Meena: ఆ హీరో నన్ను అలా చేయాలని బలవంతం చేశాడు.. మీనా సంచలన వ్యాఖ్యలు
అలనాటి హీరోయిన్ మీనా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. హీరోయిన్ కంటే ముందే బాలనటిగా సినిమాలు చేసింది. ఇక స్టార్ హీరోల సినిమాల్లో నటించిన మీనా.. ఇటీవల ఓ తమిళ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయటపెట్టింది. తనను హీరో ఓ విషయంలో బలవంతం చేశాడు అంటూ చెప్పుకువచ్చింది. అప్పుడు చాలా బాధపడినట్లు చెప్పుకువచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే...
స్టార్ హీరోయిన్ గా రాణించిన వారిలో మీనా ఒకరు. ఈ భామ తెలుగు, తమిళ్, హిందీ చిత్రాల్లో నటించి మెప్పించింది. హీరోయిన్ కాకముందే బాలనటిగా ఎన్నో చిత్రాల్లో నటించింది. సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి హీరోల సినిమాల్లో బాలనటిగా నటించిన మీనా... ఆ తర్వాత తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చి తనదైన శైలీలో గుర్తింపు తెచ్చుకుంది.

లుగులో చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జునలతో కలిసి నటించిన మీనా.. సుమారు ఒక దశాబ్దం పాటు స్టార్ హీరోయిన్ గా వెలిగింది. ఇక పెళ్లి తర్వాత మీనా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అయితే ఇటీవల వెంకటేష్ తో కలిసి మీనా దృశ్యం సిరీస్ చేసిన సంగతి తెలిసిందే. దృశ్యం 1, దృశ్యం 2 సినిమాలతో మీనాకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. పలు టీవీ షోల్లో అప్పుడప్పుడు కనిపిస్తూ సందడి చేస్తుంది.
ఇదిలా ఉంటే తాజాగా మీనా బోల్డ్ పాత్రల్లో నటించడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె బోల్డ్ సీన్స్ లో నటించింది చాలా తక్కువే అని తెలిసిందే. అయితే తనకు బోల్డ్ పాత్రల్లో నటించడం, బికినీ లేదా స్విమ్ సూట్ లు ధరించి నటించడం ఇష్టముండదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకువచ్చింది కానీ ఆ విషయంలో ఓ హీరో కమ్ దర్శకుడు ఇబ్బంది పెట్టాడట. వేసుకోవాల్సిందే అని బలవంతం చేసినట్లు బయటపెట్టింది.
చివరకు ఆ హీరో వల్ల స్విమ్ సూట్ లో నటించాల్సి వచ్చిందని ఇటీవల ఇంటర్వ్యూలో మీనా ఈ విషయాన్ని బయటపెట్టింది. ఆయన ఎవరో కాదు.. ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు అయిన ప్రభుదేవా. తను ఓ సినిమా కోసం మీనాను స్విమ్ సూట్ వేసుకోవాలని బలవంతం చేశారట. ఓ తమిళ్ మీడియాలో మీనా మాట్లాడుతూ.. ప్రభుదేవా సినిమా కోసం బోల్డ్ గా నటింటాల్సి వచ్చిందని చెప్పుకువచ్చింది.

తాను సిగ్గుతో మేకప్ రూమ్ వదిలి రాలేక పోయానని తెలిపింది. ఇప్పుడు బోల్డ్ పాత్రల్లో నటిస్తున్న హీరోయిన్స్ కు దండం పెట్టాలని చెప్పుకువచ్చింది. ఎలా చేస్తున్నారో ఏంటో.. ఏదేమైనా బోల్డ్ పాత్రల్లో నటించడం నిజంగా చాలా కష్టమైన పని అంటూ సంచలనవ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం మీనా చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.


Click it and Unblock the Notifications











