Rambha: 42 ఏళ్లకు రంభ దశ తిరిగే ఛాన్స్.. ఆ హీరోతో ఏకంగా..!

సీనియర్ హీరోయిన్ రంభ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ బ్యూటీ నేటి తరం సినీ ప్రియులకు కూడా సుపరిచితమే. అయితే రంభ సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ఈ భామ.. అమెరికాలో సెటిల్ అయిపోయింది. సినిమా ఇండస్ట్రీలో అగ్రహీరోలందరితో నటించిన ఈ బ్యూటీ పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీ లైఫ్ గడుపుతోంది. ఇక తాజాగా ఈ భామ మళ్లీ టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది. అది కూడా స్టార్ హీరో సినిమా నుంచి... అసలు ఆ వివరాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఆ ఇంద్రుడి దగ్గర రంభ ఎలా ఉంటుందో తెలియదు.. మన తెలుగు ప్రేక్షకులకు రంభ అంటే ఇలానే ఉంటుందేమో అనేంతగా ఫిక్స్ అయ్యారు. అంతలా రంభ తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. రంభ తన అందం, అభినయం, డ్యాన్స్ తో ఆకట్టుకుంది. అచ్చం ఫారెన్ బ్యూటీలా క‌నిపించే రంభ... తెలుగు అమ్మాయి అని చాలా మందికి తెలియదు. విజ‌య‌వాడ‌లో పుట్టి పెరిగిన ఈ భామ అసలు పేరు విజయలక్ష్మి. అయితే సినిమాల్లోకి వచ్చాక.. ఆమె పేరును రంభగా మార్చారు.

Senior Heroine Rambha Reentry in Film Industry With Star Hero Movie News Goes Viral

ఇక 1990వ ద‌శ‌కంలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్‌, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ, భోజ్‌పురి, ఆంగ్ల భాష‌ల్లోనూ రంభ నటించింది. అప్పట్లోనే ఆమె పాన్ ఇండియా హీరోయిన్. కానీ అప్పట్లో ఇవన్నీ లేవు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా, పాన్ ఇండియా హీరో హీరోయిన్లు అంటున్నారు. కానీ ఆ కాలంలోనే రంభ పాన్ ఇండియా హీరోయిన్. ఈ విషయం చాలా మందికి తెలియదు.

ఇక రంభ చాలా సినిమాల్లో ఐటం సాంగ్స్ కూడా చేసింది. ఎన్నో సినిమాల్లో ఈ భామ తన డ్యాన్స్ తో ఆకట్టుకుంది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున.. ఇలా స్టార్ హీరోలందరితీ ఈ భామ స్క్రీన్ షేర్ చేసుకుంది. ఎంతో మంది స్టార్ హీరోలతో నటించి... సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ఇక రంభకు తన కెరియర్ లో ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. ఇక కెరియర్ డౌన్ అవుతున్న సమయంలోనే ఫ్యాన్స్ షాక్ ఇచ్చి పెళ్లి చేసుకుంది.

Senior Heroine Rambha Reentry in Film Industry With Star Hero Movie News Goes Viral

కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమార్ పద్మనాథన్‌ను 2010లో రంభ పెళ్లి చేసుకుంది. తిరుపతిలో వీరి పెళ్లి అప్పట్లో ఘనంగా జరిగింది. పెళ్లి త‌ర్వాత రంభ సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అంతే కాదు.. ఈ భామ ఏకంగా ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ బ్యూటీకి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. పిల్ల‌లు, భ‌ర్త బాగోగులు చూసుకుంటూ రంభ.. హోమ్ మేకర్ గా బిజీ అయిపోయింది. ఇక పెళ్లై పిల్లలు ఉన్నా.. రంభ మాత్రం తన గ్లామర్ ను మెయిన్ టైన్ చేస్తూ వస్తుంది.

ఇక తన సోషల్ మీడియాలో అభిమానులకు అందుబాటులో ఉంటూ.. ఎప్పటికప్పుడు తన ఫోటోలు, ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేస్తూ.. ట్రెండింగ్ లో ఉంటుంది. అయితే దాదాపు ద‌శాబ్దాన్న‌ర కాలం త‌ర్వాత రంభ మ‌ళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనుందట. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రంభ.. సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతుంది. ఇక ఎలాగో పిల్ల‌లు పెద్ద‌వారు కావడంతో.. మళ్లీ తను సినిమాల్లో అడుగుపెట్టబోతుందని సమాచారం.

Senior Heroine Rambha Reentry in Film Industry With Star Hero Movie News Goes Viral

తన వయసుకు తగ్గ పాత్రలు చేయాలని అనుకుంటుందంట. ఇందులో భాగంగానే టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ హీరో మూవీకి సైన్ చేసిందని తెలుస్తోంది. ఆ హీరో మూవీలో రంభ కీల‌క పాత్ర‌లో నటిస్తుందట. ఇక ఈ విషయం తెలుసుకుని రంభ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అవుతున్నారు. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే కాస్త ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X