మీరా జాస్మిన్ అందాల జాతర.. ఏజ్‌తో సంబంధం లేకుండా ఘాటుగా!
తెలుగు సినిమా రంగంలో ఎంతో మంది హీరోయిన్లు తమదైన రీతిలో సందడి చేసి స్టార్లుగా హవాను చూపించారు. అలాంటి వారిలో క్యూట్ లేడీ మీరా జాస్మిన్ ఒకరు. అందానికి అందం, నటనకు నటనతో మాయ చేసిన ఈ అమ్మడు.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది. అప్పటి నుంచి చాలా కాలం పాటు హవాను చూపించింది. ఇక, ఈ మధ్య కాలంలో కూడా వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. ఇక, సోషల్ మీడియాలోనూ మీరా జాస్మిన్ హల్చల్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె కొన్ని ఫొటోలను వదిలింది. అవి మీరే చూసేయండి!
కేరళ నుంచి తెలుగులోకి
కేరళకు చెందిన మీరా జాస్మిన్ టీనేజ్‌లో ఉన్నప్పుడే 'సూత్రధారన్' అనే సినిమాతో హీరోయిన్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత అదే భాషలో చాలా సినిమాలను చేసింది. ఈ క్రమంలోనే 'రన్' అనే మూవీతో కోలీవుడ్‌లోకి, 'మౌర్య' అనే చిత్రంతో కన్నడంలోకి కూడా ఎంటర్ అయింది. ఆ తర్వాతనే 'అమ్మాయి బాగుంది' మూవీతో తెలుగులోకి వచ్చింది.

వరుస ఆఫర్లతో హవానే
చాలా భాషల కంటే తెలుగులో మంచి గుర్తింపును అందుకున్న మీరా జాస్మిన్.. పవన్‌తో 'గుడుంబా శంకర్', రవితేజతో 'భద్ర', బాలయ్యతో 'మహారధి' సహా ఎన్నో భారీ సినిమాల్లోనే నటించింది. అయితే, ఇందులో పెద్దగా విజయాలు మాత్రం లభించలేదు. దీంతో 2013లో వచ్చిన 'మోక్ష' మూవీ తర్వాత మీరా జాస్మిన్ తెలుగు చిత్ర పరిశ్రమకు విరామం తీసుకుంది.

రెండు సార్లూ విడాకులు
దక్షిణాది మొత్తంలో వరుస చిత్రాలతో హవాను చూపించిన మీరా జాస్మిన్.. ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది. కానీ, ఆ బంధం ఎంత కాలం నిలవలేదు. ఫలితంగా ఆమె భర్తకు విడాకులు ఇచ్చేసింది. అయితే, 2014 మీరా దుబాయ్‌కు చెందిన ఓ బిజినెస్‌మ్యాన్‌ను మరో వివాహం చేసుకుంది. ఇప్పుడు అతడితోనూ మీరా జాస్మిన్ విడిపోయినట్లు ప్రచారం జరుగుతూనే ఉంది.

రీఎంట్రీ.. అలాంటి రోల్స్
సినిమాల్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ సందడి చేస్తోన్న మీరా జాస్మిన్.. 2018 తర్వాత చాలా కాలం పాటు వెండితెరకు దూరంగా ఉండిపోయింది. అయితే, ఇప్పుడు మాత్రం ఆమెకు మంచి సపోర్టింగ్ రోల్స్ ఆఫర్లు వస్తున్నాయి. ఇలా గత ఏడాది మలయాళంలో 'మక్కల్' అనే సినిమాలో నటించింది. ఇటీవలే 'విమానం' మూవీతో వచ్చి ఆకట్టుకుంది.
అందులో యమా బిజీగా
హీరోయిన్‌గా పరిచయం అయినప్పటి నుంచి అదిరిపోయే నటనతో ఆకట్టుకుంటూ వచ్చిన మీరా జాస్మిన్.. ఇప్పుడు కూడా వరుసగా ఆఫర్లను అందుకుంటోంది. అయినా.. సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు విపరీతంగా సందడి చేస్తూనే ఉంది. ఇందులో ఆమె తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను పంచుకుంటూ అభిమానులను అలరిస్తోంది.

ఏజ్‌తో సంబంధం లేదు
మీరా జాస్మిన్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తనదైన రీతిలో అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు వదులుతూ ట్రెండింగ్‌లో ఉంటోంది. అంతేకాదు, ఎక్కువగా లోపలి అందాలను చూపించే వాటినే షేర్ చేసుకుంటోంది. దీంతో మీరా జాస్మిన్ తరచూ హాట్ టాపిక్ అయ్యేలా సెన్సేషన్ అవుతోంది.

మీరా హాట్ పిక్స్ వైరల్
సినిమాల్లో చాలా పద్దతిగా కనిపించే రోల్స్ చేసిన మీరా జాస్మిన్.. సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిలో ఆమె డీప్ నెక్ టాప్ ధరించి విపరీతంగా అందాల ప్రదర్శన చేస్తోంది. దీంతో మీరా పరువాలు బాగా హైలైట్ అవుతున్నాయి. ఫలితంగా ఈ పిక్స్ అన్నీ ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











