారా వివాహం తర్వాత కూడా కెరీర్ కంటిన్యూ చేస్తూ ఆదర్శంగా నిలిచింది.
ఇప్పుడు ఆ సినిమాలు: ఈ మధ్య కాలంలో జెనీలియా సినిమాల వేగం పెంచేసింది. ముఖ్యంగా నిర్మాతగా మారి పలు చిత్రాలను చేసింది. ఈ క్రమంలోనే భర్తతో కలిసి 'వేద్' అనే సినిమాను చేసింది. ఇది తెలుగులో వచ్చి సూపర్ హిట్ అయిన 'మజిలీ'కి రీమేక్‌గా వచ్చింది. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక, ఇప్పుడు జెనీలియా 'ట్రైల్ పిరియడ్', 'జూనియర్' మూవీలు చేస్తోంది.
అలా సందడి చేస్తోంది: కెరీర్ మొదట్లో వచ్చినట్లుగా ఈ మధ్య కాలంలో సినిమాలు చేయకున్నా.. జెనీలియా మాత్రం తన రేంజ్‌కు తగ్గ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంది. ఇలా కెరీర్ పరంగా బిజీగా ఉన్నా లేకున్నా ఆమె మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. అదే సమయంలో ఫ్యాన్స్‌తో తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను కూడా పంచుకుంటూ ముందుకు సాగుతోంది.

గ్లామర్ షోతో హడావిడి: స్టార్ హీరోయిన్ జెనీలియా సోషల్ మీడియాను అప్‌డేట్లకు మాత్రమే పరిమితం చేయడం లేదు. ఇద్దరు బిడ్డలకు తల్లైనా.. వయసుతో అస్సలు సంబంధమే లేకుండా అందాలను ఆరబోస్తుంది. ఈ మధ్య కాలంలో మరింతగా రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే క్రమం తప్పుకుండా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తూ ట్రెండ్ అవుతోంది.

జెనీలియా పిక్స్ వైరల్: సీనియర్ హీరోయిన్ జెనీలియా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె స్ట్రాప్ అండ్ స్లీవ్‌లెస్ డ్రెస్‌లో విపరీతంగా బోల్డు షో చేసింది. ఫలితంగా ఈ పిక్‌లలో ఆమె అందాలు మొత్తం చూపరులను తెగ కవ్విస్తున్నాయి. ముఖ్యంగా ఆమె క్లీవేజ్ భాగం ఓ రేంజ్‌లో హైలైట్ అవుతోంది. దీంతో ఈ పిక్స్ అన్నీ తక్కువ టైంలోనే వైరల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











