Jayalalitha: "ఎన్టీఆర్‌కు లక్ష్మీ పార్వతి ఎలాగో.. గుమ్మడి గారికి నేనలాగా"

సీనియర్ నటి జయలలిత గురించి తెలుగు సినీ ప్రియులు అందరికీ తెలిసిందే. అద్భుతమైన అందం కల్గిన ఈమె ఇప్పటికీ సినిమాలు చేస్తూ వస్తోంది. అయితే గతంలో కాస్టింగ్ కౌచ్ గురించి, తనకు సినీ రంగంలోని ప్రముఖులతో ఉన్న బంధం గురించి చెప్పి షాక్ ఇచ్చింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరోసారి ఇంటర్వ్యూలో పాల్గొని మరికొన్ని షాకింగ్ కామెంట్లు చేసింది. సీనియర్ ఎన్టీఆర్ కు లక్ష్మీ పార్వతికి ఎలాగో... గుమ్మడి వెంకటేశ్వర రావుకు తాను అలా అంటూ వివరించింది. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1968లో జన్మించిన నటి జయలలిత పద్దెనిమిదేళ్లకే సినిమాల్లోకి వచ్చింది. ప్రస్తుతం 58 ఏళ్ల వయసు కల్గిన ఈమె ఇప్పటికీ సినిమాల్లో నటిస్తోంది. హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, సీరియల్ ఆర్టిస్ట్ గా కూడా మారి తన టాలెంట్ ప్రూవ్ చేసుకుందీ ముద్దుగుమ్మ. అలాగే ఎక్కువగా శృంగార, హాస్య పాత్రలను పోషించడంతో.. ఆమెపై ఎక్కువ మంది ఆసక్తి కనబరిచేవారు. చాలా మంది ఆమె తమను చూడాలని, రాత్రిళ్లు గడపాలని కళలు కనేవారు. కొందరు అయితే బతిమాలో, బెదిరించో కూడా ఆమె తమ వశం చేసుకున్నారు.

Senior Heroine Jayalalitha Reveal her Relation With Gummadi Venkateshwar Rao Check Details

ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో నేరుగా జయలలితే ఈ విషయాలు చెప్పింది. అలాగే సీనియర్ హీరో శరత్ బాబుతో తనకు ప్రేమ గురించి కూడా వివరించింది. ఆయనను తాను పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు, పిల్లల్ని కూడా కనాలనుకున్నట్లు స్పష్టం చేసింది. కానీ సినీ పెద్దల వల్లే తమ పెళ్లి ఆగిపోయిందని.. కానీ తామిద్దరూ కలిసే ఉన్నట్లు చెప్పుకొచ్చింది. అయితే తాజాగా తనకు మరో వ్యక్తితో ఉన్న బంధం గురించి రివీల్ చేసింది నటి జయలలిత.

సీనియర్ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావుతో తనకు ఉన్న బంధంపై పూర్తిగా క్లారిటీ ఇచ్చింది. సీనియర్ ఎన్టీఆర్ కు లక్ష్మీ పార్వతి ఎలాగో.. తాను గుమ్మడి గారికి అలా అంటూ వివరించింది. వృద్ధాప్యంలో ఆరోగ్యం బాగాలేక అవస్థలు పడుతున్న ఆయన వద్దకు వెళ్లి సేవలు చేశానని చెప్పింది. అయితే పిల్లలు అందరూ ఆయనకు దూరంగా ఉండడం, నా అనే వారు లేక, పట్టించుకునే వారు లేక ఆయన అనేక సమస్యలు ఎదుర్కున్నారని తెలిపింది. ఎవరు ఏం అనుకున్నా.. తాను ఓ చిన్న పిల్లాడికి సేవ చేసినట్లుగా ఆయనకు సేవ చేశానని వెల్లడించింది.

Senior Heroine Jayalalitha Reveal her Relation With Gummadi Venkateshwar Rao Check Details

గుమ్మడితో తనకు ఎలాంటి బంధం లేదని.. కానీ ఒంటరిగా ఉన్న ఆయన తాను వెళ్లగానే చాలా సంబురపడిపోతూ మాట్లాడేవాడని జయ లలిత వివరించింది. దీనిపై చాలా మంది తప్పుగా మాట్లాడారని, కానీ తాను ఏ తప్పూ చేయలేదు అన్న విషయం తన మనసుకు తెలుసంటూ స్పష్టం చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X