శృతి మించిన మీరా జాస్మిన్ షో.. ఈ వయసులో ఇలా రెచ్చిపోయిందేంటి!
రెండు దశాబ్దాల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు టాప్ రేంజ్‌కు ఎదిగిపోయి ప్రభావాన్ని చూపించారు. తద్వారా చాలా కాలం పాటు హవాను ప్రదర్శించారు. అలాంటి వారిలో క్యూట్ లేడీ మీరా జాస్మిన్ ఒకరు.
అందానికి అందం, నటనకు నటనతో చాలా తక్కువ సమయంలోనే ఫేమస్ అయిన ఈ భామ.. తెలుగులోనే కాకుండా ఎన్నో భాషల్లో స్టార్‌గా సత్తా చాటింది. ఇక, ఇప్పుడు కూడా వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో మీరా జాస్మిన్ రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని ఫొటోలు వదిలింది. అవి మీకోసమే!

మలయాళం నుంచి తెలుగులో: మలయాళ భామ మీరా జాస్మిన్ చిన్న వయసులోనే 'సూత్రధారన్' అనే సినిమాతో హీరోయిన్‌గా ప్రయాణం మొదలు పెట్టింది. ఆ తర్వాత అదే భాషలో చాలా సినిమాలనే చేసింది. ఈ క్రమంలోనే 'రన్' అనే మూవీతో కోలీవుడ్‌లోకి, 'మౌర్య' అనే చిత్రంతో కన్నడంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాతనే 'అమ్మాయి బాగుంది' మూవీతో తెలుగులోకి ఎంటరైంది.

యమా పాపులర్.. భారీ ఆఫర్లు: మిగిలిన భాషల కంటే తెలుగులో మంచి గుర్తింపును తెచ్చుకున్న మీరా జాస్మిన్.. పవన్‌తో 'గుడుంబా శంకర్', రవితేజతో 'భద్ర', బాలయ్యతో 'మహారధి' సహా ఎన్నో భారీ సినిమాల్లోనే నటించింది. అయితే, ఇందులో పెద్దగా విజయాలు మాత్రం ఆమెకు దక్కలేదు. దీంతో 2013లో వచ్చిన 'మోక్ష' మూవీ తర్వాత మీరా జాస్మిన్ తెలుగు చిత్ర పరిశ్రమకు గ్యాప్ ఇచ్చేసింది.

రెండు సార్లూ విడాకులతోనే: సౌత్ ఇండియా మొత్తంలో వరుస చిత్రాలతో హవాను చూపించిన మీరా జాస్మిన్.. ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది. కానీ, ఆ బంధం ఎంత కాలం నిలవలేదు. ఫలితంగా ఆమె భర్తకు విడాకులు ఇచ్చేసింది. అయితే, 2014 మీరా దుబాయ్‌కు చెందిన ఓ బిజినెస్‌మ్యాన్‌ను మరో వివాహం చేసుకుంది. ఇప్పుడు అతడితోనూ మీరా జాస్మిన్ దూరం అయినట్లు తెలుస్తోంది.

రీఎంట్రీ.. అలాంటి రోల్స్‌లో: హీరోయిన్‌గా ప్రయాణం మొదలెట్టినప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన మీరా జాస్మిన్.. 2018 తర్వాత చాలా కాలం పాటు వెండితెరకు దూరంగా ఉండిపోయింది. అయితే, ఇప్పుడు మాత్రం ఆమెకు మంచి సపోర్టింగ్ రోల్స్ ఆఫర్లు వస్తున్నాయి. ఇలా గత ఏడాది మలయాళంలో 'మక్కల్' అనే సినిమాలో నటించింది. ఇటీవలే 'విమానం' మూవీతో వచ్చి అలరించింది.
అందులో యమా బిజీగానే: సినిమాల్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి అదిరిపోయే నటనతో ఆకట్టుకుంటూ వచ్చిన మీరా జాస్మిన్.. ఇప్పుడు కూడా వరుసగా ఆఫర్లను అందుకుంటోంది. అయినా.. సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు విపరీతంగా సందడి చేస్తూనే ఉంది. ఇందులో ఆమె తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను పంచుకుంటూ అభిమానులను ఖుషీ చేసేస్తోంది.

ఏజ్ పక్కనెట్టి గ్లామర్ ట్రీట్: ఈ మధ్య కాలంలో మీరా జాస్మిన్ సోషల్ మీడియాలో తనదైన రీతిలో గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు వదులుతూ ట్రెండింగ్‌లో ఉంటోంది. అంతేకాదు, ఎక్కువగా లోపలి అందాలను చూపించే వాటినే షేర్ చేసుకుంటోంది. దీంతో మీరా జాస్మిన్ తరచూ హాట్ టాపిక్ అయ్యేలా ట్రెండింగ్‌లో నిలుస్తోంది.

మీరా బోల్డ్ ఫొటోలు వైరల్: సినిమాల్లో ఎంతో డీసెంట్‌గా కనిపించే రోల్స్ చేసిన మీరా జాస్మిన్.. సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిలో ఆమె షార్ట్ గౌన్ ధరించి విపరీతంగా అందాల ప్రదర్శన చేస్తోంది. దీంతో మీరా పరువాలు కుర్రకారును యమ రెచ్చగొడుతోన్నాయి. ఫలితంగా ఈ పిక్స్ అన్నీ విపరీతంగా వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











