twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చెడు అలవాట్లతో కెరీర్ నాశనం.. మెగాస్టార్‌తో నటించిన ఆ హీరోయిన్ ఇప్పుడెలా ఉందంటే

    |

    సినిమా ఇండస్ట్రీలో ఒక ఏడాది గడవగానే ఎంతో మంది హీరోయిన్స్ వస్తుంటారు పోతుంటారు. అయితే కెరీర్ లో పెద్దగా సక్సెస్ చూడని వాళ్ళు కూడా ఏదో ఒక రకంగా ఆడియెన్స్ కి దర్శనమిస్తునే ఉంటారు. సోషల్ మీడియా కూడా అందుకు బాగా ఉపయోగపడింది. అయితే ఒక హీరోయిన్ మాత్రం ఊహించని విధంగా కనిపించకుండా పోయింది. మెగాస్టార్ లాంటి స్టార్ హీరోతో కూడా నటించిన ఆ బ్యూటీ అనుకోని కారణాల వల్ల ఇండస్ట్రీకి దురమయ్యిందట.

    తెలుగు హీరోయిన్ అనుకుంటారు

    తెలుగు హీరోయిన్ అనుకుంటారు

    ఇక బ్యూటీఫుల్ హీరోయిన్ మరెవరో కాదు. బెంగాలీ బ్యూటీ రచన బెనర్జీ. ఈ హీరోయిన్ ని చూస్తే ఎవరైనా సరే చాలా ఈజీగా గుర్తు పట్టేస్తారు. ఆమెను ఇప్పటికి కూడా చాలా మంది తెలుగు హీరోయిన్ అనే అంటున్నారు. కానీ ఆమె తెలుగమ్మాయి కాదు. బెంగాలీ భామ. తెలుగు సినిమాలో న్యాచురల్ లుక్స్ తోనే జనాలకు అమితంగా దగ్గరైంది.

    మెగాస్టార్ తో కూడా నటించింది

    మెగాస్టార్ తో కూడా నటించింది

    ఈవీవీ. సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన నేను ప్రేమిస్తున్నాను సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రచన ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవితో బావగారు బాగున్నారా? సినిమాలో కూడా నటించింది. ఇక ఆ సినిమా మంచి గుర్తింపు తేవడంతో అన్ని రకాల కమర్షియల్ సినిమాలు

    చిన్న రోల్ పెద్ద రోల్ అని తేడా లేకుండా నటిగా ఒక మంచి క్రేజ్ అందుకుంది.

    ఆమె చివరి తెలుగు సినిమా అదే

    ఆమె చివరి తెలుగు సినిమా అదే

    రాయుడు, కన్యాదానం, సుల్తాన్, మావిడాకులు, పిల్ల నచ్చింది, నీతోనే ఉంటాను.. అలాగే లాహిరి లాహిరి వంటి సినిమాల్లో నటించింది. 2002 తరువాత ఈ బ్యూటీ మళ్ళీ తెలుగు తెరపై కనిపించలేదు. తెలుగులోనే కాకుండా బెంగాలీ, ఒడియా, తమిళ్, హిందీ భాషల్లో కూడా నటించింది. దాదాపు రెండు వందలకు పైగా సినిమాల్లో నటించిన రచన తెలుగు తెరకు దూరమవ్వడానికి ఒక కారణం ఉందట.

    చెడు అలవాట్లతో సినిమాలకు దూరంగా

    చెడు అలవాట్లతో సినిమాలకు దూరంగా

    కెరీర్ లో బిజీగా ఉన్న సమయంలో అనుకోకుండా తాగుడికి బానిసైనట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన రచన సినిమాలపై పెద్దగా దృష్టి పెట్టలేకపోయినట్లు చెప్పింది. అంతే కాకుండా సిగరేట్స్ కూడా బాగా అలవాటు అయ్యాయట. దీంతో కెరీర్ కాస్త డ్యామేజ్ అయినట్లు చెప్పింది. ఆ విధంగా తెలుగు సినిమాలకు దురమైనట్లు చెప్పిన రచన మరో వివరణ కూడా ఇచ్చింది.

    మళ్ళీ రీ ఎంట్రీకి రెడీ

    మళ్ళీ రీ ఎంట్రీకి రెడీ

    ఇక భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తే మాత్రం తప్పకుండా తెలుగులో నటిస్తానని చెప్పింది. ఇక రచన బెంగాలీకి చెందిన ఒక నటుడిని పెళ్లి చేసుకొని సొంత భాషలోనే మంచి కెరీర్ ని సెట్ చేసుకుంది. అక్కడే సినిమాలు, సీరియల్స్ చేసుకుంటూ తన క్రేజ్ ని పెంచుకుంది. పైగా రియాలిటీ షోల ద్వారా కూడా రచనకు బెంగాలీలో డిమాండ్ బాగా పెరిగింది. మరి ఈ బ్యూటీ తెలుగు తెరకు ఎలాంటి రీ ఎంట్రీ ఇస్తుందో చూడాలి.

    English summary
    Bengali Beauty rachna Banerjee. Anyone who looks at this heroine will remember it very easily though. Many still call her a Telugu heroine. But she is not Telugu. Bengali Bhama. Telugu cinema is very close to the people with its natural looks
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X