మీరా జాస్మిన్ వయ్యారాల జాతర: ఈ వయసులో కూడా కుర్రకారు బేజార్ అయ్యేలా!
టాలీవుడ్‌లోకి దశాబ్ద కాలం క్రితం ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా సందడి చేశారు. కానీ, అందులో అతి తక్కువ మందే అందరి దృష్టిలో పడి హైలైట్ అయ్యారు. అలాంటి వారిలో మల్లూ బ్యూటీ మీరా జాస్మిన్ ఒకరు. మామూలుగానే సినిమాల్లోకి ఎంటరైన ఈ భామ.. అనతి కాలంలోనే సౌతిండియాలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అడపాదడపా సినిమాలు చేస్తూనే వస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ మీరా జాస్మిన్ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. అవి మీకోసమే!
అలా ఎంట్రీ.. తెలుగులోనూ:కేరళ రాష్ట్రానికి చెందిన మీరా జాస్మిన్ టీనేజ్‌లోనే 'సూత్రధారన్' అనే సినిమాతో హీరోయిన్‌గా కెరీర్ మొదలు పెట్టింది. ఆ తర్వాత అదే భాషలో చాలా సినిమాల్లో నటించింది. ఈ క్రమంలోనే 'రన్' అనే మూవీతో తమిళంలోకి, 'మౌర్య' అనే చిత్రంతో కన్నడంలోకి కూడా ఎంట్రీ ఇచ్చేసింది. అదే సమయంలో 'అమ్మాయి బాగుంది' మూవీతో తెలుగులో సైతం పరిచయమైంది.

ఆఫర్లు ఫుల్.. స్టార్‌తోనే జోడీ:సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో సందడి చేసిన మీరా జాస్మిన్‌కు తెలుగులో భారీ ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే పవన్‌తో 'గుడుంబా శంకర్', రవితేజతో 'భద్ర', బాలయ్యతో 'మహారధి' సహా ఎన్నో సినిమాలు చేసింది. అయితే, ఇందులో కొన్ని మాత్రమే సక్సెస్ అయ్యాయి. దీంతో 2013లో వచ్చిన 'మోక్ష' మూవీ తర్వాత మీరా టాలీవుడ్‌కు బ్రేక్ ఇచ్చేసింది.
పెళ్లి విషయంలో ఫెయిల్:దాదాపు రెండు దశాబ్దాల నుంచి మీరా జాస్మిన్ సౌత్ ఇండియా మొత్తంలో హవాను చూపించి సత్తా చాటింది. అయితే, పర్సనల్ లైఫ్ విషయంలో మాత్రం ఫెయిల్ అయిందనే చెప్పాలి. దీనికి కారణం పెళ్లి విషయంలో ఆమెకు బ్రేకప్ అయిపోయింది. ఇక, 2014 మీరా దుబాయ్‌కు చెందిన ఓ బిజినెస్‌మ్యాన్‌ను మీరా వివాహం చేసుకుంది. ఇప్పుడు అతడితోనూ కలిసి ఉండట్లేదని టాక్.

మళ్లీ తెలుగులో.. ఫుల్ బిజీ:హీరోయిన్‌గా పరిచయం అయినప్పటి నుంచి గ్యాప్ లేకుండా సినిమాలు చేసిన మీరా జాస్మిన్ 2018 తర్వాత మేకప్ వేసుకోలేదు. అయితే, ఏజ్ పెరుగుతోన్నా ఆమెకు మాత్రం ఇప్పటికీ ఆఫర్లు దక్కుతూనే ఉన్నాయి. ఇలా గత ఏడాది మలయాళంలో 'మక్కల్' అనే సినిమాలో నటించింది. ఇటీవలే 'విమానం' మూవీతో వచ్చింది. ఇలా మరికొన్నింటిలో నటిస్తూ బిజీగా మారింది.

అక్కడ మాత్రం యాక్టివ్‌గా:ఆకట్టుకునే అందంతో పాటు అదిరిపోయే నటనతో బెస్ట్ హీరోయిన్ అనిపించుకున్న మీరా జాస్మిన్ చాలా కాలంగా పెద్దగా ఆఫర్లను దక్కించుకోవడం లేదు. అయినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు విపరీతంగా సందడి చేస్తూనే ఉంది. ఇందులో ఆమె తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను పంచుకుంటూ వాళ్లను ఖుషీ చేసేస్తోంది.

ఈ ఏజ్‌లోనూ తగ్గట్లేదుగా:ఈ మధ్య కాలంలోనే మీరా జాస్మిన్ సోషల్ మీడియాలో తనదైన రీతిలో హై రేంజ్‌లో అలరిస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు వదులుతూ ట్రెండింగ్‌లో ఉంటోంది. అంతేకాదు, ఎక్కువగా ఎద అందాలను చూపించే వాటినే షేర్ చేస్తోంది. దీంతో మీరా ఫొటోలు, వీడియోలకు భారీ స్పందన దక్కుతోంది. ఫలితంగా ఆమె యమ ట్రెండ్ అవుతోంది.

మీరా బోల్డ్ ఫొటోలు వైరల్:హీరోయిన్‌గా ఎంతో డీసెంట్‌గా కనిపించే పాత్రలను మాత్రమే చేసిన మీరా జాస్మిన్.. సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిలో ఆమె క్యాజువల్ టాప్‌లోనే అందాలను ఆరబోసింది. దీంతో మీరా ఫోటోలు కుర్రకారును రెచ్చగొట్టేలా ఉన్నాయి. ఫలితంగా ఈ పిక్స్ బాగా వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











