"పొట్టి బట్టలేసుకుంటే అతడొచ్చి టవల్ కప్పేవాడు.. కానీ అది కూడా తీసేయడానికి కారణం అదే"
సీనియర్ నటి జయలలిత గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్ గా కెరియర్ ప్రారంభించిన ఈమె.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా కొనసాగుతోంది. 40 ఏళ్లుగా సినీ రంగంలో ఉన్న ఈమె తాజాగా షాకింగ్ కామెంట్లు చేసింది. ముఖ్యంగా తాను పొట్టి బట్టలు వేసుకుంటే అతడు వచ్చి టవల్ కప్పేవాడని చెప్పుకొచ్చింది. కానీ తాను మాత్రం కోపప్పడి మరీ ఆ టవల్ తీసేసి.. ఇలా చేయకంటూ చెప్పేదాన్ని అని వివరించింది. అయితే అలా చేయడానికి గల కారణం ఏంటో కూడా వెల్లడించింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కెరియర్ ప్రారంభంలో హీరోయిన్ గా అనేక అవకాశాలు అందిపుచ్చుకున్న జయలలిత.. అన్ని రకాల క్యారెక్టర్లలో నటించేది. ఈమె ఎక్కువగా శృంగార, హాస్య పాత్రలను పోషించడంతో.. ఆమెపై ఎక్కువ మంది ఆసక్తి కనబరిచేవారు. ముఖ్యంగా తాను మేకప్ వేసుకుని, పొట్టి పొట్టి బట్టలు వేసుకుని కూర్చున్నప్పుడు అంతా తనను అదోలా చూసే వారని చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జయ లలిత అనేక విషయాలను వివరించింది.

ముఖ్యంగా తాను సినిమాల్లోని వేషాల కోసం చిన్న చిన్న బట్టలు వేసుకున్నప్పుడు... మేకప్ మాన్ లు వచ్చి ఒళ్లంతా పెయింట్ వేసే వాళ్లని వివరించింది. ఎక్కడైనా నల్లగా ఉంటే అక్కడ మరింతగా మేకప్ వేసేవారని.. ఆ తర్వాత తన అసిస్టెంట్ వచ్చి తనపై టవల్ కప్పేవాడని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా చిట్టి చిట్టి డ్రెస్ లు వేసుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు వచ్చి టవల్ కప్పేవాడని.. కానీ తాను మాత్రం చీ తీసెయ్ అంటూ తీసి పడేసేదాన్ని అని వివరించింది. అయితే తాను అలా చేయడానికి కూడా ఓ కారణం ఉందని వివరించింది.
తాను అలా కప్పుకుని ఉంటే.. లోపల ఏముందో అని అంతా ఆసక్తిగా చూసే వారని జయలలిత చెప్పుకొచ్చింది. ఒక్కసారి తీసేస్తే చూసేసి ఊరుకునే వారని లేదంటే షూటింగ్ జరిగేటప్పుడు చూసి మరింత ఇబ్బంది పడేలా చేసేవారని వివరించింది. అందుకే తాను మేకప్ వేసుకున్నప్పటి నుంచి షూటింగ్ అయిపోయే వరకు ఎలా ఉంటే అలాగే తిరిగేదాన్నని క్లారిటీ ఇచ్చింది. అంతే కాకుండా సినిమా అవకాశాల కోసం చాలా మంది కోరికలు తీర్చాల్సి వచ్చిందని కూడా గతంలోనే వివరించింది.
ఇలా చాలా మంది అవసరాలు తీరుస్తూ.. తాను సినిమాల్లో కొనసాగినట్లు మీడియా ముఖంగానే వివరించింది. తన జీవితం తెరిచిన పుస్తకం అని.. అందుకే తాను అన్ని విషయాలు ఇలా క్లియర్ గా చెప్పేస్తానంటూ కూడా స్పష్టం చేసింది. గత 40 ఏళ్లుగా తాను సినీ రంగంలోనే కొనసాగుతూ వస్తున్నానని.. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా సీరియల్స్ కూ నటిస్తోందీ సీనియర్ హీరోయిన్.


Click it and Unblock the Notifications











