Meena: నాకు అలా ఉండాలని ఉంది.. 47 ఏళ్ల వయసులో రెండో పెళ్లిపై మీనా షాకింగ్ కామెంట్స్​!

హీరోయిన్ మీనా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అలనాటి స్టార్ హీరోల సరసన నటించి ఎంతో మంది అభిమానుల హృదయాలను కొల్లగొట్టింది. ఇక దృశ్యం సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మీనా.. తెలుగు, తమిళ్ సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. ఇటీవల మీనా భర్త చనిపోయారనే విషయం తెలిసిందే. ఇక ఆమె త్వరలో రెండో పెళ్లి చేసుకుంటుందనే వార్తలు జోరుగా వచ్చాయి. దీనిపై మీనా క్లారిటీ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే...

ఇటీవల కాలంలో సీనియర్ హీరోయిన్ మీనా 47ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంటుందని జోరుగా వార్తలు వస్తున్నాయి. తన భర్త చనిపోయిన తర్వాత మీనా రెండో పెళ్లి చేసుకోబుతుందంటూ ప్రచారం జరుగుతుంది. ఇక వీటిపై మీనా క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Senior Heroine Meena Shocking Comments on Her Second Marriage Full Details Here

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరోయిన్ మీనా తన గురించి ఆసక్తికరవ్యాఖ్యలు చేసింది. తన భర్త ఎలా చనిపోయాడో వివరించింది. లాంగ్స్ దొరికినా... ఆయనకు మ్యాచ్ అవ్వలేదని పేర్కొన్నారు. ఇక తన రెండో పెళ్లి గురించి కూడా క్లారిటీ ఇచ్చింది. ఇటీవల కాలంలో మీనా రెండో మ్యారేజ్ అంటూ వస్తున్న వార్తలపై మీ స్పందన ఏంటి అని యాంకర్ ప్రశ్నించగా.. ఇండస్ట్రీలో ఎంతో మంది సింగిల్స్ ఉన్నారు. హీరోలు కూడా సింగిల్ గా ఉన్నారు. నేను ఈ వార్తలపై చాలా అప్సెట్ అయ్యానంటూ చెప్పుకువచ్చింది.

అసలు లేని పోనీ విషయాలు ఎందుకు రాస్తున్నారు.. ఓ మాట అడగవచ్చు కదా అంటూ సీరియస్ అయింది. నా లైఫ్ గురించి, నా సినిమాల గురించి అందరికీ తెలుసు.. మరి అనవసర విషయాలు ఎందుకు రాస్తున్నారు. ఆ వార్తల వల్ల నా ఫ్యామిలీ అప్సెట్ అవుతున్నారు. ఒక సెన్సేషన్ కోసం ఏదో ఒకటి రాసేస్తున్నారు. 2 నెలల క్రితం నేను రెండో పెళ్లి చేసుకున్నా అంటూ రాసుకువచ్చారు. నిజం తెలుసుకుని రాయండి అంటూ క్లాస్ ఇచ్చింది మీనా.

Senior Heroine Meena Shocking Comments on Her Second Marriage Full Details Here

నన్ను ఎవరూ ఇంటర్వ్యూ అడిగిన ఇస్తున్నాను... మరి నన్ను అడిగి రాయొచ్చు కదా.. నేను ఏ భాషలోనైనా అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను. పెద్ద డైరెక్టర్ నుంచి ప్రోడక్షన్ బాయ్ వరకు అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను. అంతే కానీ మీకు మీరే ఊహించుకుని ఇష్టం వచ్చినట్లు ఎందుకు రాస్తారు. ఇది సరికాదు.. దీని వల్ల నా పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇలాంటి వార్తలు రాసే మీడియా మీద నేను చాలా కోపంగా ఉన్నాను అంటూ చెప్పుకువచ్చింది.

ఇక రెండో పెళ్లి గురించి మాట్లాడుతూ... చాలా మంది ఒంటరిగా ఉండిపోతున్నారు. నాక్కూడా అలాగే ఉండాలని ఉంది. సింగిల్ గానే ఉంటాను. నాకు అలాంటి ఆలోచనలేదు. నాకు రెండో పెళ్లి ఆలోచన అస్సలు లేదు. ఇకపై అలాంటి వార్తలు రాయకండి అంటూ చెప్పుకువచ్చింది. ఇక తన కూతురు త్వరలో వెండితెరపై కూడా పరిచయం కావొచ్చు అంటూ వివరించింది. ప్రస్తుతం మీనా చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక మీనా పలు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. తనకు నచ్చిన క్యారెక్టర్స్ వస్తే చేస్తాను అంటూ చెప్పుకుచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X