Jayalalitha: "సినిమాల్లో ఛాన్సుల కోసం వాళ్ల కోరికలు తీర్చా.. ప్రేమ, ధ్వేషం రెండూ లేవు.. నీడ్ అంతే"
సీనియర్ నటి జయలలిత గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్ గా కెరియర్ ప్రారంభించిన ఈమె.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా కొనసాగుతోంది. 40 ఏళ్లుగా సినీ రంగంలోనే ఉన్న ఈమె అనేక కష్టాలు పడినట్లు తెలిపింది. ముఖ్యంగా పలువురు దర్శక, నిర్మాతలు, సినీ నటులు తనను శారీరకంగా వాడుకున్నట్లు చెప్పింది. కొంతమంది నుంచి తప్పించుకోగలిగినా మరికొంత మంది నుంచి మాత్రం తప్పించుకోలనేకపోయానంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కెరియర్ ప్రారంభంలో హీరోయిన్ గా అనేక అవకాశాలు అందిపుచ్చుకున్న జయలలిత.. అన్ని రకాల క్యారెక్టర్లలో నటించేది. ఈమె ఎక్కువగా శృంగార, హాస్య పాత్రలను పోషించడంతో.. ఆమెపై ఎక్కువ మంది ఆసక్తి కనబరిచేవారు. ముఖ్యంగా సినిమా షూటింగ్ స్పాట్లలో అంటే ప్యాకప్ అయిన తర్వాత అర్ధరాత్రి తన గదికి పురుషులు వచ్చేవారని చెప్పేది. తరచుగూ ఫోన్ లు చేస్తూ ఇబ్బంది పెట్టేవాళ్లని ఫోన్ పక్కన పెట్టేస్తే తలుపులు బాదే వాళ్లని వివరించింది.

ఇలా చాలా మంది చేయగా.. పలువురి బారి నుంచి తప్పించుకోగలిగాను కానీ.. మరికొంత మంది నుంచి మాత్రం తప్పించుకోలేకపోయానని చెప్పుకొచ్చింది. తాను తలుపులు తీయకోపోతో ఇక్కడే ఉరి వేసుకుంటామని కూడా చాలా మంది బెదిరించారని.. అలా సినిమాల్లో ఛాన్సుల కోసం కొందరి అవసరాలు తీర్చాల్సి వచ్చిందని తాజా ఇంటర్వ్యూలో నటి జయలలిత వెల్లడించారు. ఓ మలయాళ డైరెక్టర్ అయితే గదికి రాకపోతే సినిమా లోంచి తీస్తేనని చెప్పారట. తాను ఎంతకీ ఒప్పుకోకపోవడంతో ఆయన తనను సినిమా నుంచి తొలగించినట్లు వివరించింది.
ఎలాగూ సినిమాల్లోకి వచ్చాను.. నేను నాశనం అయినా నా వాళ్లు బాగుండాలనే ఉద్దేశంతోనే పలువురితో పడక పంచుకున్నట్లు తెలిపింది. వారు కూడా తనమీద ఏం ప్రేమతోనే, ధ్వేషంతోనే రాలేరని.. జస్ట్ శరీర అవసరాలు మాత్రమేనని వెల్లడించింది. ఒకసారి తప్పు చేసినప్పుడు చాలా బాధ పడ్డానని చెప్పిన జయలలిత.. ఆ తర్వాత పెద్దగా మనసుకు తీసుకోలేకపోయానని కూడా స్పష్టం చేసింది. అయినా ఒకసారి చేసిన 100 సార్లు చేసినా అంతే కదా అనే భావన వచ్చిందని పేర్కొంది.

ఇలా చాలా మంది అవసరాలు తీరుస్తూ.. తాను సినిమాల్లో కొనసాగినట్లు వివరించింది. ఇప్పటికీ అంటే 40 ఏళ్లుగా తాను సినీ రంగంలోనే కొనసాగుతున్నానని.. జయలలిత తెలిపింది. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా సీరియల్స్ కూ నటిస్తోందీ సీనియర్ హీరోయిన్.


Click it and Unblock the Notifications











