కూతుర్ని వదలిపెట్టని కామాంధుడు.. స్టార్ హీరోయిన్ తండ్రి వేధింపుల కన్నీటి గాథ

మానవ సంబంధాలు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి. ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా తిరిగిన నాడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు అని జాతిపిత మహాత్మా గాంధీ చెప్పారు. కానీ బాపూజీ చెప్పినట్లు అర్ధరాత్రి కాదు కదా.. పట్టపగలు కూడా అమ్మాయిలు తిరగలేని పరిస్ధితి. ఆడపిల్లను కింద నుంచి పై దాకా చూపులతోనే చంపేసేవాళ్లు అడుగడుగునా ఉన్నారు. వీధిలో , ఆఫీసులో, బడిలో, గుడిలో చివరికి ఇంట్లో కూడా మగువకు రక్షణ లేదు.

అన్నా తమ్ముడు, మేనమామ, పెదనాన్న, బాబాయ్, మిత్రుడు, శత్రువు చివరికి కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రి కూడా ఆడపిల్లపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అంతా ఇలాంటి కామాంధుల కబంధ హస్తాలకి చిక్కి బలైపోతున్నారు. కుటుంబ పరువు పోతుందనే భయంతో చాలా మంది బాధను పంటి బిగువున భరిస్తున్నారు.

Senior heroine kushboo sundar says her father sexually abused her when she was eight

ఇకపోతే .. ఒకప్పుపడు తన అందచందాలతో ఒక తరం యువతకు నిద్రలేని రాత్రులను మిగిల్చారు ఖుష్బూ. బాటనటిగా ఎంట్రీ ఇచ్చిన ఆమె విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన కలియుగ పాండవులులో హీరోయిన్‌గా తెలుగు వారిని పలకరించారు. ఆ వెంటనే కిరాయి దాదా, కెప్టెన్ నాగార్జున, త్రిమూర్తులు, చిన్నోడు పెద్దోడు, గురుశిష్యులు, అలజడి, శాంతి క్రాంతి, పేకాట పాపారావు వంటి చిత్రాలతో అగ్ర కథానాయికగా మారారు. ఇక తమిళంలో ఎంట్రీ ఇచ్చిన ఖుష్భూ ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. సహజంగా ముద్దుగా బొద్దుగా ఉండే తారలను ఇష్టపడే తమిళ తంబీలు ఖుష్భూ అందానికి ఫిదా అయిపోయారు. అది ఎంతలా అంటే ఏకంగా గుడి కట్టేంత.

ఒక దశాబ్ధం పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమను ఏలిక ఖుష్బూ అవకాశాలు తగ్గుతున్న దశలో దర్శకుడు సి.సుందర్‌ను పెళ్లాడారు. ఆ తర్వాత తన స్టార్‌డమ్, వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. బుల్లితెరపై ఎన్నో సీరియల్స్‌లో నటించడంతో పాటు పలు షోలకు జడ్జిగానూ వ్యవహరించారు. తెలుగులో పాపులర్ షో ఎక్స్‌ట్రా జబర్దస్త్‌కు జడ్జిగా నవ్వించారు. రాజకీయాలపై తొలి నుంచి ఆసక్తిగా ఉండే ఖుష్బూ.. తొలుత డీఎంకేలో ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీలోనూ చేరారు. 2019 ఎన్నికల అనంతరం ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి బరిలో దిగి దాదాపు 32 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

Senior heroine kushboo sundar says her father sexually abused her when she was eight

ఇటీవలికాలంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న ఖుష్బూ తాను చిన్నప్పుడు ఎదుర్కొన్న కష్టాలు, సినీ ప్రయాణం, పెళ్లి, రాజకీయ ప్రస్థానంపై పలు కీలక విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ.. తన కన్న తండ్రే తనను లైంగికంగా వేధించేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. 8 ఏళ్ల వయసు నుంచే తన తండ్రి లైంగికంగా వేధించేవాడని.. మొదట్లో ఈ విషయాన్ని చెబితే మా అమ్మ నమ్మదేమోనని భయపడ్డానని ఖుష్బూ తెలిపారు.

ఎందుకంటే ఆమె భర్తే దేవుడనే మైండ్‌సెట్‌తోనే ఉండేదని, అందుకే ఎవరికీ చెప్పుకోలేక మనసులోనే దాచుకున్నానని గుర్తుచేసుకున్నారు. తనకు 15 ఏళ్ల వయసు వచ్చే సరికి ఆయనకు ఎదురు తిరగడంతో భయపడి మమ్మల్ని వదిలేసి పారిపోయాడని ఖుష్భూ చెప్పారు. నాటి నుంచి పరిస్ధితులకు ఎదురు నిలబడి పోరాడటం ప్రారంభించానని చెప్పారు. ఏది ఏమైనా చిన్నతనంలో అబ్బాయి, అమ్మాయి .. ఎవరైనా లైంగిక వేధింపులకు పాల్పడితే అది వారిని జీవితాంతం వెంటాడుతూనే ఉంటుందని ఖుష్బూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: kushboo sundar sunder c tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X